Citroen Basalt SUV Coupe Review Video సిట్రోయిన్ కొత్త కారుని కొనుగోలు చేయవచ్చా?
ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయిన్ (Citroen) 2019లో భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత రెండేళ్లకు 2021లో కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ SUV C5 ఎయిర్‌క్రాస్‌ను భారతీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ కారు సంస్థ భారత్‌లో ఇప్పటి వరకు నాలుగు కార్లను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో ఒక ఒక ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. ఇప్పుడు సరికొత్త బాక్సీ డిజైన్‌లో బసాల్ట్ కూపే ఎస్‌యూవీ 5వ ఉత్పత్తిగా భారత్‌లోకి తీసుకు వస్తుంది. ఈ కారుని గోవాలో మా డ్రైవ్స్‌పార్క్ టీమ్ టెస్ట్-డ్రైవ్ చేసింది. ఈ SUV కూపేకి ఎలా ఉందంటే..
బసాల్ట్ ఇప్పటి వరకు మార్కెట్‌లో లోని కూపే స్టైల్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఎస్‌యూవీలో ఒక స్లోపింగ్ రూఫ్‌లైన్ ఉండటం వల్ల ఇది కూపే స్టైల్ డిజైన్‌తో రానుంది. ఈ డిజైన్‌లో అందుబాటులోకి వస్తున్న తొలి ICE వెర్షన్‌గా ఈ కూపే చరిత్ర తిరగరాయనుంది. 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ చుట్టూ బాడీ క్లాడింగ్‌ను పొందుతుంది. సైడ్ డిజైన్‌లో ఇది చూడటానికి అతి పెద్ద ఎస్‌యూవీగా కనిపిస్తుంది.
బసాల్ట్ ఇంటీరియర్‌లో ట్రిపుల్-టోన్ డాష్‌బోర్డ్‌ను కలిగి ఉంది. వైర్‌లెస్ Apple CarPlay మరియు Android Autoతో 10.25 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు 15W వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ కారులో ఎక్కువ స్టోరేజీ స్పేస్ ఉంటుంది. ఇంకా మరెన్నో అదనపు ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. ఇది మంచి ఇంజిన్, హై ఫర్ఫామెన్స్‌ని కలిగి ఉంది.
ఈ సిట్రోయిన్ బసాల్ట్ SUV కూపే ముఖ్యంగా మిడ్ రేంజ్ SUVలో సరికొత్త జోడింపుగా చెప్పవచ్చు. డిఫరెండ్ డిజైన్, మంచి ఫీచర్లను ఈ సిట్రోయిన్ కారు కలిగి ఉంది. ముఖ్యంగా యువ కొనుగోలుదారులను ఈ కారు ఆకర్షిస్తుంది. మంచి ఫీచర్లను కలిగి ఉండే కారుని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.



Click it and Unblock the Notifications








