ఆగస్టు నెల ఆ రెండు కార్లదే.. దేశంలో ఇలాంటి కార్లు ఇప్పటి వరకు రాలేదు!

భారతదేశంలో జనాలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్లలో సిట్రోయెన్ బసాల్ట్ (Citroen Basalt) ఒకటిగా ఉంది. దీనిని ఆగస్టు 2న అధికారికంగా విడుదల చేయాల్సి ఉండగా.. ఆ రోజున కారుకి సంబంధించిన ఫీచర్లు, తదితర వివరాలు మాత్రమే వెల్లడయ్యాయి. ఈ కారుని నేరుగా టాటా మోటార్స్‌కి చెందిన కర్వ్ ఎస్‌యూవీకి (Tata Curvv) పోటీ ఇవ్వనుంది. అయితే దీని ధర, విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. నేడు సిట్రోయెన్ బసాల్ట్ కారు లాంచ్ తేదీని అధికారికంగా ఆగస్టులో నెలలోనే విడుదల కానుంది. ఈ సరికొత్త ఎస్‌యూవీ కూపే కారు లాంచ్‌, ఇతర విషయాలు ఈ కథనంలో..

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయిన్ సెప్టెంబర్ 2022లో తన సీ5 ఎయిర్‌క్రాస్‌ మోడల్‌తో భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించింది. గత రెండేళ్లలో సిట్రోయెన్ కొన్ని కొత్త కార్లను ప్రవేశపెట్టింది. సీ5 ఎయిర్‌క్రాస్ మినహా ఆ తర్వాత సిట్రోయిన్ ప్రవేశపెట్టిన అన్ని కార్లు చౌక ధరలో కొనుగోలు దారులకు అందుబాటు ధరలో ఉన్నాయి. ఈ కార్లు మార్కెట్‌లో ఇప్పుడిప్పుడే సత్తా చాటుతున్నాయి.

Citroen-Basalt-SUV-Coupe-Price

అయితే భారతీయ ప్రజలకు సరిపోయే ధరలో కారును అందించడానికి సిట్రోయిన్ ఆసక్తి కనబరుస్తోంది. అందులో భాగంగానే కొత్త బసాల్ట్ కారును మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటు ధరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సిట్రోయిన్ బసాల్ట్ టాటా కర్వ్ కంటే చౌకగా ఉంటుందని మార్కెట్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో బసాల్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

టాటా కర్వ్‌కి ప్రధాన పోటీ దారుడిగా బసాల్ట్‌ ఎస్‌యూవీని భావిస్తున్నారు. ఈ కర్వ్ (ఆగస్టు 7)న మార్కెట్‌లోకి అధికారికంగా విడుదల చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఆగస్టులో ప్రధాన పోటీదారులుగా భావిస్తున్నారు. ఈ రెండు కార్లు ఒకే నెలలో మార్కెట్‌లోకి వస్తుండటంతో ఆటోమొబైల్‌ విశ్లేషకులు ఆశ్యర్యపోతున్నారు. రెండు కార్ల రాకతో మార్కెట్‌లో ఆగస్టు నెలకు క్రేజ్‌ పెరుగుతుందని భావిస్తున్నారు.

Citroen-Basalt-SUV-Coupe-Features

ఇటీవలి సంవత్సరాలలో, భారతదేశంలో ప్రజలు స్లిమ్‌ డిజైన్‌ (నిటారుగా) ఉండే బాడీతో ఎస్‌యూవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కూపే తరహా ఎస్‌యూవీ ఇప్పటి వరకు భారత్‌లో లాంచ్ కాలేదు. టాటా కర్వ్ అదే రోజు లాంచ్ అయ్యే మొదటి కూపే-స్టైల్ ఎస్‌యూవీగా ఉంది. ఆ తర్వాత సిట్రోయెన్ బసాల్ట్ నిలువనుంది. రెండు కీలక డిజైన్‌లో మార్కెట్‌లోకి రెండు కార్లు వస్తుండటం గమనార్హం.

కూపే తరహా ఎస్‌యూవీల్లో రూఫ్ వెనుక భాగం కాస్త ఎక్కువ స్లోప్‌ని కలిగి ఉంటుంది. అందువల్ల, ఇటువంటి ఎస్‌యూవీలు ఇతర ఎస్‌యూవీల కంటే భిన్నంగా ఉంటాయి. అలాగే, రాబోయే నెలల్లో కూపే తరహా ఎస్‌యూవీలను కొనుగోలు చేసే వారి సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త బసాల్ట్ భారతదేశంలో సిట్రోయిన్ నుంచి రాబోతున్న 5 కారుగా ఉంది.

Citroen-Basalt-SUV-Coupe-Launch-Date-Announced

మిగిలిన 4 సిట్రోయిన్ కార్లలో లభించని సాంకేతిక ఫీచర్లు ఇందులో చాలా ఉన్నాయి. సిట్రోయిన్ బసాల్ట్ రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 82bhp శక్తిని మరియు 115 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మరొక 1.2 టర్బో పెట్రోల్‌ ఇంజిన్ 109 bhp మరియు 190 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఇక టర్బో ఇంజిన్‌ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. ఈ కారు ధర కేవలం రూ. 10 లక్షల వద్ద అందుబాటులో ఉండనుంది. ఇక ఇది హ్యుందాయ్‌ క్రెటా, మారుతి బ్రెజా, కియా సోనెట్‌, సెల్టోస్‌, హ్యుందాయ్‌ వెన్యూ కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Monday, August 5, 2024, 19:17 [IST]
English summary
Citroen basalt suv coupe launch date officially announced in india check details in telugu
Read more on: #citroen #new cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+