రేపే మార్కెట్‌లోకి వస్తున్న కొత్త కారు.. దేశంలోనే ఇప్పటి వరకు లేని డిజైన్‌లో వస్తున్న కారు ఇదే!
సరికొత్త కూపే ఎస్‌యూవీ డిజైన్‌తో భారతీయ మార్కెట్‌లో చరిత్ర సృష్టించేందుకు సిట్రోయెన్ బసాల్ట్‌ని ఆ సంస్థ తీసుకువస్తుంది. రేపు (ఆగస్టు 9)న ఈ కూపే ఎస్‌యూవీ అధికారికంగా విడుదల కానుంది. ICE వెర్షన్‌లో విడుదల కానున్న తొలి కూపే ఎస్‌యూవీగా ఇది నిలువనుంది. టాటా మోటార్స్ ఇప్పటికే కర్వ్ కూపే ఎస్‌యూవీని ఆవిష్కరించింది. అయితే దాని ఐసీఈ వెర్షన్‌ని ఇంకా లాంచ్ కాలేదు. టాటా మోటార్స్ కర్వ్ ఈవీని నిన్న ఆగస్టు 07న విడుదల చేయగా.. పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లు సెప్టెంబర్ 2 న లాంచ్ కానున్నాయి. సిట్రోయిన్ ఇప్పటికే బసాల్ట్ ఫీచర్లు, డిజైన్, ఫీచర్లు, కలర్ ఆప్షన్స్, స్పెసిఫికేషన్లను ఇప్పటికే వెల్లడించింది. ఇక ఆగస్టు 9న ప్రకటించాల్సింది ధర మాత్రమే. దీని ధర రూ. 11 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ఉంటుదని భావిస్తున్నారు.
డిజైన్: సిట్రోయిన్ బసాల్ట్ కంపెనీ లైనప్‌లోని ఇతర మోడళ్ల మాదిరిగానే సీ 3 మరియు సీ 3 ఎయిర్‌క్రాస్ బాక్సీ ఎస్‌యూవీ ఆకారంతో వస్తుంది. అయితే ఇది కూపే బాడీ స్టైల్‌తో అందుబాటులో ఉంటుంది. దీనికి ఒక కూపే రూఫ్ లైన్ ఉంటుంది. చివరలో ఇన్‌బిల్ట్ లిప్ స్పాయిలర్‌తో కలిసిపోతుంది. కూపే డిజైన్‌లో ముఖ్యంగా మాస్ మార్కెట్‌ని ఆకట్టుకునేందుకు ఈ డిజైన్‌తో వస్తుంది. అల్లాయ్ వీల్ డిజైన్లను గమనించవచ్చు.

కలర్స్: ఇది వివిధ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిని ఏడు కలర్ ఆప్షన్స్‌లో తీసుకువస్తుండగా అందులో ఐదు మోనోటోన్, రెండు డ్యూయల్ టోన్ థీమ్స్ కలర్ ఆప్షన్లలో లభించనున్నాయి. ఈ మోనోటోన్ కలర్ ఆప్షన్లలో పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, కాస్మో బ్లూ, గార్నెట్ రెడ్ ఉన్నాయి. డ్యూయల్ టోన్ థీమ్స్ లో పోలార్ వైట్ గ్రే రూఫ్‌తో, గార్నెట్ రెడ్ బ్లాక్ రూఫ్‌తో ఉంటాయి.
ఫ్లాట్‌ఫామ్: సిట్రోయన్ బసాల్ట్ సీ3 మరియు సీ3 ఎయిర్‌క్రాస్ లతో ఉండే సీ-క్యూబ్డ్ (C-Cubed)తో ఫ్లాట్‌ఫామ్‌ని పంచుకుంటుంది. ఈ కూపే ఎస్‌యూవీ భారతదేశంలో ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం నుంచి వస్తున్న 4వ కారుగా ఉంది. బసాల్ట్ 2,651 మిమీ వీల్ బేస్‌ని కలిగి ఉంది. ఇది సీ3 ఎయిర్‌క్రాస్ వీల్ బేస్ కంటే 20 మిమీ చిన్నది. అలాగే 180 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది.

ఫీచర్లు: సిట్రోయిన్ బసాల్ట్ క్యాబిన్ లోపల కొత్త డిజైన్ లేఅవుట్‌ని కలిగి ఉంది. లేయర్డ్ డ్యాష్ బోర్డు, మల్టీఫంక్షనల్ డ్యాష్ బోర్డ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. క్యాబిన్ లోపల డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు లైట్ గ్రే కలర్ థీమ్ క్రేజీ లుక్‌ని అందిస్తుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇతర స్మార్ట్ కనెక్షన్స్‌ని కలిగి ఉంటుంది. ఇందులో 470 లీటర్ల బూట్ స్టోరేజ్ కలదు.
పవర్‌ట్రెయిన్: ఇందులోని 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 82bhp పవర్ మరియు 115nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను మాత్రమే పొందుతుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లేదు. 1.2 టర్బో పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లలో వరుసగా 110 bhp, 190 nm మరియు 210 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








