సిట్రోయిన్‌ బసాల్ట్‌ ఎస్‌యూవీ కూపే ఆవిష్కరణ.. ఈ సారి బొమ్మ అదుర్స్‌!!

త్వరలో విడుదల చేయబోయే సిట్రోయిన్ బసాల్ట్‌ ఎస్‌యూవీ కూపేని (Citroen Basalt SUV Coupe) ఆ సంస్థ ఆవిష్కరించింది. భారతదేశపు అత్యంత సరసమైన ఎస్‌యూవీ కూపేలుగా టాటా కర్వ్‌ (Tata Curvv), బసాల్ట్‌ నిలువనున్నాయి. ఈ రెండు ఒకే నెలలో విడుదల కానున్నాయి. సిట్రోయిన్ త్వరలో విడుదల చేయబోయే బసాల్ట్‌ టాటా కర్వ్‌కి గట్టి పోటీని ఇవ్వనున్నాయి. ఈ రెండు కార్లు ఇండియాలో కొత్త కూపే శకాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారత్‌లో లగ్జరీ కార్లకంటే తక్కువ ధరలో లభించే ఎస్‌యూవీలకు మంచి డిమాండ్‌ పెరుగుతుంది. తాజాగా బసాల్ట్, కర్వ్‌ భారత్‌లో అత్యంత సరసమైన ఎస్‌యూవీ కూపేలుగా నిలువనున్నాయి.

విడుదలకు ముందే సిట్రోయిన్‌ బసాల్ట్‌కి సంబంధించిన వివరాలను ఆ కంపెనీ విడుదల చేసింది. త్వరలో విడుదల కానున్న ఈ కారు రూఫ్‌లైన్‌ ట్రంక్ మూత వరకు విస్తరించి ఉంది. ఇక హెడ్‌ల్యాంప్‌లు సీ3 ఎయిర్‌క్రాస్‌లో వచ్చే విధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ముందు భాగంలో చంకీ బంపర్ ఉంది. అలాగే వెనుక భాగంలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్ తో పాటు కొత్త టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

Citroen-Basalt-SUV-Coupe-Revealed

ఇరువైపులా కొత్త అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీని డిజైన్‌పై సిట్రోయిన్ డిజైన్ హెడ్ పియరీ లెక్లెర్క్ వివరాలను వెల్లడించారు. కొత్త సిట్రోయిన్ బసాల్ట్ ఒక కొత్త రకం సిల్హౌట్‌తో వస్తుందని అన్నారు. ఇది భారతదేశంలో సీ3 మరియు సీ3 ఎయిర్ క్రాస్‌లకు అనుబంధంగా ఉంటుందని తెలిపారు. ఇక ఈ రెండింటితో పోల్చితే బెస్ట్ డిజైన్‌తో తీసుకువచ్చినట్లు వెల్లడించారు.

తాజా అధికారిక ప్రివ్యూలు సిట్రోయిన్ బసాల్ట్ లోడెడ్ ఇంటీరియర్‌ని కలిగి ఉంటుందని ధృవీకరించాయి. వైబ్రాంట్‌ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కప్ హోల్డర్లతో కూడిన ఫ్రంట్ అండ్ రియర్ ఆర్మ్‌రెస్ట్ అలాగే వెనుక భాగంలో ఫోన్ హోల్డర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇక ఇందులో టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్స్‌ ఉన్నాయి.

Citroen-Basalt-SUV-Coupe-Launch

వీటితో పాటు వైర్‌లెస్‌ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇక ఈ కూపే 1.2-లీటర్ మూడు సిలిండర్ల, టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 109 bhp మరియు 205nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్‌తో జతచేయబడుతుంది.

అతి త్వరలో విడుదల కాబోయే సిట్రోయిన్ బాసాల్ట్ అందిస్తున్న అద్భుతమైన ఫీచర్లు, ఇతర సేఫ్టీ ఫీచర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఏదేమైనా, ఇది సిట్రోయిన్‌ అడ్వాన్స్డ్ కంఫర్ట్ జోన్‌కి కట్టుబడి అందుబాటులోకి రానుంది. ఇది మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కొన్ని డీలర్‌షిప్‌లు ఇప్పటికే బసాల్ట్ కోసం బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ మంచి ఎస్‌యూవీ కోసం చూసే వారు దీనిని కొనుగోలు చేయవచ్చు.

Citroen-Basalt-SUV-Coupe

ప్రస్తుతం ఈ కారుకి సంబంధించి విడుదల కోసం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌ ధోనిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా సిట్రోయిన్‌ నియమించుకుంది. ధోని పేరిట సిట్రోయిన్ సీ3 ఎయిర్‌క్రాస్‌ లిమిటెడ్‌ కార్లను సైతం విడుదల చేసింది. ఈ ఫ్రెంచ్‌ కార్ల తయారీ సంస్థ భారత్‌లో మంచి మార్కెట్‌, భవిష్యత్తులోనూ మంచి ఉత్పత్తులను తీసుకురానున్నట్లు ఇది వరకే వెళ్లడించించింది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, July 25, 2024, 16:02 [IST]
English summary
Citroen basalt suv coupe revealed ahead of launch full details in telugu
Read more on: #citroen #new car #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+