అధికారికంగా సిట్రోయిన్ బసాల్ట్‌ ఫీచర్లు, ఇంజిన్‌, మైలేజీ వివరాలు వెల్లడి.. విడుదల తేదీ, ధర మాత్రమే పెండింగ్‌!

సిట్రోయిన్‌ నుంచి రాబోతున్న బసాల్ట్‌ ఎస్‌యూవీ కూపేకి (Basalt SUV Coupe) సంబంధించిన ఎక్స్‌టీరీయర్‌, ఇంటీరీయర్‌, ఇంజిన్‌ ఆప్షన్లను ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్‌లు మరియు ఫోటోలతో కస్టమర్‌ల దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పుడు పూర్తి ఫీచర్లను ప్రకటిచించింది. ఈ కారు కంపెనీ ఉత్పత్తులు C3, eC3, C3 ఎయిర్‌క్రాస్ మరియు C5 ఎయిర్‌క్రాస్‌ల తర్వాత మార్కెట్‌లోకి తీసుకువస్తున్న ఐదవ కారుగా ఉంది.

అయితే దీని లాంచ్ తేదీ, ధరలను సిట్రోయిన్‌ వెల్లడించలేదు. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ కారు ఇదే నెలలో లాంచ్‌ కానుంది. ఇక దీని ప్రారంభ ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద మార్కెట్‌లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 07న టాటా మోటర్స్‌ విడుదల చేయబోయే టాటా కర్వ్‌కి (Tata Curvv)కి ఇది నేరుగా గట్టి పోటీని ఇవ్వనుంది.

Citroen-Basalt-SUV-Coupe-Revealed

డిజైన్‌: అయితే ఇది C3 మరియు C3 ఎయిర్‌క్రాస్‌లలో ఉపయోగించే (CMP Modular) ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉండనుంది. ఈ విషయాన్ని సిట్రోయిన్‌ అధికారికంగా వెల్లడించింది. ఇది కంపెనీ సిగ్నేచర్ స్టైల్‌ని కలిగి ఉంది. అయితే దీనిని ఎస్‌యూవీ కూపే లుక్‌ వచ్చేలా కొన్ని మార్పులు చేశారు. హెడ్‌లైట్ సెటప్, స్ప్లిట్ DRLలు మరియు ఆకట్టుకునే బానెట్, రూఫ్‌లైన్‌ సిట్రియన్ క్రోమ్ ఫినిషింగ్ లోగోను ముందు భాగంలో అందించారు.

స్టైలిష్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌, కాన్సెప్ట్ అవతార్‌లో కనిపించే బ్లాక్-అవుట్‌ని గమనించవచ్చు. వెనుక భాగంలో ఇది C3 ఎయిర్‌క్రాస్‌ మాదిరిగా ఉంటుంది. అయితే బ్లాక్-అవుట్ బంపర్‌ని గమనించవచ్చు. అదనపు సేఫ్టీ కోసం సిల్వర్ ఫినిషింగ్ స్కిడ్ ప్లేట్‌ను పోలి ఉండే ర్యాప్‌రౌండ్ LED టెయిల్ లైట్లను అందిచారు. ఇది ఈ కూపేకు అదనపు లుక్‌ని అందించనుంది.

Citroen-Basalt-SUV-Coupe

ఫీచర్లు: క్యాబిన్ లోపల మరిన్నీ ప్రీమియం ఫీచర్లను సిట్రోయిన్ జోడించింది. ఇందులో 7-అంగుళాల పూర్తి డిజిటల్ క్లస్టర్, 10.2-ఇంచెస్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్, ఆపిల్ మరియు ఆటో కార్‌ప్లేతో సహా అన్ని వైర్‌లెస్ కార్ కనెక్ట్ టెక్నాలజీకి యూనిట్‌కి ఈ కూపే సపోర్ట్‌ చేస్తుంది. పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్లు కూడా అందించబడ్డాయి.

సేఫ్టీ & ఇంజిన్‌: ఈ కారులో ప్రయాణించే ప్రయాణీకుల సేఫ్టీ కోసం ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఇక ఈ కారు ఇంజిన్ రెండు మోటారు ఆప్షన్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ మరియు 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్‌ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ కలవు.

Citroen-Basalt-SUV-Coupe

ఇందులోని మొదటి ఇంజిన్ గరిష్టంగా 82bhp పవర్‌ మరియు 115 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇది లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుంది. ఇక 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ గరిష్టంగా 110 bhp పవర్ మరియు 205 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి.

మైలేజీ పరంగా ఇది లీటరుకు 18.7 కిలోమీటర్ల నుంచి 19.5 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇది నేరుగా టాటా కర్వ్‌తో పోటీ పడనుంది. అంతే కాకుండా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోని హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా మరియు కియా సెల్టోస్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది. ధర ప్రకటన తర్వాతే ఈ కూపేపై జనాలు ఆసక్తి కనబరిచే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 3, 2024, 13:33 [IST]
English summary
Citroen basalt suv coupe revealed officially check specifications and expected price details
Read more on: #citroen #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+