దేశంలోనే తొలి SUV కూపేను ధైర్యంగా కొనండి.. సేఫ్టీ టెస్ట్‌లో దుమ్మురేపింది!

సిట్రోయిన్‌ బసాల్ట్ ఎస్‌యూవీ కూపే (Citroen Basalt SUV Coupe) భారత్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్‌ రేటింగ్‌ని సాధించింది. ఇటీవలె విడుదలైన టాటా కర్వ్ ఎస్‌యూవీ కూపేకు పోటీగా వచ్చిన ఈ బసాల్ట్ 4 స్టార్ రేటింగ్‌తో దుమ్మురేపింది. ఇప్పటి వరకు ఆ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న కార్లు సేఫ్టీలో తేలిపోయాయి. తొలిసారిగా సిట్రోయిన్ కారు భారత్ ఎన్‌సీఏపీలో సత్తా చాటింది. భారతదేశంలో స్వదేశీ కార్ సేఫ్టీ అసెస్మెంట్ ప్రోగ్రామ్ కింద పరీక్షించిన మొదటి టాటాయేతర కారు బసాల్ట్ కావడం విశేషం.

ఇక ఓవరాల్‌గా పిల్లలు, పెద్దల సేఫ్టీలో బసాల్ట్ కూపే 4-స్టార్ రేటింగ్ పొందింది. పెద్దల సేఫ్టీలో సిట్రోయిన్‌ బసాల్ట్ 32 కు 26.19 పాయింట్లుగా సాధించింది. పిల్లల సేఫ్టీలో 49 కు 35.90 పాయింట్లు సాధించింది. ఆగస్టులో దీనికి సంబంధించిన క్రాష్ టెస్ట్‌ని నిర్వహించారు. బసాల్ట్‌లోని టాప్-స్పెక్ 1.2 టర్బో మ్యాక్స్ వేరియంట్ క్రాష్ టెస్ట్‌కి పంపారు. ఇందులో ఆటోమేటిక్, మాన్యువల్ ఆప్షన్లను పరీక్షించారు.

Citroen Basalt SUV Coupe BNCAP Crash Test

ఫ్రంటల్ ఆఫ్‌సెట్‌ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో బసాల్ట్ 16 పాయింట్లకు గాను 10.19 పాయింట్లు సాధించాడు. ఈ క్రాష్‌ టెస్ట్‌లో డ్రైవర్ తల, మెడకు, ముందు సీట్లో ఉన్న ప్రయాణికుడికి మంచి సేఫ్టీని కల్పించారు. అదే సమయంలో, డ్రైవర్ ఛాతీ, తొడలు కాస్త తక్కువ రక్షణను కలిగి ఉన్నాయి. ముందు భాగంలో ప్రయాణికుడికి ఛాతీకి తగినంత రక్షణ తొడలకు రక్షణ తక్కువగా ఉంది.

ఇక సైడ్ మూవింగ్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో బసాల్ట్ 16కు 16 స్కోర్‌ని సాధించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్, ఐసోఫిక్స్ యాంకరేజ్స్‌, అన్ని సీట్లకు 3 పాయింట్ల సీట్ బెల్ట్స్‌, సీట్ బెల్ట్ రిమైండర్, పార్కింగ్ సెన్సార్లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) వంటి ఫీచర్లు ఉన్నాయి.

Citroen Basalt SUV Coupe Secures 4 Star Rating in BNCAP

సిట్రోయిన్ బసాల్ట్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. మొదటిది 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పవర్ట్రెయిన్‌ని కలిగి ఉంది. ఇది 80 bhp పవర్‌, 115 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. దీంతో పాటు పవర్‌ఫుల్‌ 1.2-లీటర్, 3-సిలిండర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది.

ఇందులోని 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఇంజిన్ గరిష్టంగా 109 bhp పవర్, 190 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సమయంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌పై టార్క్ 205 nmకు పెరుగుతుంది. భారత మార్కెట్‌కి అంతగా పరిచయం లేని కూపే-స్టైల్ కారు అయినప్పటికీ, సిట్రోయెన్ ఈ కారు ప్రారంభ ధర కేవలం రూ .8 లక్షల వద్ద తీసుకువచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది.

దీని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.13.83 లక్షలుగా ఉంది. కర్వ్ కంటే తక్కువ ధరను టాటా నిర్ణయించినప్పటికీ, బసాల్ట్ అమ్మకాలకు ఆశించిన స్థాయిలో రాలేదు. 2024 ఆగస్టులో లాంచ్ అయిన బసాల్ట్‌ మొదటి నెలలో బసాల్ట్ 579 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అయితే 2024 సెప్టెంబర్‌లో అమ్మకాలు 341 యూనిట్లకు పడిపోయాయి.

ఇక భారత్‌లో క్రాష్‌ టెస్ట్‌లకు సంబంధించి NCAP క్రాష్‌ టెస్ట్‌లను 2023 అక్టోబర్‌లో ప్రారంభించింది. ఇప్పటి వరకు టాటా హారియర్, సఫారీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ సహా వివిధ వాహనాలకు సేఫ్టీ టెస్ట్‌లను నిర్వహించింది. మారుతి సుజుకి కూడా తమ కార్లను భారత్ NCAP క్రాష్ టెస్టింగ్ కోసం పంపింది. దీనికి సంబంధించిన ఫోటోలు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ టెస్ట్‌ రిజల్ట్స్‌ బయటకు రాలేదు.

More from DriveSpark

Article Published On: Saturday, October 12, 2024, 16:05 [IST]
English summary
Citroen basalt suv coupe secures 4 star rating in bncap crash test check details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+