దేశంలోనే తొలి కూపే స్టైల్ ఎస్‌యూవీ సిట్రోయిన్ బసాల్ట్ వేరియంట్ల వారీగా ధరలు వెల్లడి
తాజాగా సిట్రోయిన్ ఇండియా విడుదల చేసిన బసాల్ట్ ఎస్‌యూవీ కూపే (Basalt SUV Coupe) పూర్తి ధరలు, వేరియంట్ల వివరాలను ఆ కంపెనీ వెల్లడించింది. ముందుగా చెప్పినట్లుగానే ఈ కారు ప్రారంభ ధరను రూ .7.99 లక్షలుగా ప్రకటించింది. ఈ సిట్రోయిన్ బసాల్ట్ యూ (You) 7.99 లక్షలు, ప్లస్ (Plus) రూ.9.99 లక్షల నుంచి 12.79 లక్షలు, మ్యాక్స్ (Max) వేరియంట్ ధర 12.28 లక్షల నుంచి రూ. 13.62 లక్షలుగా ఉంది. వీటి డెలివరీలు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. కస్టమర్‌లు కంపెనీకి చెందిన లా మైసన్ సిట్రోయిన్ (La Maison Dealerships) డీలర్‌షిప్‌లలో వీటిని టెస్ట్‌డ్రైవ్ చేయవచ్చు.
ఇంజిన్స్: ఈ సిట్రోయిన్ బసాల్ట్ కూపే రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 80 bhp మరియు 115nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రత్యేకంగా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో జతచేయబడింది. రెండో ఇంజిన్ 1.2-లీటర్ మూడు సిలిండర్ల టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

ఈ ఇంజిన్ 109 bhp పవర్‌ని 190 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 205 ఎన్ఎమ్ టార్క్ అందించే టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జతచేశారు. 1.2 NA ఇంజిన్ లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజీ 1.2 టర్బో పెట్రోల్ మాన్యువల్ లీటరుకు 19.5 కిలోమీటర్లు, ఆటోమేటిక్ లీటరుకు 18.7 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుంది.
బసాల్ట్ కూపేలో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, రాప్ రౌండ్ టెయిల్ లైట్లు, రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ రెండో వరుసలో ప్రయాణీకులకు సర్దుబాటు చేయదగిన థై సపోర్ట్ (Thigh Support) వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కూపే ఎస్‌యూవీలో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో పాటు వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది.

సేఫ్టీకి పరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ), పార్కింగ్ సెన్సార్లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్) ఉన్నాయి. ఈ కూపే ఎస్‌యూవీ పోలార్ వైట్, గార్నెట్ రెడ్, ప్లాటినం గ్రే, కాస్మో బ్లూ, స్టీల్ గ్రే మోనోటోన్ కలర్స్‌లో లభిస్తుంది. ఇక గ్రే రూఫ్ పోలార్ వైట్, బ్లాక్ రూఫ్ గార్నెట్ రెడ్ డ్యూయల్-టోన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంటుంది.
2021లో ఈ కారు సంస్థ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేక పోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా భారతీయ మార్కెట్‌లో నిలదొక్కుకోవాలనే ఈ కూపే ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ సంస్థ ప్రస్తుతం C5 Aircross, C3, EC3, C3 Aircross మోడల్స్‌ని విక్రయిస్తుంది. ఇందులో C5 Aircross ధర ఎక్కువగా ఉంటుంది.

ఇది మార్కెట్‌లో టాటా కర్వ్‌కి నేరుగా ఆ తర్వాత హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి కాంపాక్ట్ SUVలకు గట్టి పోటీని ఇస్తుంది. విలక్షణమైన ఎస్‌యూవీ కూపే డిజైన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయ వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా దీనిని తీసుకువచ్చినట్లు ఆ కంపెనీ ఇండియా సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ హజాలా తెలిపారు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








