కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ బసాల్ట్ విజన్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ తన కొత్త కాంపాక్ట్ SUV కూపే కాన్సెప్ట్ 'సిట్రాన్ బసాల్ట్ విజన్'ను ఆవిష్కరించింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ 2024 ద్వితీయార్థంలో భారత మార్కెట్‌తో పాటు దక్షిణ అమెరికాలో విడుదల కానుంది. ఈ ఎస్‌యూవీ గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో..
సిట్రోయెన్ బసాల్ట్ విజన్ కాంపాక్ ఎస్‌యూవీ.. శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు స్టైలిష్ మోడల్‌తో సంస్థ దీనిని తీసుకువస్తోంది. కస్టమర్లకు కూపే అనుభూతితో పాటు దృఢత్వాన్ని కలిగి ఉంటూ 5- డోర్ల డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో సిట్రోయెన్ C-3 మరియు C-3 ఎయిర్ క్రాస్‌లతో పాటు బసాల్ట్ విజన్ కూడా భారీ డిమాండ్‌తో కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ తెలిపింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో సిట్రోయెన్‌ను బలోపేతం చేసేందుకు మూడవ ఎడిషన్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని సిట్రోయెన్ CEO థియరీ కోస్కాస్ అన్నారు. రాబోయే నెలల్లో బోల్డ్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్ స్పేస్ మరియు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతితో ఈ SUVని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
కాగా సిట్రోయెన్ బసాల్ట్ విజన్‌ను స్థానికంగా అభివృద్ధి చేసి తయారు చేసినట్లు థియరీ కోస్కాస్ అన్నారు. దీని సామర్థ్యంతో గ్లోబల్ వ్యాప్తంగా కీలక మార్కెట్లలో తమ స్థానాన్ని పటిష్ఠం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో కస్టమర్లను ఆకర్షిస్తుందన్నారు. త్వరలో ఈ కారుకు సంబంధించి అన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

ఆటో మొబైల్ పరిశ్రమలో సిట్రోయెన్ బసాల్ట్ విజన్ కాంపాక్ట్ SUV పాత్ర ప్రతిష్టాత్మకమైనదిగా ఉండనుంది. ఎందుకంటే ఇది శక్తివంతమైన మరియు అద్భుతమైన డిజైన్‌తో రహదారిపై సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఎస్‌యూవీ దీని ఎత్తు, గ్రౌండ్ క్లియరెన్స్, పొడవాటి బానెట్, స్ట్రెయిట్ ఫ్రంట్ ఎండ్ మరియు ప్రత్యేకమైన ఆకృతులతో కూడిన ప్రొటెక్టెడ్ వీల్ ఆర్చ్‌లు SUV రూపాన్ని మరింత మెరుగుపరిచాయి.
C-3 మరియు C-3 ఎయిర్ క్రాస్ కార్లను సిట్రోయెన్ శ్రేణికి కొత్తగా చేర్చిన తర్వాత, Citroen బసాల్ట్ విజన్ అనేది C-Cubed ప్రోగ్రామ్‌లో 3వ మోడల్ అని సిట్రోయన్ తెలిపింది. ప్రత్యేకంగా భారత్ మరియు దక్షిణ అమెరికాలో వృద్ధిని నిర్ధారించడానికి దీనిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

సిట్రోయెన్ బసాల్ట్ విజన్ ధరకు న్యాయం చేకూర్చేలా ఏకైక డిజైన్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతితో ఈ ప్రత్యేకమైన ఉత్పత్తిని అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. కాగా సిట్రోయెన్ C3, C3 ఎయిర్‌క్రాస్, బసాల్ట్ విజన్.. మూడు మోడల్స్ ఒకే స్మార్ట్ కార్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా దీనిని ప్రత్యేకంగా రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది.
కొత్తగా డిజైన్ చేయబడిన LED హెడ్‌ల్యాంప్‌లు, ట్వీక్ చేసిన ఫ్రంట్ బంపర్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్, చంకీ వీల్ ఆర్చ్‌లు మరియు డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ హ్యూ అన్నీ అద్భుతంగా కనిపిస్తాయి. సైడ్ వ్యూ యొక్క హైలైట్ గన్-మెటల్ ఫినిషింగ్‌తో కూడిన స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక వైపు బసాల్ట్ LED టెయిల్‌ల్యాంప్‌లు, సిల్వర్ ఫాక్స్ ప్లేట్ మరియు మధ్యలో పెద్ద సిట్రోయెన్ లోగోతో ఆకర్షణీయంగా ఉంది.

ఇంటీరియర్ పంరగా బసాల్ట్ కూపే SUV వైర్‌లెస్ కనెక్టివిటీ, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, కీలెస్ ఎంట్రీ, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్‌తో వస్తుంది. కారులో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉండొచ్చని తెలుస్తోంది. సేఫ్టీ ఫీచర్ల పరంగా సిట్రోయెన్ బసాల్ట్ స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, సెన్సార్‌లతో రియర్ పార్కింగ్ కెమెరా, ISOFIX మరియు TPMS వంటి ఆధునిక అంశాలతో నిండి ఉంది.
బసాల్ట్ సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ మాదిరిగానే అదే ఇంజిన్‌తో పనిచేస్తుందని సమాచారం. బసాల్ట్ 1.2-లీటర్, మూడు-సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో ఆధారితమైనదిగా చెప్పవచ్చు. ఇది 5,500 rpm వద్ద 108 bhp శక్తిని మరియు 1,750-2,500 rpm వద్ద 205 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఉండవచ్చు.


Click it and Unblock the Notifications








