Citroen C3 Aircross Automatic Review Video సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ పర్మామెన్స్ రివ్యూ వీడియో
ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ తన C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజైన్ సహా ఇతర విభాగాల పనితీరుతో ఆకట్టుకుంది. ఈ వేరియంట్‌ను మా డ్రైవ్‌స్పార్క్ బృందం రివ్యూ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో మీకోసం.
C3 ఎయిర్‌క్రాస్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్‌ను మాత్రమే సిట్రోయెన్ కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. 1.2 లీటర్ టర్బో ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అమర్చింది. ఈ గేర్‌బాక్స్‌ను జపాన్‌కు చెందిన Aisin నుంచి తీసుకుంది.
ఈ ఇంజిన్ గత మోడల్ కంటే 15Nm టార్క్‌ను అదనంగా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా ఈ ఇంజిన్ గరిష్ఠంగా 205Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 108.4 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్‌లో చేసిన మార్పుల కారణంగా సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ బరువు 34 కేజీలు పెరిగింది. ఈ గేర్‌బాక్స్ మినహా సెట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్‌లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు.

సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్‌లో మాన్యువల్ వెర్షన్‌తో పోలిస్తే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్ బరువు పెరిగింది. బరువు పెరగడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మాన్యువల్ వేరియంట్ మాదిరిగానే ఇంజిన్ ఎంతో సౌకర్యవంతంగా ఉంది. మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని కలిగిస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్‌ను గుర్తించే విధంగా సెట్రోయెన్ ఎటువంటి చిహ్నాలు కారుపై ముద్రించలేదు.


Click it and Unblock the Notifications








