ధోని పేరుతో కారు.. కేవలం 100 కార్లు మాత్రమే విడుదల.. 7 నంబర్‌తో ప్రత్యేక డిజైన్‌

MS ధోనీకి భారత్‌లో క్రేజ్‌ ఎక్కువ. ధోనికి ఉన్న ప్రత్యేక బ్రాండ్‌ వ్యాల్యూ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ధోనిని అంబాసిడర్‌గా చేసుకునేందుకు కంపెనీలు క్యూ కడతాయి. మార్కెట్‌లో అతనికి ఉన్న బ్రాండ్‌ వ్యాల్యూ ఇతర క్రికెటర్లకు లేదు. ప్రస్తుతం ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్‌కి ధోనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు. భారత్‌లో సేల్స్ పెంచుకోవడానికి ధోనితో ఆ కంపెనీ జట్టు కట్టింది. దీంతో ఆ కంపెనీ భారత్‌లో మంచి మార్కెట్‌ లభిస్తుందని ఆశిస్తుంది. అందులో భాగంగానే సిట్రోయెన్ తన సీ3 ఎయిర్‌క్రాస్ కారు మోడల్‌లో కొత్త 'ధోని ఎడిషన్'ను ప్రవేశపెట్టింది. దాని వివరాలు ఈ కథనంలో..

భారత్‌లో కార్లకు ఉన్న డిమాండ్‌ని ఒడిసి పట్టేందుకు సిట్రోయెన్ ప్రయత్నిస్తోంది. భారత మార్కెట్‌లో ఈ కారు కంపెనీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా సంప్రదాయ కార్లకు బదులుగా ఎయిర్‌క్రాస్‌ ఫిజిక్ కార్లను భారత్లో ప్రవేశపెట్టడం ఆ తర్వాత ఎంఎస్ ధోనీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం ఇవన్నీ ఆ కంపెనీ ప్రయత్నాలకు నిదర్శనాలుగా ఉన్నాయి.

Citroen-Aircross-MS-Dhoni-Edition

తాజాగా సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌ను ఎంఎస్ ధోనీ ఎడిషన్‌లో ప్రవేశపెట్టారు. ఈ కారు చాలా తక్కువ కాలం మాత్రమే అమ్మకానికి ఉండనుంది. ఈ సీ3 ఎయిర్ క్రాస్ ధోనీ ఎడిషన్‌లో కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు సిట్రోయెన్ ప్రకటించింది. ఈ సీ3 ఎయిర్ క్రాస్ ధోనీ ఎడిషన్‌పై ధోనీ పేరు, '7' అనే నంబర్ తో కూడిన సైన్ బోర్డు ఉంటుంది.

ముఖ్యంగా '7' స్టిక్కర్ చాలా పెద్దది ఉంటుంది. దూరం నుంచి కారు చూసినా 7 నంబర్ కనిపిస్తుంది. ఇది కాకుండా ఈ స్పెషల్ ఎడిషన్ కారు కొనుగోలుదారులకు యాక్ససరీలను కూడా అందించాలని సిట్రోయెన్ యోచిస్తోంది. దీనితో మీరు సిట్రోయెన్ సి 3 ఎయిర్‌క్రాస్‌ కార్ల కంటే భిన్నమైన డిజైన్‌ని పొందవచ్చు.

కలర్‌ఫుల్‌ సీట్ కవర్స్‌, కుషన్ దిండులు, సీట్ బెల్ట్ కుషన్లు, ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్లు, ముందు భాగంలో డ్యాష్ బోర్డ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. కస్టమర్లను ఆకర్షించడానికి కారు లోపల గ్లోవ్ బాక్సుపై ఎంఎస్ ధోనీ సంతకం ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని సిట్రోయెన్ ప్రకటించింది. ఈ కొత్త సీ3 ఎయిర్‌క్రాస్‌ ధోనీ ఎడిషన్ ధర రూ .11.82 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

ఈ కొత్త కారు బుకింగ్స్ జూన్ 18న అధికారికంగా ప్రారంభమయ్యాయి. మరిన్ని వివరాలకు సమీప సిట్రోయెన్ డీలర్‌షిప్ సెంటర్ లేదా సిట్రోయెన్ ఇండియా అధికారిక వెబ్ సైట్‌ని సందర్శించి వివరాలు తీసుకోవచ్చు. త్వరగా బుకింగ్స్ చేసుకోవడం వల్ల ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ని సొంత చేసుకోవచ్చు. మళ్లీ ఈ కార్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉండకపోవచ్చు.

ఈ కారు కొత్త MS ధోని ఎడిషన్ విడుదల గురించి సిట్రోయెన్ ఇండియా డైరెక్టర్ శిశిర్ మిశ్రా మాట్లాడుతూ.. సీ 3 ఎయిర్‌క్రాస్‌ ప్రత్యేకమైన 'ధోని ఎడిషన్' ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. కేవలం పరిమిత 100 యూనిట్లలో ఉన్నా కానీ మా బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని ఉండటం వల్ల ఆయన గొప్పతనం, నాయకత్వం మరియు శ్రేష్ఠత ఉత్తమ అనుభూతిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 19, 2024, 11:10 [IST]
English summary
Citroen c3 aircross dhoni special edition launched at rs 11 82 lakhs
Read more on: #citroen #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+