సేఫ్టీలో ఆ కారుకి 'జీరో' రేటింగ్.. ముందు సీట్లలో కూర్చున్న వారి ప్రయాణం గాలిలో దీపం పెట్టినట్లే!
ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ భారతీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సంస్థకు చెందిన కార్లు ఇటీవలె మార్కెట్‌లో మంచి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. ఆ కంపెనీ నుంచి అత్యధికంగా సిట్రోయిన్ సీ3 (Citroen C3 Aircross) అమ్ముడవుతోంది. ఆ తర్వాత సిట్రోయిన్ బసాల్ట్ (Basalt Coupe) ఇతర మోడళ్లు సేల్ అవుతున్నాయి. ఈ సంస్థ నుంచి అందుబాటులో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ కారు సిట్రోయిన్ eC3 అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ కారు సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. సిట్రోయిన్ బసాల్ట్ కూపే ఎస్‌యూవీ మార్కెటింగ్ కోసం ధోని ఈ సైన్ చేశాడు.
తాజాగా ఈ కంపెనీకి చెందిన సిట్రోయిన్ సీ3 ఎయిర్‌క్రాస్ సేఫ్టీలో తేలిపోయినట్లు షాకింగ్ రిపోర్ట్ వెల్లడైంది. సేఫ్టీలో జీరో రేటింగ్‌తో కస్టమర్లకు క్వశ్చన్ మార్క్‌గా మారింది. తాజాగా లాటిన్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు ఏమాత్రం రాణించలేదు. గంటకు 64 కిలోమీటర్ల వేగంతో సీ3 ఎయిర్‌క్రాస్‌ని ఢీకొట్టగా.. అస్సలు సురక్షితం కాదని తేలింది. ఈ క్రాష్ టెస్ట్ చాలా మందిని షాక్‌కి గురిచేస్తోంది.

ప్రస్తుతం చాలా కంపెనీలు ప్రయాణీకుల సేఫ్టీ కోసం మెరుగైన ప్రమాణాలతో కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ కారు సురక్షితం కాదని తేలడంతో దీనిని కొనుగోలు చేసిన కస్టమర్లు కాస్త అయోమయంలో మునిగిపోతున్నారు. ఇది నిజంగా ఈ సంస్థను ఇష్టపడే వారికి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. మార్కెట్‌లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న తరుణంలో సేఫ్టీ టెస్ట్‌లో తేలిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అయితే ఇది భారత్‌లో విక్రయిస్తున్న సిట్రోయిన్ సీ3 ఎయిర్‌క్రాస్ కాదని ప్రజలు గమనించాలి. బ్రెజిల్‌లో అందుబాటులో ఉన్న కారుని మాత్రమే క్రాష్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో పెద్దల సేఫ్టీలో 33 శాతం, పిల్లల సేఫ్టీలో 11.37 శాతం స్కోర్ మాత్రమే లభించింది. దీంతో తక్కువ స్కోర్ కారణంగా సేఫ్టీ పరంగా జీరో స్టార్ రేటింగ్‌ని ఇచ్చారు. ఈ కొత్త సిట్రోయిన్ సీ3 ఎయిర్‌క్రాస్ కొన్ని భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ముందు భాగంలో రెండు ఎయిర్‌బ్యాగ్స్, బెల్ట్ లోడ్ లిమిటర్, సీట్ బెల్ట్ రిమైండర్, ESC వంటి సేఫ్టీ ఫీచర్లు మాత్రమే ఉన్నాయి. అయినా కానీ ఈ కారు సేఫ్టీలో ఒక్క స్టార్‌ని కూడా సాధించలేక పోయింది. ఇందులో కర్టెన్ టైప్ ఎయిర్‌బ్యాగ్స్, చెస్ట్ ఎయిర్‌బ్యాగ్స్, లెగ్, హిప్ ఎయిర్‌బ్యాగ్స్ లేవు. సీట్ బెల్ట్ రిమైండర్ కేవలం డ్రైవర్‌కు మాత్రమే అందిచారు. ఇది లాటిన్ NCAP ప్రోటోకాల్‌లకు అనుగుణంగా లేదు.
స్పీడ్ అసిస్టెన్స్‌తో పాటు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ సపోర్ట్ సిస్టమ్స్, రోడ్ ఎడ్జ్ డిటెక్షన్, AEB ఇంటర్‌అర్బన్ వంటి ఫీచర్లు అందుబాటులో లేనందున దీని స్కోర్ భారీగా తగ్గింది. ఈ సేఫ్టీ ఫీచర్లతో కొరతతో సిట్రోయిన్ జీరో రేటింగ్ వచ్చింది. ఈ క్రాష్ టెస్ట్‌లో ముందు ప్రయాణికుడితో పాటు డ్రైవర్ వక్షోజాలు, తొడలు దెబ్బతినట్లు తేలింది. తద్వారా 1 స్టార్‌ని కూడా సాధించలేక పోయింది.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: సిట్రోయిన్ సీ3 ఎయిర్‌క్రాస్ కూడా భారత్‌లో అమ్మకానికి ఉంది. అయితే మీకు పైన చెప్పిన విధంగా కేవలం బ్రెజిల్ మార్కెట్‌లో అమ్ముడవుతున్న సీ3 ని టెస్ట్ చేశారు. అందువల్ల భారత్‌లో అమ్మకానికి ఉన్న కార్లపై సేఫ్టీపై ఆందోళ చెందాల్సిన అవసరం లేదు. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే భారత్‌లో అమ్మకానికి ఉన్న సీ3 ఎయిర్‌క్రాస్‌కి, అలాగే బ్రెజిల్ మార్కెట్ కారుకి మధ్య భారీ తేడాలున్నాయని గమనించాలి.


Click it and Unblock the Notifications