కార్ ప్రియులకు గుడ్ న్యూస్.. కొత్త కలర్ వేరియంట్‌లో సిట్రోయెన్ C3.. వివరాలివే.!!
భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న కార్ల కంపెనీల్లో ఒకటి సిట్రోయెన్. ఈ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ భారత్‌లో ఐదు రకాల మోడల్ కార్లను విక్రయిస్తోంది. ఈ క్రమంలో సిట్రోయెన్ నుంచి ప్రముఖ మోడల్ Citroen C3 కి సంబంధించి ఓ అప్‌డేట్‌ను సంస్థ తీసుకువచ్చింది. అదేంటంటే..
మార్కెట్లో సిట్రోయెన్ సీ3 మోడల్‌ను మరో కొత్త రంగులో సంస్థ ప్రవేశపెట్టింది. ఈ ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పటికే మార్కెట్లో నాలుగు మోనోటోన్, ఏడు డ్యూయల్ టోన్ కలర్ ఎక్స్‌టీరియర్ పెయింట్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అంతే కాకుండా ఈ కారును సంస్థ మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. కాగా Citroen C3.. దేశీ మోడల్ టాటా పంచ్‌కు ఈ సెగ్మెంట్‌లో ప్రత్యర్థిగా ఉంది.

ఈ క్రమంలో కస్టమర్లు ఇప్పుడు కొత్త సిట్రోయెన్ C3 ని కాస్మో బ్లూ కలర్‌లో డ్యూయల్ టోన్ ఫినిషింగ్‌తో కొనుగోలు చేసుకోవచ్చు. భారత మార్కెట్లో కొత్త సిట్రోయెన్ సీ3 ధర రూ. 6.16 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. అయితే సంస్థ ఈ హ్యాచ్‌బ్యాక్‌ను కొత్త కలర్ ఆప్షన్‌లో ప్రవేశపెట్టగా.. మరో కలర్ ఆప్షన్‌ను తొలగించింది.
సిట్రోయెన్ సీ3 హ్యాచ్‌బ్యాక్‌ను జెస్టీ ఆరెంజ్ కలర్ ప్రైమరీ పెయింట్ ఆప్షన్‌లో కస్టమర్లు కొనుగోలు చేయలేరు. ఈ కలర్ ఆప్షన్‌ను మార్కెట్ నుంచి తొలగించినట్లు సంస్థ ప్రకటించింది. సిట్రోయెన్ C3 హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు పోలార్ వైట్, ప్లాటినం గ్రే, స్టీల్ గ్రే మరియు కాస్మో బ్లూతో సహా నాలుగు మోనోటోన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

ఇక సిట్రోయెన్ సీ3 ఇంజిన్ విషయానికొస్తే రెండు ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. మొదటిది 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజిన్.. 81bhp మరియు 115Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండవది 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్.. 109bhp మరియు 190Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ రెండు ఇంజిన్లు ఒకే 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.
కాగా భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న Citroen C3 Aircross ధర రూ. 9.99 లక్షలుగా ఉంది. లీటర్‌కు 17-18 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. సిట్రోయెన్ C3 లీటర్‌కు 19 కి.మీ మైలేజ్‌ను ఇస్తుంది. సిట్రోయెన్ C5 Aircross ధర రూ. 37.67 లక్షలుగా ఉంది. 17 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది.

కాగా మార్కెట్లో సిట్రోయెన్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా ఓ మోడల్‌ను విక్రయిస్తోంది. Citroen eC3 మోడల్‌కు మార్కెట్లో మంచి ప్రజాదరణ ఉంది. ధర రూ. 11.61 లక్షలుగా ఉంది. ఇక Citroen C3X crossover మోడల్ ధర రూ. 12 లక్షల్లో విక్రయిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








