ఆ కంపెనీని నష్టాల నుంచి లాభాల బాటలో నడిపిస్తున్న ఏకైక కారు.. ధర రూ. 6 లక్షలు, 19 కి.మీ మైలేజీ

ప్రముఖ ఫ్రెంచ్‌ కార్ల తయారీ సంస్థ సిట్రోయిన్‌ (Citroen) భారత్‌లో సరికొత్త కార్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఈ కంపెనీ నుంచి ప్రస్తుతం బసాల్ట్‌ కూపే ఎస్‌యూవీ, సిట్రోయిన్‌ సీ3, సీ3 ఎయిర్‌క్రాస్‌, సీ5 ఎయిర్‌క్రాస్‌, సిట్రోయిస్‌ eసీ3 ఎలక్ట్రిక్‌ కారు భారతీయ మార్కెట్‌లో వివిధ కార్లను విక్రయిస్తుంది. 2021లో ఈ కంపెనీ సిట్రోయిన్‌ సీ5 ఎయిర్‌క్రాస్‌ని విడుదల చేసింది. ఈ కారు మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో సేల్స్‌ని రాబట్టలేదు. గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ఆరు నెలల్లో కేవలం 2 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి.

అయితే ఈ కంపెనీ ఎక్కువ మొత్తంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బసాల్ట్‌ కూపే ఎస్‌యూవీని ఆగస్టులో విడుదల చేసింది. దీనికంటే ముందే తన కంపెనీ స్ట్రాటజీని మొత్తం మార్చేసింది. దీంతో పాటు టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. కంపెనీ విడుదల చేసిన సిట్రోయిన్ బసాల్ట్‌తో పాటు సిట్రోయిన్‌ సీ3 (Citroen C3) కారు సేల్స్‌ కూడా ఊపందుకున్నాయి.

Citreon C3 Hatchback August 2024 Sales Report

గత నెల (ఆగస్టు 2024)లో సిట్రోయిన్ 507 యూనిట్ల 'సీ3' కార్లను విక్రయించింది. 2023 ఆగస్టులో విక్రయించిన 250 యూనిట్లతో పోలిస్తే ఇది 102 శాతం వార్షిక వృద్ధి రేటుని నమోదు చేసింది. ఉన్నట్టుండి కంపెనీ సేల్స్ 100 శాతం పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ హ్యాచ్‌బ్యాక్‌ అమ్మకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.

ఇక ఈ కంపెనీ మొత్తం సేల్స్‌ 4 రెట్లు పెరిగాయి. ఇది ఆటో రంగాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో మొత్తం 1,275 యూనిట్ల సిట్రోయిన్‌ కార్లు అమ్ముడయ్యాయి. 2023లో ఇదే సమయంలో 576 యూనిట్లను మాత్రమే కంపెనీ సేల్‌ చేసింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఇది 121 శాతం అధికం. వీటిలో బసాల్ట్ ఎస్‌యూవీ (579 యూనిట్స్‌), సీ3 హ్యాచ్‌బ్యాక్స్‌ వాటానే అధికం.

Citreon C3

ఇక కొత్త సిట్రోయిన్ సీ3 హ్యాచ్‌బ్యాక్ చాలా సరసమైన ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.6.16 లక్షల నుంచి రూ.9.30 లక్షల మధ్య ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌ లైవ్, ఫీల్, షైన్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు 4 మోనోటోన్‌, 6 డ్యూయల్‌ టోన్‌ కలర్‌ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంటుంది.

ఈ సిట్రోయెన్ సీ3 రెండు శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లతో వస్తుంది. 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 82 ps పవర్‌ని 115 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్స్‌తో మాత్రమే వస్తుంది.

Citreon C3 Hatchback August 2024 Sales Report

మరో 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్‌ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 110 ps శక్తిని 205 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్‌ లీటరుకు 19.3 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

కొత్త సిట్రోయిన్ సీ3 హ్యాచ్‌బ్యాక్‌లో 5 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇందులో 10.2 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 7 అంగుళాల ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఆటో ఏసీ తదితర ఫీచర్లు ఉన్నాయి.
ప్రయాణీకుల సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, EBDతో కూడిన ABS, పార్కింగ్ సెన్సార్‌లతో కూడిన వెనుక కెమెరా ఉంటుంది.

అంతే కాకుండా C3 టర్బో వేరియంట్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)ని కలిగి ఉన్నాయి. ఈ సిట్రోయిన్‌ సీ3 మారుతి వ్యాగన్‌ఆర్‌ , సెలెరియో, టాటా టియాగో, నిస్సాన్ మాగ్నైట్ , రెనాల్ట్ కిగర్ , టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ వంటి కార్లకు గట్టి పోటీని ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 14, 2024, 14:51 [IST]
English summary
Citroen c3 hatchback august 2024 sales report details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+