దేశంలోనే అత్యంత చౌకైన టర్బో పెట్రోల్‌ ఆటోమేటిక్‌ కారు.. 7 మంది హాయిగా వెళ్లవచ్చు!

నేడు మార్కెట్‌లో లభించే కార్లను కొనేముందు జనాలు అవి అందించే మైలేజీని చెక్‌ చేసి నిర్ణయం తీసుకుంటున్నారు. అదే సమయంలో మన దేశంలో భారతదేశంలో వైవిధ్యాన్ని కోరుకునే ప్రజలు ఉన్నారు. అందులో భాగంగానే గతంలో వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ టర్బోఛార్డ్డ్‌ పెట్రోల్ ఇంజిన్‌ మార్కెట్‌లో దుమ్మురేపింది. ఆ తర్వాత హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్‌ని ఇదే ఆప్షన్‌లో ప్రవేశపెట్టడంతో దాని అమ్మకాలు తగ్గాయి. దీన్ని గమనించిన ప్రధాన ప్రత్యర్థి టాటా మోటార్స్ కూడా ఈ సెగ్మెంట్‌లో అడుగు పెట్టింది. అదే ఆల్ట్రోజ్ రేసర్. ఇలా కొత్త కార్లు మార్కెట్‌లో అడుగుపెడుతూనే ఉన్నాయి.

అయితే టాటా రేసర్‌ అమ్మకాల పరంగా ప్రభావం చూపలేకపోయింది. దీనికి ప్రధాన కారణం నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ మార్కెట్లో అనేక టర్బో పెట్రోల్ కార్లను కలిగి ఉండటమే అని చెప్పవచ్చు. టాటా ఆల్ట్రోజ్ రేసర్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ లేదు. దీంతో ఇది కాస్త వెనకబడింది. అయితే ప్రస్తుతం భారత్‌లో చౌకైన టర్బో-ఆటోమేటిక్ కారు ఏది అని ఎవరైనా ఊహించగలరా? ఈ ప్రశ్నకు సమాధానం ఈ కథనంలో మీకోసం..

Citroen C3 Turbo Petro Automatic Petrol Variant

భారతీయ మార్కెట్‌లో పట్టు సాధించడం కోసం సిట్రోయిన్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఆ కంపెనీలో సీ3 ఎయిర్‌క్రాస్‌ మంచి ఆప్షన్‌గా ఉంది. అలాగే ఈ ఆటోమొబైల్ దిగ్గజం బసాల్ట్ అనే కూపే ఎస్‌యూవీని కూడా ఇటీవలె విడదుల చేసింది. దీని రాకతో కంపెనీ సేల్స్‌ టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నాయి. సీ3 ఎయిర్‌క్రాస్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌తో అందుబాటులో ఉంది. హ్యుందాయ్‌ ఐ20 ఎన్-లైన్ ఆటోమేటిక్‌తో పోలిస్తే దీని ధర చాలా తక్కువ.

సిట్రోయిన్ సీ3 ఇకపై దేశంలో అత్యంత శక్తివంతమైన అలాగే తక్కువ ధరలో టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ కారుగా నిలువనుంది. అన్ని లోపాలను సరిదిద్ది ఇటీవలే మోడల్‌ని అద్భుతంగా తీర్చిదిద్దింది. ఈ కారు ప్రారంభ ధర రూ .8.49 లక్షలు కాగా.. కొత్త ఆటోమేటిక్ వెర్షన్ కోసం రూ .10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

Citroen C3 Turbo Petro Automatic Petrol Variant

సిట్రోయెన్ సి3 ఆటోమేటిక్ వేరియంట్ల ప్రారంభ ధర రూ.9.99 లక్షలు నుంచి ప్రారంభ కానుంది. ఇందులో షైన్ ఏటీ వైబ్ ప్యాక్, షైన్ ఏటీ డ్యూయల్ టోన్, షైన్ ఏటీ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్ ధరలు వరుసగా రూ.10.12 లక్షలు, రూ.10.15 లక్షలు, రూ.10.27 లక్షలుగా ఉన్నాయి.

ఇది 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌ ఆప్షన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ సీ3 ని 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తోనూ కొనుగోలు చేయవచ్చు. ఈ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ సుమారుగా 108 bhp పవర్‌ గరిష్టంగా 205 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్తో పాటు సిట్రోయిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌తో వస్తుంది.

Citroen C3 Turbo Petro Automatic Petrol Variant

గతంలో ఈ కారులో ఉన్న లోటుపాట్లన్నింటినీ కంపెనీ భర్తీ చేసింది. ముఖ్యంగా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో మార్కెట్‌లోకి ఈ కారుని తెచ్చింది. ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్‌, ఎక్స్‌టీరియ్‌ ఎలక్ట్రానిక్‌ ఆపరేట్‌తో పనిచేసే ఓఆర్వీఎంలు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మిడ్, టాప్-స్పెక్ వేరియంట్లకు 6 ఎయిర్‌బ్యాగ్స్‌ కూడా ఉన్నాయి. వీటితో పాటు లెదర్ చుట్టిన స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

7 అంగుళాల ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, 10.2 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు సీ3లో కలవు. దేశంలోనే అతి తక్కువ ధర కలిగిన టర్బో-పెట్రోల్ ఆటోమేటిక్ కారుని కొనుగోలు చేయాలని భావిస్తే ఇది మీకు సరిపోతుంది. మారుతి సుజుకి టర్బో ఆటోమేటిక్‌ కార్లతో పోల్చితే ఈ సిట్రోయిన్ ధర కస్టమర్లను ఎక్కువగా ఆకర్షించనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 3, 2024, 14:20 [IST]
English summary
Citroen c3 turbo petrol automatic car price and variants details in telugu
Read more on: #citroen #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+