సిట్రోయెన్‌ eC3 కొత్త వేరియంట్‌ విడుదల.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 320 కి.మీ రేంజ్‌..!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్‌ eC3 ఎలక్ట్రిక్‌ కారు కొత్త షైన్‌ వేరియంట్‌ను (Citroen eC3 Shine Variant launched) విడుదల చేసింది. ఇది eC3 ఎలక్ట్రిక్‌ హ్యాచ్‌బ్యాక్‌ కొత్త వేరియంట్‌ టాప్‌ ఎండ్‌ వేరియంట్‌గా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సిట్రోయెన్‌ ఎలక్ట్రిక్‌ కారు లైవ్‌, ఫీల్‌, షైన్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

సిట్రోయెన్‌ eC3 ఎలక్ట్రిక్‌ కారు లైవ్‌ వేరియంట్‌ ధర రూ.11,61,000 (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఫీల్‌ వేరియంట్‌ ధర రూ.12,69,800 (ఎక్స్‌షోరూం)గా ఉంది. తాజాగా విడుదలైన షైన్ వేరియంట్‌ ధర రూ.13.20 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది. సిట్రోయెన్‌ eC3 ఎలక్ట్రిక్‌ కారు..వైబ్‌ ప్యాక్‌తో కూడిన ఫీల్‌ వేరియంట్‌ ధర రూ.12,84,800 (ఎక్స్‌షోరూం)గా ఉంది. అదే వైబ్‌ ప్యాక్‌తో కూడిన ఫీల్‌ వేరియంట్‌ డ్యూయల్‌ టోన్‌ వెర్షన్‌ ధర రూ.12,99,800 లక్షలుగా ఉంది.

citroen eC3 electric car new variant launched

అలాగే తాజాగా అందుబాటులోకి వచ్చిన షైన్‌ వేరియంట్‌ ధర రూ.13,19,800 (ఎక్స్‌షోరూం) గా ఉంది. అదే వైబ్‌ ప్యాక్‌తో కూడిన షైన్‌ వేరియంట్‌ ధర రూ.13,34,800 (ఎక్స్‌షోరూం) గా ఉంది. అదే డ్యూయల్‌ టోన్‌ వైబ్‌ ప్యాక్ ధర రూ.13,49,800 (ఎక్స్‌షోరూం) గా ఉంది.

సిట్రోయెన్‌ eC3 షైన్‌ వేరియంట్‌ ముందు, వెనుక స్కిడ్‌ ప్లేట్‌లను కలిగి ఉంది. మరియు 15 అంగుళాల డ్యూయల్‌ టోన్‌ అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంది. లెదర్‌తో కూడిన స్టీరింగ్‌ వీల్‌, ఎలక్ట్రికల్‌ అడ్జస్టబుల్‌ ORVMలు, వెనుక వైపర్‌, వాషర్‌ మరియు రివర్స్‌ పార్కింగ్‌ కెమెరాలున్నాయి. దీంతోపాటు ఫీల్‌ వేరియంట్‌లో ఉన్న స్పెసిఫికేషన్లను కలిగి ఉంది.

citroen eC3 new car launched

సిట్రోయెన్‌ eC3 రేంజ్‌ : సిట్రోయెన్‌ eC3 ఎలక్ట్రిక్ కారు షైన్‌ వేరియంట్.. మిగిలిన రెండు వేరియంట్ల మాదిరిగానే స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది. 29.2kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఈ బ్యాటరీని సింగిల్‌ చేస్తే 320 కి.మీ రేంజ్‌ ఇస్తుంది. ఈ బ్యాటరీ ముందు చక్రాలకు శక్తినిచ్చే సింగిల్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్‌ మోటార్‌ 56bhp శక్తి, 143Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఎలక్ట్రిక్‌ కారు DC ఫాస్ట్‌ ఛార్జర్ మరియు 3.3kW ఆన్‌బోర్డ్‌ AC ఛార్జర్‌ను కలిగి ఉంటంది. eC3 ఎలక్ట్రిక్‌ కారు 6.8 సెకన్లలో 0-60kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్‌ హ్యాచ్‌బ్యాక్ గరిష్ఠంగా గంటకు 107 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. ఇందులో రెండు డ్రైవింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. దీంతోపాటు మెరుగైన బ్రేకింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

citroen eC3 new car launched in india

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, January 25, 2024, 16:03 [IST]
English summary
Citroen ec3 electric car new variant launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+