షాకిచ్చిన Citroen eC3.. గ్లోబల్ ఎన్‌సీఏపీ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీరో రేటింగ్

మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'సిట్రోయెన్ ఈసీ3' (Citroen eC3) ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ ఇటీవల గ్లోబల్ ఎన్‌సీఏపీ (Global NCAP) క్రాష్ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీరో రేటింగ్ సాధించి అందరికి షాకిచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 'సిట్రోయెన్ ఈసీ3' అందరిని నిరుత్సాహపరిచింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 0 రేటింగ్ సాధించగా.. పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 1 స్టార్ రేటింగ్ పొందింది. క్రాష్ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరీక్షించబడిన కారు భారతీయ నిర్మిత మోడల్ అని తెలుస్తోంది. గ్లోబల్ ఎన్‌సీఏపీ సేఫర్ కార్స్ ఫర్ ఇండియా ప్రచారంలో పరీక్షించబడిన చివరి కొన్ని కార్లలో ఇది ఒకటి.

Citroen eC3 Gets Zero Stars in Global NCAP Crash Test

పరీక్షించబడిన సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ మోడల్‌లో కేవలం డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, బెల్ట్ లోడ్ లిమిటర్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్‌లు వంటివి కేవలం ముందు రెండు సీట్లకు మాత్రమే ఉన్నాయి. అయితే ఇందులో ESC లేదా వెనుక సీట్ల కోసం సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు, సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఐసోఫిక్స్ ఎంకరేజ్‌లు లేదా సీట్‌బెల్ట్ రిమైండర్స్ లేదు.

సిట్రోయెన్ సీ3 ఎలక్ట్రిక్ కారు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో మొత్తం 34 పాయింట్లకు 20.86 పాయింట్లను స్కోర్ సాధించింది. ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో.. డ్రైవర్ మరియు ప్రయాణికుల తల మరియు మెడ వంటి భాగాలకు మంచి రక్షణ ఉందని నివేదికలో పేర్కొంది. అయితే ఛాతీకి రక్షణ బలహీనంగా మరియు డ్రైవర్, ప్రయాణికులకు కూడా రక్షణ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Citroen eC3 Gets Zero Stars in Global NCAP Crash Test

ఇక ప్రయాణికుల మోకాలికి రక్షణ బాగానే ఉందని తెలుస్తోంది. డ్యాష్‌బోర్డ్ వెనుక ఉన్న ప్రమాదకరమైన నిర్మాణాల వల్ల డ్రైవర్ మోకాలికి రక్షణ చాలా తక్కువగా ఉంది. సైడ్ ఇంపాక్ట్ టెస్టులో తల భాగానికి కూడా రక్షణ ఉందని తెలుస్తోంది. ఛాతీకి తగిన రక్షణ ఉంది. ఉదరం మరియు పొత్తికడుపుకు మంచి రక్షణ ఉంది. మొత్తం మీద ముందు, సైడ్ ఇంపాక్ట్ మధ్య వ్యత్యాసం కారణంగా జీరో రేటింగ్ మాత్రమే లభించింది.

ఈసీ3 సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌ నిర్వహించలేదు. ఎందుకంటే ఇందులో సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు లేదు. అంతే కాకుండా గ్లోబల్ ఎన్‌సీఏపీ యొక్క ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ యొక్క కనీస లభ్యత అవసరాలను తీర్చలేదు. పాదాచారులు రక్షణకు కావలసిన ఫీచర్స్ ఇందులో లేదు. కానీ ఫుట్‌వెల్ ప్రాంతం మరియు బాడీ షెల్ వంటివి స్థిరంగా ఉన్నాయని తెలుస్తోంది. కావున లోడ్ తట్టుకోగలదని సమాచారం.

ఇక చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కారు మొత్తం 49 పాయింట్లకు కేవలం 10.55 పాయింట్లను మాత్రమే సాధించింది. 3 సంవత్సరాల పిల్లల కోసం చైల్డ్ సీటు.. పెద్దల సీటు బెల్టును ఉపయోగించి ముందుకు అమర్చబడింది. ఇది అధిక ఫార్వర్డ్ మూవ్‌మెంట్‌ను మరియు లోపల హెడ్ కాంటాక్ట్‌ను నిరోధించలేకపోయింది. కావున ఇందులో కూడా మంచి స్కోర్ చేయలేకపోయింది.

సిట్రోయెన్ ఈసీ3 మొత్తం ఐదు సీట్లకు 3 పాయింట్ సీట్ బెల్టును పొందలేదు. వెనుక మధ్య ప్రయాణికుల కోసం ల్యాప్ బెల్ట్ కలిగి ఉంది. ఐసోఫిక్స్ ఎంకరేజ్‌లు లేదు. ఆ స్థానంలో వెనుకవైపు ఉన్న సీఆర్ఎస్ ఇన్‌స్టాల్ చేసినట్లయితే.. ప్రయాణికుల ఎయిర్‌బ్యాగ్‌ను డిస్‌కనెక్ట్ చేసే అవకాశం కూడా లేదు. ఇవన్నీ కూడా భద్రతా లోపాలుగానే గుర్తించబడ్డాయి. అయితే ఇందులో చైల్డ్ సీటుకు సరిపోయే ఒక స్థానాన్ని మాత్రమే పొందుతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, March 22, 2024, 11:01 [IST]
English summary
Citroen ec3 gets zero stars in global ncap crash test
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+