అది సార్‌ ధోని బ్రాండ్‌.. ఫ్రెంచ్‌ కార్ల కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జాక్‌పాట్‌ కొట్టారు. ప్రముఖ ఫ్రెంచ్‌ కార్ల సంస్థ తమ బ్రాండ్ అంబాసిడర్‌ టీం ఇండియా మాజీ కెప్టెన్‌ని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని సిట్రోయిన్ ఇండియా అధికారింకంగా ప్రకటించింది. ఆటోమోబైల్‌ రంగంలో తమకు ఈ బ్రాండింగ్‌ కలిసి రానున్నట్లు సిట్రోయిన్‌ భావిస్తోంది.

ధోనికి ఆటోమొబైల్ రంగం అంటే అమితమైన ప్రేమ. క్రికెట్‌ తర్వాత అతడు ఎక్కువగా ఈ ఫీల్డ్‌ని ఇష్టపడతాడు. ముఖ్యంగా వింటేజ్‌ బైక్స్‌, కార్లు అంటే ధోనికి క్రేజీ ఎక్కువ. రాంచీలోని అతని గ్యారేజీలో అనేక రకాల ఐకానిక్ మోటార్ సైకిళ్లతో పాటు కార్లు కూడా ఉన్నాయి. తాజాగా ధోనితో బ్రాండింగ్‌ కలిసి వస్తుందని సిట్రోయిన్‌ యోచిస్తోంది.

Citroen-Brand-Ambassador-Dhoni

బసాల్ట్ పేరుతో ఆ సంస్థ ఆవిష్కరించిన కొత్త కూపే ఎస్‌యూవీని సిట్రోయెన్ ఇండియా మార్కెట్‌లో విస్తరించే పనిలో ఉంది. దీనిలో భాగంగా ధోనితో ఆ సంస్థ తాజాగా అగ్రిమెంట్‌ చేసుకుంది. సిట్రోయెన్ కొత్త బ్రాండ్ ప్రచారాల్లో మహేంద్ర సింగ్ ధోనీ త్వరలో కనిపించనున్నాడు. 'సిట్రోయెన్ కుటుంబంలోకి మహేంద్ర సింగ్ ధోనీని స్వాగతించడం చాలా సంతోషంగా ఉందని సిట్రోయెన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ శిశిర్ మిశ్రా తెలిపారు.

ఆటోమోబైల్‌ రంగంపై ధోనికి ఉన్న మక్కువ కలిసి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే భారతదేశపు అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరైన ధోనితో మా అనుబంధం భారత మార్కెట్‌లోని కస్టమర్లకు మరింత నమ్మకాన్ని కల్పించేందుకు తోడ్పడుతుందని ఆయన చెప్పారు. ధోని మాస్‌ క్రేజీ మా బ్రాండ్‌కి సరిపోతాయని ఆయన పేర్కొన్నారు. ధోనితో కలిసి సిట్రోయిన్‌ ఇండియాలో సుస్థిరమైన మార్కెట్‌తో పాటు కస్టమర్లకు నిబద్ధతతో కూడిన సేవలను అందిస్తామని వెల్లడించారు.

Citroen-India-Brand-Ambassador

సిట్రోయెన్ ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో నాలుగు కార్‌ మోడళ్లను సేల్‌ చేస్తోంది. అందులో సిట్రోయిన్‌ సీ3, ఈసీ3, సీ3 ఎయిర్ క్రాస్, సీ5 ఎయిర్ క్రాస్ ఉన్నాయి. తాజాగా ఈ బ్రాండ్ కార్లు ధరలను సంస్థ పెంచింది. అన్ని మోడళ్లపై రూ .4,000 నుంచి రూ .17,000 వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌ఫుట్‌ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల కారణంగా ధర పెంచుతున్నట్లు సిట్రోయెన్ మాతృసంస్థ స్టెలాంటిస్ తెలిపింది.

రాబోయే సిట్రోయెన్ బసాల్ట్ సీ3 మరియు సీ3 ఎయిర్‌క్రాస్‌లోని ఫీచర్లను కలిగి ఉంటుంది. సి-సీరీస్‌ కార్లకు భిన్నంగా తనదైన ముద్ర వేయడానికి ఈ ఎస్‌యూవీ కూపే సిద్ధంగా ఉంది. భారత్‌తో పాటు మరియు దక్షిణ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు. తక్కువ ధరలో సరసమైన వాహనాలను అందించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

1.2-లీటర్, మూడు సిలిండర్ల టర్బోఛార్జ్డ్‌ ఇంజిన్‌తో ఈ కారు పనిచేయనుంది. ఇది 5,500 rpm వద్ద 108 bhp గరిష్ట శక్తిని మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌లో 1,750-2,500 rpm వద్ద 205 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇక 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌లో 1,750 rpm వద్ద 190 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఎస్‌యూవీ కూపే 2024 ద్వితీయార్థంలో భారత దేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఉత్సాహవంతమైన ఆటోమొబైల్ ఔత్సాహికుడిగా ఫ్రెంచ్ ఐకానిక్ బ్రాండ్ సిట్రోయెన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని ధోని వెల్లడించారు. ప్రపంచ ఇంజనీరింగ్ నైపుణ్యంతో తయారైన ఈ బ్రాండ్‌ భారతీయులకు నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ మరియు స్థిరమైన కారు మార్కెట్‌లో సిట్రోయిన్‌ తన నిబద్ధతను చాటుతుందని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Saturday, May 25, 2024, 16:31 [IST]
English summary
Citroen india signs with ms dhoni he is now became a brand ambassador of this brand
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+