మార్కెట్‌లో టాప్‌-10 CNG కార్లు.. బైక్‌తో సమానంగా మైలేజీ, ప్రారంభ ధర రూ. 5.74 లక్షల నుంచి స్టార్ట్‌

గత కొన్ని సంవత్సరాలుగా పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఒకే ధర వద్ద కొనసాగుతున్నాయి. వీటి ధరలు దిగి రాకపోడంతో జనాలు ప్రత్యామ్నాయ సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా సీఎన్‌జీ వాహనాల ఖర్చు చాలా తక్కువ. ప్రస్తుతం దేశంలో మంచి మైలేజీ అందించే సీఎన్‌జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్‌ కార్ల ధరలు కాస్త ఎక్కువే అని చెప్పాలి. వీటితో పోల్చితే సీఎన్‌జీ కార్లు తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అన్‌లిమిటెడ్‌ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తాయి.

ఎలక్ట్రిక్‌ కార్లు సంఖ్య పెరుగుతున్నా కానీ అంతే స్థాయిలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు తగినంతగా అభివృద్ధి కాలేదు. దీంతో జనాలు సీఎన్‌జీ కార్లను మాత్రమే ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం తక్కువ ధరలో మంచి మైలేజీ అందించే సీఎన్‌జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఆ కార్ల వివరాలపై ఓ లుక్కేయండి. ఆ తర్వాత మీకు ఏ కారు బెస్ట్‌ అనేది డిసైడ్ అవ్వండి.

ఈ జాబితాలోని తొలి కారు టాటా టియాగో (Tata Tiago). ఇది సీఎన్‌జీ కార్లలో ఫేమస్‌ హ్యాచ్‌బ్యాక్‌గా ఉంది. ఇది సీఎన్‌జీ మోడల్ కిలోకు 26.49 కిలోమీటర్ల మంచి మైలేజీని అందిస్తుంది. ఈ కారు 1.2-లీటర్ బై-ఫ్యూయల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్, AMT గేర్ బాక్స్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఈ కారు ధరలు రూ .6- రూ .8.75 లక్షల మధ్య ఉన్నాయి.

Tata Tiago CNG

ఆ తర్వాత జాబితాలోని హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ 1.2-లీటర్ 4-సిలిండర్ నేచురల్ ఆస్పిరేటెడ్ బై-ఫ్యూయల్ (పెట్రోల్ + సీఎన్‌జీ) పవర్‌ట్రైన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కిలో సీఎన్‌జీకి 27 కి.మీ మైలేజీని అందిస్తుంది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 7.68 లక్షలుగా ఉంది. ఇది స్విఫ్ట్‌ సీఎన్‌జీ పోటి ఇస్తుంది.

ఆ తర్వాతి స్థానంలో మారుతి సుజుకి కార్లు ఉన్నాయి. మారుతి ఫ్రాంక్స్ ఉంది. ఇది మల్టీ పవర్‌ట్రైన్ ఆప్షన్స్‌తో వస్తుంది. దీని సీఎన్‌జీ ఆప్షన్‌ 1.2-లీటర్ 4-సిలిండర్ కె-సిరీస్ బై-ఫ్యూయల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది కిలోకు 28.51 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని సీఎన్‌జీ సిగ్మా వేరియంట్‌ ధర రూ. 8.46 లక్షలుగా ఉంది. మారుతి కార్లు దాదాపు 30 కి.మీ మైలేజీని ఇస్తాయి.

Maruti Fronc CNG

ఆ తర్వాతి జాబితాలో ఎక్స్‌టర్‌ మైక్రో-ఎస్‌యూవీ ఉంది. వినియోగదారులను ఆకర్షించడానికి ఎక్స్‌టర్‌ ఆధునిక కనెక్టివిటీ, కంఫర్ట్‌, సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. ఇది నియోస్‌ మాదిరిగానే 1.2-లీటర్ బై-ఫ్యూయల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు కిలోకు 27.1 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ .8.43 లక్షల నుండి రూ .9.38 లక్షల మధ్య ఉంది.

ఈ ఎక్స్‌టర్ మొత్తం ఏడు వేరియంట్లలో లభిస్తుంది. EX, EX(O), S, S(O), SX, SX(O) మరియు SX(O) కనెక్ట్ అనే వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఇక దీనిలో సేఫ్టీ పరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Hyundai Exter CNG

వీటితో పాటు మారుతి నుంచి ఇటీవలే విడుదలై స్విఫ్ట్, బాలెనో, సెలెరియో, ఆల్టో K10, వ్యాగన్‌ఆర్‌ కార్లు ఉన్నాయి. వీటిలో మారుతి సెలెరియో కిలో సీఎన్‌జీకి 34.41 కిమీ మైలేజీని ఇస్తుంది. అంటే ఇది దాదాపు బైక్‌ మైలేజీతో సమానం. మంచి మైలేజీ కోసం చూసే వారికి లేదా రోజువారి వినియోగం కోసం ఈ కార్లు సరిపోతాయి. ఈ సీఎన్‌జీ కార్ల వల్ల మీ ఖర్చులు కూడా చాలా తగ్గుతాయి.

More from DriveSpark

Article Published On: Thursday, September 26, 2024, 11:08 [IST]
English summary
Cng cars with highest mileage in india check price and features
Read more on: #auto news #cng #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+