మీ కారుని CNGలోకి మార్చుకోవడం చాలా సులభం! మంచి మైలేజీ, తక్కువ మెయింటైనెన్స్, మరింత డబ్బు ఆదా!
ప్రస్తుతం సీఎన్‌జీ కార్ల సేల్స్ పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు ఈ కార్ల ఉత్పత్తిపై కూడా ఫోకస్ పెడుతున్నాయి. ఈ మధ్య కాలంలో భారత్‌లో కస్టమర్లు ఎక్కువగా సీఎన్‌జీ కార్ల గురించి అడుగుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. మార్కెట్‌లో టాప్ కార్ల తయారీ సంస్థలు తమ పాపులర్ కార్ మోడళ్లలో సీఎన్‌జీ ఆప్షన్‌ని ప్రవేశపెడుతున్నాయి. అదేవిధంగా ద్విచక్ర వాహన తయారీ సంస్థలు కూడా సీఎన్‌జీతో నడిచే ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తీసుకురావడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. బజాజ్ ఇప్పటికే ఈ పనిని ప్రారంభించింది. కంపెనీ ఇటీవలే తన మొదటి సిఎన్జి ఆధారిత బైక్ మోడల్‌ని విడుదల చేసింది.
ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌గా ఫ్రీడమ్ 125 మార్కెట్‌లో విడుదలైంది. ఈ నేపథ్యంలో టీవీఎస్ మోటార్ కంపెనీ కూడా తన తొలి సీఎన్‌జీ ఆధారిత స్కూటర్‌ని మార్కెట్‌లోకి తీసుకువచ్చే పనిలో ఉంది. పెరిగిన పెట్రోల్ ధరల పెరుగుదల నుంచి ఖర్చులను తగ్గించుకునేందుకు చాలా మంది సీఎన్‌జీ కార్లను ఓ ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు పెట్రోల్ వాహనాలతో పోటీగా వీటిని కొంటున్నారు.

అయితే చాలా మంది ఇప్పుడు తమ వద్ద ఉన్న కార్లను అమ్మేసి కొత్త సీఎన్‌జీ కార్లను విక్రయిస్తున్నారు. ఇక్కడే మీరు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. కొత్తగా సీఎన్‌జీ వాహనాలు మీరు కొనాల్సిన అవసరం లేదు. మీరు మీ పెట్రోల్ కార్లను సులభంగా సీఎన్‌జీలోకి మార్చవచ్చు. ఇలా చేస్తే అయ్యే ఖర్చు ఎంత? పెట్రోల్ వాహనాలను సీఎన్‌జీ వాహనాలుగా మార్చవచ్చా? అనే విషయాలను ఈ కథనంలో చూద్దాం..
భారతదేశంలో పెట్రోల్ కార్లను సీఎన్‌జీ వాహనాలుగా మార్చవచ్చు. మార్కెట్‌లో సీఎన్‌జీ కిట్లు విరివిగా లభిస్తున్నాయి. రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వీటి ధర పలుకుతోంది. ఉత్పత్తి బ్రాండ్ మరియు సీఎన్‌జీ కిట్ రకాన్ని బట్టి ధర మారుతూ ఉంటుంది. సాధారణంగా సీఎన్‌జీ కిట్ ఏర్పాటుకు ఎవరూ ప్రత్యేక రుసుము వసూలు చేయరు.
సీఎన్‌జీ బిగించడానికి అయిన ఖర్చుని 2 లేదా 3 సంవత్సరాలలో ఖర్చు చేసిన పెట్టుబడి మొత్తాన్ని సులభంగా తొలగించవచ్చు. సీఎన్‌జీ కార్లు పెట్రోల్ కంటే ఎక్కువ మైలేజీని ఇస్తాయి. ఇది మీ ఖర్చులను భారీగా ఆదా చేస్తుంది. దీని నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. పెట్రోల్ కారు మాదిరిగానే సీఎన్‌జీలోకి మారిన తర్వాత కూడా కారుకు రెగ్యులర్ మెయింటెనెన్స్ తప్పనిసరి ఉండాలి.

దీని నిర్వహణ వ్యయం ఖరీదు సగటున రూ. 5000 నుంచి రూ. 20 వేల వరకు ఉండవచ్చు. సీఎన్‌జీ కార్ల వినియోగదారులలో ఎక్కువ మంది పెట్రోల్ కారు కంటే వీటి నిర్వహణ ఖర్చు తక్కువగా ఉందని నివేదించారు. ఇక పెట్రోల్ ధర రూ.100పైగా ఉంది. అదే కిలో రూ. 87-92 మధ్య విక్రయిస్తున్నారు. కార్ల కెపాసిటీని బట్టి ఒక కిలో సీఎన్‌జీకి దాదాపు 25 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
ఇక పెట్రోల్ కార్లు కేవలం 18 కిలోమీటర్ల కంటే తక్కువ మైలేజీని అందిస్తాయి. అందువల్ల సీఎన్‌జీ వాహనాలు అన్ని రకాల లాభదాయకంగా ఉంటాయి. అంతే కాదు ఇవి పర్యావరణ అనుకూల వాహనాలుగా కూడా ఉంటాయి. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే సీఎన్‌జీ వాహనాలు చాలా తక్కువ కార్బన్‌ని విడుదల చేస్తాయని పరిశోధనలో తేలింది. అందుకే ప్రభుత్వం తరఫున సీఎన్‌జీ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు.
పెట్రోల్ కారును సీఎన్‌జీగా మార్చడం మీకు పెద్ద ఖర్చుగా అనిపించవచ్చు. కానీ ఈ ప్రారంభ పెట్టుబడి తరువాత భారీ రాబడిని ఇస్తుందని మర్చిపోవద్దు. అంతేకాకుండా ఈ వాహనాన్ని ఉపయోగించడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ చేయకుండా మన వంతు సహకారం అందించవచ్చు. అయితే సీఎన్‌జీ వాహనంగా మార్చే ముందు RTO నుంచి కచ్చితంగా NOC తీసుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








