డీజిల్ కార్లపై భారీ ఆంక్షలు.. అయినా జనాలు ఎక్కువగా వీటినే కొంటున్నారు.. ఎందుకో తెలుసా?
దేశంలో ఎలక్ట్రిక్ వానలో ఉత్పత్తి రోజురోజుకు పెరుగుతుంది. అందులో భాగంగా చాలావరకు కంపెనీలు ఎలక్ట్రిక్ వానాల వినియోగంపై దృష్టి సారించాయి. ప్రస్తుతం డీజిల్ కార్ల విక్రయాలను తగ్గించేందుకు దేశంలో కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి. వచ్చే 5 నుంచి 10 ఏళ్లలో డీజిల్ కార్ల విక్రయాలను పూర్తిగా నిషేధించాలని కేంద్రం భావిస్తోంది. హైడ్రోజన్ ఎలక్ట్రిక్ ఇతర హైబ్రిడ్ వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూత్రపాయకంగా సూచించారు. భారతదేశంలో డీజిల్ కార్లను దశలవారీగా నిలిపివేయబడతాయని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి .
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను బలోపేతం చేయడానికి, చాలా రాష్ట్రాలు ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ కార్ల అమ్మకాలను ప్రోత్సహించడానికి రాయితీలను అందిస్తున్నాయి. అయితే డీజిల్ కార్ల విక్రయాలను ప్రోత్సహించేందుకు సరైన ప్రణాళికలు లేవు. రానున్న కాలంలో డీజిల్ కార్ల విక్రయాలు ఆగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు అంటున్నారు.

దేశీయ విపణిలో డీజిల్ కార్ల విక్రయాలపై అనేక పరిమితులు, అధిక పన్నులు విధిస్తున్నారు. అయినా కానీ టాటా, మహీంద్రా, హ్యుందాయ్, టయోటా మరియు కియా వంటి అనేక ప్రముఖ కార్ల తయారీదారులు డీజిల్‌తో నడిచే కార్లను విజయవంతంగా విక్రయిస్తున్నారు. మహీంద్రా డీజిల్ కార్లలో వినియోగం ఎక్కువగా ఉంటుంది.
పెట్రోల్ కార్లతో పోలిస్తే డీజిల్ కార్లు ఎక్కువ మైలేజీని ఇస్తాయి. ఇది వాహన యజమానులకు ఇంధనంపై డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది. ఈ డీజిల్ ఇంజిన్‌తో కూడిన కార్లు హై పవర్ ను మరియు గరిష్ట టార్క్‌ను అందిస్తాయి. అలాగే డీజిల్ ఇంజిన్ ఎక్కువ కాలం లైఫ్ ఇస్తుంది. కాబట్టి చాలా మంది డీజిల్ కార్ల కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు.

డీజిల్ కార్ల ఇంజన్లు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయనేది నిజం. అయితే, ఇవి పెట్రోల్‌తో నడిచే కార్ల కంటే ఎక్కువ వాయు కాలుష్యాన్ని కలిగిస్తాయి. పెద్ద మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల కావడం వల్ల మనుషుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపి రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఇదే కారణంతో దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉండే 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాల వినియోగాన్ని నిషేధించారు.
వాహనాల వల్ల ఏర్పడే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇది ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ (ఇంధన + ఎలక్ట్రిక్) వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం మరిన్ని రాయితీలను ఇస్తుంది. అనేక కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు పాత కంపెనీలతో చేతులు కలిపి గత మూడేళ్లలో వినూత్న డిజైన్లు మరియు ఆకర్షణీయమైన ఫీచర్లతో వివిధ ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు మరియు కార్లను విడుదల చేశారు.
గతంలో ఒక అధ్యయనం ప్రకారం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ రోజురోజుకు పెరుగుతోందని తెలిసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హైబ్రిడ్ వాహనాల కొనుగోలుపై పూర్తి టాక్స్ ను ఆ ప్రభుత్వం నిషేధించింది. రాష్ట్రంలో హైబ్రిడ్ వాహనాల కొనుగోలుని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు కేంద్రం అందించే ఇతర ఎలక్ట్రిక్ వాహనల కోనుగోలు సబ్సిడీలపై కూడా లాభిస్తుంది.
ప్రస్తుతం దేశంలో కొత్త స్టార్టప్ సంస్థలు ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వాహనాల ఉత్పత్తిపై ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర విభాగంలో చాలావరకు కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ విభాగంలో ద్విచక్ర వాహనాల వినియోగం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత కార్లు ఇతర వాహనాలను జనాలు కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లను సైతం ప్రకటిస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతూ వస్తుంది.


Click it and Unblock the Notifications








