కొన్ని లక్షలు తగ్గింపు ఇచ్చిన డిసెంబర్‌లో కారు కొనకండి..! ఎందుకో తెలిస్తే మీరు షాక్ అవుతారు..

దేశంలో ప్రతి ఏటా కొత్త ఏడాదికి ముందు డిసెంబర్ నెలలో వాహన తయారీదారులు తమ పాత స్టాక్‌ను క్లియర్ చేసుకోడానికి ఇయర్ ఎండ్ సేల్ పేరిట ప్రత్యేక తగ్గింపులను అందిస్తుంటారు. ఈ ధోరణి దాదాపు ప్రతి ఏడాది కొనసాగుతూనే ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించడానికి డీలర్ల వద్ద ఉన్న వాహనాలను తగ్గించడానికి అసలు ధరలో వేల రూపాయల నుంచి మొదలుకుని రెండు లేదా మూడు లక్షల రూపాయల వరకు తగ్గింపులను కంపెనీలు అందిస్తుంటాయి. డీలర్లు తమ షోరూమ్‌లలో ఏడాది చివరలో మిగిలిపోయిన వాహనాలను కొత్త సంవత్సరం రాకముందే కస్టమర్లకు తక్కువ ధరలో అందించి వాటి స్థానంలో కొత్త మెడళ్లను తీసుకొచ్చి పెడుతుంటారు. వినియోగదారులు కూడా ఇలాంటి తగ్గింపులను సద్వినియోగం చేసుకుని తక్కువ ధరలో డిసెంబర్ నెలలో కొత్త కారును ఇంటికి తీసుకెళ్తుంటారు.

సాధారణ రోజుల్లో భారీ ధరలో లభించే కార్లను కూడా కార్పొరేట్ తగ్గింపులు, నగదు తగ్గింపు, లాయల్టీ రివార్డ్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ప్రయోజనాలు వంటి అనేక ప్రయోజనాలను ఉపయోగించుకుని తక్కువ ధరలో సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం 2024 ఏడాది మరికొద్ది రోజుల్లో ముగుస్తుంది. కొత్త ఏడాది (2025) ప్రారంభానికి ముందు ఇప్పుడు కంపెనీలు వరుసగా ఇయర్ ఎండ్ సేల్ తగ్గింపులను ప్రకటిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఆఫర్లను ఇస్తున్నాయి.

Year End Discounts Disadvantages

అయితే ఇలాంటి ఇయర్ ఎండ్ ఆఫర్లను సద్వినియోగం చేసుకుని కొత్త కారును కొనే ముందు కస్టమర్లు కొంచెం ఆలోచించి కొనుగోలు చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇలా తక్కువ ధరకు ఏడాది చివర కారును కొనడం వలన కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. అయితే చాలా మంది వాటిని పట్టించుకోరు. కానీ వీటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

ఏడాది చివర కారును కొనడం వలన తర్వాతి రోజుల్లో కారు విలువ క్రమంగా తగ్గిపోతుంది. ఏదైనా అత్యవసరం లేదా ఇతర పరిస్థితుల్లో కారును ఇతరులకు విక్రయించాలని చూసినప్పుడు దాని విలువ చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే కారు లాంచ్ నుంచి తరువాతి ఏళ్లలో దానికి విలువ తగ్గిపోతుంది. అందుకే కంపెనీలు కూడా ఒక ఏడాదిలో తయారు చేసిన వాటిని తరువాతి ఏడాదిలో విలువ తగ్గుతుందనే కారణంతో వాహనాలపై డిస్కౌంట్స్ అందిస్తాయి.

ఉదాహరణకు, 2024 జనవరిలో తయారైన కారు అదే ఏడాది చివరి నాటికి వచ్చే సరికి పాతదిగా పరిగణిస్తారు. ప్రారంభ సమయంలో ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ రాను రాను దీని ధర మరింత తగ్గుతూనే ఉంటుంది. అలాగే, డిసెంబర్ 2024లో తయారు అయిన కారును కొత్తదిగా పేర్కొన్నప్పటికీ కంపెనీల ప్రకారం, 2025 జనవరిలో పాత కారుగానే పరిగణిస్తారు. నెల రోజుల తేడా ఉన్నప్పటికి ఏడాది మారడంతో పాతదిగా పేర్కొంటారు.

ఇలా డిసెంబర్‌లో కొన్న కారు కొత్త ఏడాది జనవరి నాటికి పాతదిగా మారిపోతుంది. తరువాత కారును వేరే వారికి అమ్మాలని చూసినప్పుడు పాత మోడల్‌గా పరిగణించి దాని రేట్‌ను చాలా వరకు తగ్గిస్తారు. తక్కువ ధరలో కారు వస్తుందని డిసెంబర్‌లో కొనడం వలన రూ.8 లక్షల విలువ చేసే కారు ఒక్కోసారి రూ.3 లక్షలకు కూడా పడిపోతుంది. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏడాది ప్రారంభంలో కొనడం చాలా ఉత్తమం.

ఇయర్ ఎండ్‌లో కారును కొనుగోలు చేసే ముందు కస్టమర్లు లాభ నష్టాలను లెక్కలు వేసుకున్న తరువాతే ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ప్రధానంగా వినియోగదారులు కారు కొనే సమయంలోనే తయారీ తేదీని వాహన గుర్తింపు సంఖ్య (VIN) ను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇది 10 నుంచి 11 అక్షరాలతో కారు తయారీకి సంబంధించిన అన్ని వివరాలు చూపిస్తుంది. ఏడాది చివరలో కారు కొనాలనుకునే వారికి ఈ సమాచారం చాలా ముఖ్యం.

More from DriveSpark

Article Published On: Monday, December 9, 2024, 8:30 [IST]
English summary
Disadvantages of buying new car in year end discounts
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+