కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్.. కొత్త కారు కొనడానికి ఇదో మంచి అవకాశం!
2024 జులైలో టాటా మోటార్స్ మాత్రమే కాకుండా హోండా ఇండియా కూడా ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ జాబితాలో హోండా అమేజ్, సిటీ, ఎలివేట్ వంటి కార్లు ఉన్నాయి. ఈ కార్ల కొనుగోలుపైన కస్టమర్లు ఈ నెలలో భారీ తగ్గింపులను పొందవచ్చు. కంపెనీ అందించే డిస్కోఉంట్లో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ మరియు కార్పొరేట్ ప్రయోజనాలు లభిస్తాయి. హోండా కంపెనీ ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అందిస్తోంది. అందులో క్యాష్ డిస్కౌంట్ ఎంత.. ఇతర ప్రయోజనాలు ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
హోండా అమేజ్
హోండా కంపెనీ తన అమేజ్ కారుపైన రూ. 66000 నుంచి రూ. 1.04 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ కారు ఇప్పటికి ఎంతోమంది కస్టమర్ల మనసు దోచింది. కాగా కంపెనీ ఈ కారును మరింత మందికి చేరువ చేయడానికి ఈ నెలలో ఈ అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ ప్రయోజనాలు మొదలైనవి ఉన్నాయి.

మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన హోండా అమేజ్ పనితీరు పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇది దేశీయ విఫణిలో మారుతి డిజైర్ మరియు హ్యుందాయ్ ఆరాకు పోటీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారులోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ మరియు సీవీటీ ఎంపికలు పొందుతుంది. తద్వారా ఉత్తమ పర్ఫామెన్స్ లభిస్తుంది.
హోండా సిటీ
హోండా కార్లు అనగానే ముందుగా సిటీ కారు గుర్తొస్తుంది. కంపెనీ యొక్క ఈ కారు అంతగా పాపులర్ అయింది. హోండా సిటీ కొనుగోలు మీద ఈ నెలలో రూ.68000 నుంచి రూ.89000 వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్స్ మొదలైనవి ఉన్నాయి. స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నా మరియు ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న ఈ కారు ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలు పొందింది.

ఈ నెలలో హోండా సిటీ కారును కొనుగోలు చేసేవారు మాత్రమే ఈ డిస్కౌంట్స్ పొందవచ్చు. డిస్కౌంట్ అనేది నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. హోండా సిటీ 1. 5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 121 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఉత్తమ పనితీరును అందిస్తూ.. వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
హోండా సిటీ పెట్రోల్ వేరియంట్ మీద మాత్రమే కాకుండా.. హైబ్రిడ్ మోడల్ మీద కూడా ప్రజలు రూ.65000 వరకు తగ్గింపు పొందవచ్చు. అంటే ఈ నెలలో కొనుగోలు చేసే వ్యక్తి హోండా సిటీ హైబ్రిడ్ అసలు ధర కంటే రూ.65000 తక్కువకే కొనుగోలు చేయవచ్చు. ఇది 1.5-లీటర్ పెట్రోల్ మరియు ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడి రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో వస్తుంది. ఇది 126 హార్స్ పవరే ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా ఎలివేట్
2024 జులై నెలలో హోండా ఎలివేట్ కొనుగోలుపై కస్టమర్ రూ. 55000 నుంచి రూ. 67000 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్స్ అనేవి ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. ఎలివేట్ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 121 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ మాన్యువల్ లేదా సీవీటీతో జతచేయబడి ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








