కొత్త కారు కొంటున్నారా.. మారుతి సుజుకి గ్రాండ్‌ విటారాపై ఏకంగా రూ. 75,000 తగ్గింపు, కొద్ది రోజులే ఛాన్స్‌.!!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి(Maruti Suzuki Grand Vitara) ప్రతి నెలా తన డీలర్‌షిప్‌ల ద్వారా పలు మోడళ్లపై ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మారుతి నుంచి టాప్‌ మోడల్‌ గ్రాండ్‌ విటారాపై ఫిబ్రవరిలో భారీ తగ్గింపులను అందిస్తోంది. 2022 సెప్టెంబర్‌లో గ్రాండ్ విటారా SUV ని సంస్థ లాంచ్‌ చేయగా.. ఇప్పటికీ మార్కెట్‌లో ఈ కారుకు డిమాండ్‌ భారీగా ఉంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌లపై సంస్థ గరిష్ఠంగా రూ. 75,000 తగ్గింపు ప్రయోజనాన్ని అందిస్తోంది. ఇందులో రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఇక మైల్డ్ హైబ్రిడ్ మోడల్‌లపై రూ. 50,000 వరకు తగ్గింపు ఆఫర్‌ను పొందవచ్చు. ఇందులో రూ. 15,000 నగదు తగ్గింపుతో పాటు రూ.35,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను ఇస్తోంది.

February-Offers-On-Maruti-Suzuki-Grand-Vitara

అయితే ఈ ఆఫర్లు(Offers On Maruti Grand Vitara).. ఫిబ్రవరి 29 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కస్టమర్లు గమనించాలి. కాగా ప్రస్తుతం, దేశీయ మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా రూ.10.70 లక్షల నుండి రూ.19.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద ఉంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఇంజిన్ విషయానికొస్తే.. ఈ ఎస్‌యూవీని 3 పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో సంస్థ అందిస్తోంది. ఒకటి 1.5-లీటర్ పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (ఎలక్ట్రిక్) ఇంజిన్‌, రెండవది మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో సంస్థ ప్రవేశపెట్టింది. మూడవది CNG కిట్ కారులో 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

February-Offers-On-Maruti-Suzuki-Grand-Vitara

అయితే సీఎన్‌జీ కిట్‌(Maruti Grand Vitara February Offers) 87.83 PS పవర్ మరియు 121.5 Nm గరిష్ఠ టార్క్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. గ్రాండ్ విటారా వేరియంట్‌లను బట్టి వరుసగా 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు e-CVT గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది 2WD (టూ వీల్ డ్రైవ్), AWD (ఆల్ వీల్ డ్రైవ్) టెక్నాలజీతో వస్తుంది.

మైలేజ్‌ విషయానికొస్తే.. మారుతి సుజుకి గ్రాండ్‌ విటారా పెట్రోల్ వేరియంట్‌లు లీటర్‌కు 19.38 కి.మీ నుంచి 25.45 కి.మీ మైలేజ్‌ను ఇస్తుంది. ఇక CNG వేరియంట్ 26.6 kmpl ఇంధన సామర్థ్యంతో పనిచేస్తుంది. మైలేజ్‌ పరంగా బెస్ట్‌ కారును కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ కారును పరిశీలించొచ్చు.

February-Offers-On-Maruti-Suzuki-Grand-Vitara

మారుతి సుజుకి గ్రాండ్ విటారా SUV లో టెక్నాలజీకి అనుగుణంగా ఆకర్షణీయమైన ఫీచర్లను ప్రవేశపెట్టారు. ఇంటీరియర్‌ క్యాబిన్‌లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు హెడ్స్-అప్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్ల పరంగా మారుతి గ్రాండ్ విటారాలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్, హిల్-డీసెంట్ కంట్రోల్ ఫీచర్లతో వస్తుంది.

మార్కెట్లో ఈ కారు హోండా ఎలివేట్ మరియు హ్యుందాయ్ క్రెటా కార్లకు గట్టి పోటీనిస్తోంది. కాగా ఈ నెలలో గ్రాండ్‌ విటారాపై ఆఫర్లు అనేవి డీలర్‌షిప్, వేరియంట్, కలర్‌, ఇంజిన్ ఆధారంగా డిస్కౌంట్ ఆఫర్ రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని షోరూమ్‌ను సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 6, 2024, 9:15 [IST]
English summary
Discounts on maruti grand suzuki grand vitara up to rs 75000 in february 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+