టాటా కార్లపై అద్భుతమైన డిస్కౌంట్స్.. అస్సలు మిస్ అవ్వకండి!

భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో టాటా టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ మరియు నెక్సాన్ కార్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

టాటా టియాగో (Tata Tiago)

టాటా మోటార్స్ యొక్క టియాగోను ఈ నెలలో కొనుగోలు చేసేవారు గరిష్టంగా రూ.40000 వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. టియాగో యొక్క ఎక్స్ఎమ్ వేరియంట్ మీద రూ.25000 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఇతర వేరియంట్ల మీద రూ.30000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక CNG వేరియంట్ కొనుగోలు మీద రూ.25000 తగ్గింపు లభిస్తుంది. దీని ధర రూ.5.65 లక్షల నుంచి రూ.8.90 లక్షల మధ్య ఉంటుంది.

Tata Tiago

టాటా టిగోర్ (Tata Tigor)

టాటా టిగోర్ కొనుగోలు మీద కూడా రూ.40000 ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ ఎక్స్‌జెడ్ ప్లస్ మరియు ఎక్స్ఎమ్ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర పెట్రోల్ మరియు CNG వేరియంట్ల కొనుగోలుపై రూ.30000 తగ్గింపు లభిస్తుంది. టిగోర్ మాదిరిగానే టియాగో కూడా అదే 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 5 స్పీడ్ ఆటోమాటిక్ ఆప్షన్స్ పొందుతుంది.

టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)

ఆల్ట్రోజ్ కొనుగోలుపైనా కంపెనీ రూ. 35000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. CNG మరియు పెట్రోల్ డీసీఏ వేరియంట్ కొనుగోలు మీద రూ. 20000 తగ్గింపు లభిస్తుంది. ఆల్ట్రోజ్ కారు 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ పవర్‌ట్రెయిన్‌లతో లభిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది.

Tata Altroz

టాటా నెక్సాన్ (Tata Nexon)

దేశీయ మార్కెట్లో ప్రారంభం నుంచి ఎక్కువ అమ్మకాలు పొందుతున్న నెక్సాన్ కొనుగోలుపై ఇప్పుడు రూ. 15000 వరకు ఎక్స్చేంజ్ బెనిఫీట్స్ పొందవచ్చు. నెక్సాన్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ మరియు CNG ఆప్షన్స్ పొందుతుంది. దీని ధర రూ. 8.15 లక్షల నుంచి రూ. 15.80 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉంటుంది. ఇది కియా సోనెట్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

భారతదేశంలోని టాటా మోటార్స్ యొక్క అధికారిక డీలర్‌షిప్‌లలో టాటా టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ మరియు నెక్సాన్ కొనుగోలుపైన ఈ డిస్కౌంట్ పొందవచ్చు. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ కేవలం ఈ నెలలో (ఏప్రిల్ 2024) కొనుగోలు చేసేవారికి మాత్రమే వర్తిస్తాయి. ఏప్రిల్ తరువాత కొనుగోలు చేసేవారికి బహుశా ఈ ఆఫర్ లభించకపోవచ్చు. తప్పకుండా ఈ విషయాన్ని కస్టమర్లు గమనించాల్సి ఉంటుంది.

Tata Nexon

గమనిక: టాటా మోటార్స్ అందించే ఈ ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటుంది. అంతే కాకుండా స్టాక్ ఉన్నంతవరకు మాత్రమే ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలోని స్థానిక డీలర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ నెలలో నెక్సాన్, టియాగో వంటి వాటిని కొనుగోలు చేసి ఈ డిస్కౌంట్ పొందవచ్చు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, April 13, 2024, 9:43 [IST]
English summary
Discounts on tata cars from tiago to nexon up to rs 40000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+