డిస్కౌంట్స్.. డిస్కౌంట్స్! టాటా కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్

దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ ఈ నెలలో కొన్ని ఎంపిక చేసిన బ్రాండ్ మోడల్స్ మీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో టాటా సఫారీ, హారియార్, టియాగో, టిగోర్, నెక్సాన్ మరియు ఆల్ట్రోజ్ కార్లు ఉన్నాయి. ఈ కార్ల కొనుగోలుపై ఈ నెలలో క్యాష్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా కార్పొరేట్ బెనిఫిట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌ మొదలైనవి లభిస్తుంది. కంపెనీ ఏ మోడల్ మీద ఎంత డిస్కౌంట్ అందిస్తోంది, ఈ డిస్కౌంట్ ఎప్పటి వరకు ఉంటుంది అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

టాటా సఫారి

టాటా సఫారీ కొనుగోలుపైన కస్టమర్ రూ. 1.33 లక్షలు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ భారీ డిస్కౌంట్ 2023 మోడల్స్ కొనుగోలుకు వర్తిస్తుంది. ఇందులో రూ. 75000 క్యాష్ డిస్కౌంట్, రూ. 50000 ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ మరియు రూ. 8000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి. 2023 ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ మీద రూ. 88000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.

Tata Safari Harrier

2023 మీద లభించే రూ. 88000 డిస్కౌంట్లో రూ. 50000 క్యాష్ డిస్కౌంట్, రూ. 30000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 8000 కార్పొరేట్ బోనస్ లభిస్తుంది. ఇక 2024 మోడల్ కొనుగోలు మీద రూ. 30000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 8000 కార్పొరేట్ ప్రయోజనాలు లభిస్తాయి. టాటా సఫారీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. పనితీరు ఉత్తమంగా ఉంటుంది.

టాటా హారియర్

హారియార్ కొనుగోలు మీద టాటా మోటార్స్ రూ. 1.33 లక్షల డిస్కౌంట్ అందిస్తుంది. ఇది 2023 టాటా సఫారీకి మాత్రమే వర్తిస్తుంది. ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ మీద రూ. 88000 డిస్కౌంట్ లభిస్తుంది. ప్రీ ఫేస్‌లిఫ్ట్ మరియు ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లకు ఈ నెలలో డిస్కౌంట్స్ లభిస్తాయి. 2024 మోడల్ మీద రూ. 38000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి.

Tata Tiago

టాటా టియాగో

దేశీయ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న టియాగో కొనుగోలు మీద ఈ నెలలో రూ.90000 డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో రూ.65000 క్యాష్ డిస్కౌంట్, రూ.20000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ మరియు రూ.5000 కార్పొరేట్ ప్రయోజనాలు లభిస్తాయి. 2024 మోడల్ మీద రూ. 35000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. 2023 మరియు 2024 CNG మోడల్స్ మీద వరుసగా రూ. 85000, రూ. 50000 తగ్గింపు లభిస్తుంది.

టాటా టిగోర్

టాటా టిగోర్ కొనుగోలు మీద ఇప్పుడు రూ. 85000 తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు 2023 పెట్రోల్ మరియు CNG వేరియంట్ల కొనుగోలుపైన పొందవచ్చు. ఇందులో రూ. 60000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 20000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 5000 కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి. 2024 పెట్రోల్ మరియు CNG మోడల్స్ మీద వరుసగా రూ. 30000 మరియు రూ. 25000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.

Tata Nexon

టాటా నెక్సాన్

భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యధిక అమ్మకాలు పొందిన టాటా నెక్సాన్ పెట్రోల్ కారు కొనుగోలు మీద కస్టమర్ రూ. 90000 ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 55000 క్యాష్ డిస్కౌంట్, రూ. 35000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తాయి. డీజిల్ మోడల్ మీద రూ. 40000 తగ్గింపు లభిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ మరియు ఎక్స్చేంజ్ ప్రయోజనాలు లభిస్తాయి.

టాటా ఆల్ట్రోజ్

2023 టాటా ఆల్ట్రోజ్ కారు కొనుగోలుపై కస్టమర్ రూ. 70000 తగ్గింపు పొందవచ్చు. ఇందులో రూ. 45000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 5000 కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి. 2023 మరియు 2024 CNG కార్ల కొనుగోలుపైన రూ. 55000 మరియు రూ. 35000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ప్రయోజనాలు ఈ నెల చివర వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

టాటా మోటార్స్ అందిస్తున్న ఆఫర్స్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా కంపెనీ అందించే ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. డిస్కౌంట్ స్టాక్ లభ్యత మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి మీరు సమీపంలోని డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 3, 2024, 14:10 [IST]
English summary
Discounts on tata cars in 2024 july from safari to nexon
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+