Tata Offers కొత్త కారు కొంటున్నారా.. ఈ నెలలో టాటా కార్లపై రూ. లక్ష వరకు అదిరిపోయే ఆఫర్లు

ఈ ఏడాది ఫిబ్రవరిలో కస్టమర్ల కోసం టాటా మోటార్స్‌(Tata Motors) అదిరిపోయే ఆఫర్లను తీసుకువచ్చింది. ఈ ప్రముఖ బ్రాండ్‌ కార్లపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపులు పొందవచ్చు. వివిధ ఆఫర్లు, తగ్గింపులను ప్రకటించింది. ఏయే కార్లపై ఏయే ఆఫర్లు ఉన్నాయో.. పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకోండి.

ప్రముఖ భారతీయ బ్రాండ్‌ టాటా మోటార్స్‌(Tata Motors Offers In February)కు కస్టమర్లలో మంచి ఆదరణ ఉంది. ఈ దేశీ సంస్థ నుంచి ఏ మోడల్‌ కార్లు వచ్చినా.. హాట్‌ కేకుల్లా సేల్‌ అయిపోతాయి. క్వాలిటీ, సరసమైన ధరతో.. భారతీయులకు టాటా కార్లు ఫేవరెట్‌గా మారాయి. ఆ నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని.. టాటా మోటార్స్‌ ఐసీఈ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాలను కూడా తయారుచేస్తోంది.

Offers-On-Tata-Cars

గతేడాది టాటా మోటార్స్‌ నుంచి సరికొత్త ఫేస్‌లిఫ్ట్‌లు, ఎలక్ట్రిక్‌ కార్లు కూడా విడుదల కావడంతో.. అమ్మకాల పరంగా కూడా టాటా మోటార్స్‌ మంచి వృద్ధిని సాధించింది. ఈ ఏడాది జనవరిలో దాదాపు 90,000 వేలా కార్ల సేల్స్‌తో ఈ సంస్థ రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఈ నెల కూడా అమ్మకాలను పెంచుకునేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకువచ్చింది.

టాటా మోటార్స్‌కు చెందిన ప్రముఖ కారు టాటా టిగోర్ సెడాన్‌పై ఈ నెలలో రూ. 60,000 వరకు తగ్గింపులను అందిస్తోంది. వీటిలో నగదు తగ్గింపు, కార్పొరేట్ డిస్కౌంట్‌, ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌లు ఉన్నాయి. ఇక ఎంట్రీ-లెవెల్ టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 40,000 వరకు నగదు తగ్గింపు మరియు రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో సహా మొత్తం రూ. 55,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

Offers-On-Tata-Cars

టాటా టిగోర్‌(Tata Tigor) మరియు టాటా టియాగో(Tata Tiago).. ఈ రెండు మోడల్స్ సింగిల్ మరియు ట్విన్ సిలిండర్ CNG ఆప్షన్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సింగిల్ సిలిండర్ టాటా టియాగో సీఎన్‌జీ మరియు టిగోర్ సీఎన్‌జీలపై రూ. 60,000 వరకు నగదు తగ్గింపు మరియు రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కొనుగోలు చేయవచ్చు.

ట్విన్ సిలిండర్ టియాగో(Tata Tiago CNG) సీఎన్‌జీ మరియు టిగోర్ సీఎన్‌జీ(Tata Tigor CNG) కార్లపై రూ. 35,000 తగ్గింపును టాటా మోటార్స్‌ అందిస్తోంది. రెండు కార్లపై రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంది. మొత్తంగా కస్టమర్లు రూ. 50,000 ప్రయోజనాలు పొందవచ్చు.

Offers-On-Tata-Cars

మధ్యతరగతి ప్రజల కోసం టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌(Tata Altorz)పై రూ. 10,000. నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. టాటా మోటార్స్‌ ప్రముఖ మోడల్‌.. Nexon EV పై రూ. లక్ష వరకు గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. గరిష్టంగా రూ.లక్ష వరకు తగ్గింపుతో నగదు కొనుగోలు చేయవచ్చని సమాచారం.

Offers-On-Tata-Cars

కాగా టాటా మోటార్స్‌కు చెందిన మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్‌పై ఎటువంటి తగ్గింపును అందించడం లేదు. ఇక టాటా నెక్సాన్, సఫారి మరియు హారియర్ కూడా పెద్దగా తగ్గింపులను అందించలేదు. డీలర్‌షిప్‌లో స్టాక్‌ లభ్యత మరియు మోడళ్ల ఆధారంగా ఈ ఆఫర్లు వర్తిస్తాయని కస్టమర్లు గమనించాలి. పూర్తి సమాచారం కోసం సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 13, 2024, 12:51 [IST]
English summary
Discounts up to rs 1 lakh on tata cars in february 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+