కొత్త ఏడాదిలో మారుతి బంపర్ ఆఫర్.. ఈ కార్లపై రూ. 47,000 వరకు భారీ డిస్కౌంట్లు, త్వరపడండి.!!
దేశంలో ప్రముఖ కార్ల తయారీదారు మారుతి సుజుకి.. తన డీలర్‌షిప్‌ల ద్వారా ఏడాది పొడవునా ఆఫర్లు ప్రకటిస్తుంది. ప్రముఖ కారు మోడళ్లపై ఆకర్షణీయమైన తగ్గింపులతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది కూడా జనవరిలో ఎంపిక చేసిన కార్లపై మారుతి సుజుకి అరేనా డీలర్లు డిస్కౌంట్లు మరియు ప్రయోజనాలను అందిస్తున్నారు.
ఈ జనవరిలో మారుతి సుజుకి అరేనా(Offers On Maruti Suzuki Cars) డీలర్‌షిప్ ద్వారా ఆల్టో కె10, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ మరియు డిజైర్ కార్ మోడళ్లపై డిస్కౌంట్లు మరియు ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు కార్పొరేట్ ఆఫర్‌లను ప్రకటించాయి. కాగా బ్రెజ్జా మరియు ఎర్టిగాపై ఎలాంటి ఆఫర్లు లేవు.

మారుతి సుజుకి ఆల్టో K10: మారుతి సుజుకి ఆల్టో K10(Maruti Suzuki Alto K10) పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లపై రూ. 47,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. రూ. 25,000 వరకు నగదు డిస్కౌంట్, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 7,000 వరకు కార్పొరేట్ తగ్గింపును పొందవచ్చు.
ఆల్టో K10 1.0-లీటర్, మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 67hp మరియు 89Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో రెనాల్ట్ క్విడ్‌కి ఆల్టో కె10 గట్టి పోటీనిస్తోంది.

మారుతీ సుజుకి ఎస్ ప్రెస్సో: S ప్రెస్సో(Maruti S Presso) పెట్రోల్ వేరియంట్‌పై రూ. 44,000 వరకు తగ్గింపును పొందవచ్చు. రూ. 23,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ. 6,000 వరకు కార్పొరేట్ ఆఫర్‌ను అందిస్తోంది. CNG వేరియంట్‌పై రూ. 18,000 నగదు తగ్గింపుతో మొత్తంగా రూ. 39,000 వరకు ఆఫర్ అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి S ప్రెస్సో.. ఆల్టో మాదిరిగానే 1.0-లీటర్ ఇంజిన్, 67 hpతో పనిచేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌లతో జత చేయబడి ఉంటుంది. మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో CNG వేరియంట్‌లో కూడా ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది.

మారుతీ సుజుకి సెలెరియో: మారుతి సెలెరియో(Maruti Celerio) అన్ని పెట్రోల్ మరియు CNG వేరియంట్‌లపై రూ. 44,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. సెలెరియో 1.0 లీటర్ ఇంజిన్, 67hpతో పనిచేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMTతో జతచేయబడి ఉంటుంది.
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్: Maruti Suzuki Wagon R పై కస్టమర్లు మొత్తంగా రూ. 41,000 వరకు తగ్గింపులను ప్రకటించింది. ఇందులో రూ. 15,000 వరకు నగదు తగ్గింపు, రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ. 6,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

వ్యాగన్ R 67hp, 1.0-లీటర్ మోటార్ లేదా 90hp, 1.2-లీటర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. రెండూ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. కాగా 1.0-లీటర్ ఇంజిన్‌తో కూడిన CNG వేరియంట్‌పై ఇది రూ. 36,000 వరకు ఆఫర్ ఉంది.
మారుతి సుజుకి డిజైర్‌పై రూ. 17,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇందులో రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 7,000 కార్పొరేట్ బోనస్ మాత్రమే ఉన్నాయి. దీనిపై నగదు తగ్గింపు లేదు. అదే 90hp, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది.

మారుతీ సుజుకి స్విఫ్ట్: స్విఫ్ట్(Maruti Suzuki Swift) పై ఈ నెలలో రూ. 37,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ. 10,000 వరకు నగదు తగ్గింపు, రూ . 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ. 7,000 వరకు కార్పొరేట్ తగ్గింపును పొందవచ్చు. CNG వేరియంట్‌పై రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో మరియు రూ. 7,000 కార్పొరేట్ బోనస్‌ను అందిస్తోంది.
స్విఫ్ట్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. 90hp, 1.2-లీటర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది ఇటీవల లాంచ్ అయిన ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మరియు టాటా టియాగోలకు గట్టిపోటీనిస్తోంది. స్టాక్ లభ్యత, రాష్ట్రం ఆధారంగా ఆఫర్లు మారుతుంటాయి. పూర్తి వివరాల కోసం మీ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించండి.


Click it and Unblock the Notifications








