కారు కొనేందుకు ఇదే మంచి సమయం.. ప్రముఖ మారుతి మోడళ్లపై రూ. లక్షకు పైగా తగ్గింపులు

ప్రతి నెలా ఆకర్షణీయమైన ఆఫర్లతో గణనీయమైన సేల్స్‌ను సాధిస్తున్న మారుతి సుజుకి.. ఈ సారి కూడా భారీ డిస్కౌంట్లతో ముందుకువచ్చింది. నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా ప్రముఖ వాహనాలపై రూ. లక్షకు పైగా తగ్గింపులను అందిస్తోంది. మరి ఏయే మోడళ్లపై ఈ ఆఫర్లు ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం..

కొత్త సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తోంది. ఈ క్రమంలో గతేడాది(Offers On Maruti Suzuki Cars) డీలర్‌షిప్‌లలో మిగిలి ఉన్న స్టాక్‌ను క్లియర్‌ చేసుకోవడానికి ఆటో మొబైల్‌ కంపెనీలు ఆఫర్లను ప్రకటించాయి. మారుతి సుజుకి కూడా ఆ వరుసలో ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటికీ ఈ తగ్గింపులు కొనసాగుతూనే ఉన్నాయి.

Offers-On-Maruti-Suzuki

ఈ క్రమంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి(Maruti Suzuki) డీలర్ల వద్ద MY2023 స్టాక్‌ మిగిలే ఉంది. ఈ మేరకు స్టాక్‌ను క్లియర్‌ చేసుకునేందుకు తన ప్రముఖ మోడళ్లపై కస్టమర్లకు కనివినీ ఎరుగని డిస్కౌంట్లను అందిస్తోంది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది గుడ్‌న్యూస్‌.. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యే లోపు మీ బడ్జెట్‌ ధరలో సంస్థకు చెందిన టాప్‌ మోడల్‌ కారును సొంతం చేసుకోవచ్చు.

మారుతి బ్రాండ్‌కు చెందిన ప్రముఖ మోడల్‌ MY2023 గ్రాండ్ విటారా హైబ్రిడ్ మరియు ఫ్రాంక్స్ టర్బో-పెట్రోల్ వేరియంట్‌లపై వరుసగా రూ. 79,000 మరియు రూ. 83,000 తగ్గింపు ప్రయోజనాలను మారుతి సుజుకి అందిస్తోంది. అదనంగా మారుతీ డీలర్లు అమ్మకాలను మరింత పెంచుకోవడానికి అన్ని మోడళ్లపై రూ. 50,000 అదనపు నగదు తగ్గింపును కూడా ప్రకటించారు.

Offers-On-Maruti-Suzuki

దీంతో మొత్తంగా MY2023 Grand Vitara మరియు Fronx వేరియంట్‌లపై కస్టమర్లు కనిష్ఠంగా రూ. 1.30 లక్షలు డిస్కౌంట్లను పొందవచ్చు. వీటితో పాటు MY2023 ఇగ్నిస్ మరియు సియాజ్ మోడల్‌లపై వరుసగా రూ. 61,000 మరియు రూ. 48,000 తగ్గింపులను సంస్థ అందిస్తోంది. కాగా వీటితో కలుపుకొని దేశవ్యాప్తంగా పలు డీలర్‌షిప్‌లలో రెండు మోడళ్లపై వరుసగా రూ. 1 లక్షకు పైగా తగ్గింపును అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రముఖ ఆఫ్‌ రోడర్‌ మారుతి సుజుకి జిమ్నీపై అదిరిపోయే ఆఫర్లను పొందవచ్చు. అధికారికంగా రూ. 1.50 లక్షల తగ్గింపుతో పాటు, విక్రయాలను పెంచడానికి మారుతి సుజుకి థండర్ ఎడిషన్‌పై తాత్కాలికంగా ధరలను తగ్గించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ అధికారిక ఆఫర్‌పై డీలర్లు అదనంగా రూ. 50,000 తగ్గింపును ప్రకటించాయి. డిస్కౌంట్ల ద్వారా ఇప్పటికే మార్కెట్లో జిమ్నీకి డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

Offers-On-Maruti-Suzuki

ఈ ఆఫర్లు రాష్ట్రం నుంచి రాష్ట్రానికి మారుతుంటాయి. డీలర్‌షిప్‌లలో స్టాక్‌, కలర్‌, వేరియంట్ల లభ్యత ఆధారంగా ఆఫర్లు ఉంటాయని గమనించాలి. కాగా స్టాక్‌ క్లియరెన్స్‌ కోసం డీలర్లు ఈ ఆఫర్లు ప్రకటించాయి కాబట్టి.. కస్టమర్లు రీసేల్‌ వ్యాల్యూని కూడా పరిగణనలోకి తీసుకుని కారు కొనేముందు సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నాం.

Offers-On-Maruti-Suzuki

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, March 1, 2024, 9:18 [IST]
English summary
Discounts upto rs 1 lakh on maruti suzuki grand vitara fronx ignis ciaz and jimny check full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+