ఇలాంటి ఆఫర్‌ మళ్ళీమళ్లీ రాదు.. ఈ ప్రముఖ బ్రాండ్ కారుపై ఏకంగా రూ. 3.35 లక్షల భారీ తగ్గింపు

భారత్‌లో వోల్వో ఇటీవలే XC40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ SUV యొక్క ప్లస్‌ వేరియంట్‌ను మరింత సరసమైన ధరలో విడుదల చేసింది. మార్కెట్లో దీని ధర రూ. 54.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే దీని టాప్-స్పెక్ వోల్వో XC40 రీఛార్జ్ అల్టిమేట్ వేరియంట్‌పై సంస్థ భారీ తగ్గిపులను అందిస్తోంది. దీనిపై దాదాపుగా కస్టమర్లు రూ. 3.35 లక్షల వరకూ ప్రయోజనాలు పొందవచ్చు.

వోల్వో ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో, వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ అల్టిమేట్ వేరియంట్‌పై తగ్గింపు వివరాలను సంస్థ పేర్కొంది. కాగా నిజానికి వోల్వో XC40 రీఛార్జ్ SUV అల్టిమేట్ వేరియంట్‌పై వోల్వో రూ. 2.35 లక్షల వరకు తగ్గింపులను అందిస్తుండగా.. కస్టమర్లను మరింతగా ఆకట్టుకోవడానికి.. డిస్కౌంట్లను మరింతగా ప్రకటించింది.

Volvo-XC40-Recharge-Electric-SUV-Offers

ఆసక్తి గల కస్టమర్లు కొత్త వోల్వో XC40 రీఛార్జ్ SUV(Volvo XC40 Recharge Offers)ని కొనుగోలు చేయాలనుకుంటే, రూ. 3.35 లక్షల వరకు మొత్తం ప్రయోజనాలను పొందవచ్చని సంస్థ తెలిపింది. భారీ తగ్గింపు ద్వారా వోల్వో XC40 రీఛార్జ్ అల్టిమేట్‌ను కేవలం రూ. 54.55 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఈ భారీ తగ్గింపుతో ఈ టాప్‌ స్పెక్‌ వోల్వో XC40.. బేస్‌ స్పెక్‌ వోల్వో(Volvo XC40 Recharge Price) XC40 కంటే తక్కువ ధరలో లభిస్తుంది. బేస్‌ స్పెక్‌ వోల్వో XC40 ప్లస్‌ వేరియంట్‌ కంటే రూ. 40,000 తక్కువగా ఉండటం విశేషం. కాగా ఈ ఎస్‌యూవీలు ఇప్పుడు లిమిటెడ్‌ సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Volvo-XC40-Recharge-Electric-SUV-Offers

వోల్వో XC40 టాప్‌ స్పెక్‌ వేరియంట్‌.. ఇప్పుడు తగ్గింపు ధరతో రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయని గమనించాలి. వోల్వో XC40 రీఛార్జ్ అల్టిమేట్‌ విషయానికొస్తే ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లను కలిగి ఉంది. ఫలితంగా ఇది మొత్తం 404 bhp మరియు 660 Nm టార్క్‌తో కూడిన AWD మోడల్.

వోల్వో XC40 టాప్‌ స్పెక్‌ వేరియంట్‌ అల్టిమేట్‌.. కేవలం 4.9 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అదేవిధంగా పూర్తి ఛార్జ్‌పై 418 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. కాగా వోల్వో XC40 రీఛార్జ్ ప్లస్ కేవలం 235.6bhp మరియు 420Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7.3 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అయితే చిన్న 69 kWh బ్యాటరీ ప్యాక్ ఇది 475km రేంజ్‌ను ఇస్తుంది.

ఇక వోల్వో XC40 రీఛార్జ్ అల్టిమేట్ వేరియంట్లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో అధునాతన పిక్సెల్ LED హెడ్‌లైట్లు, ఫాగ్ ల్యాంప్స్,మరియు పవర్డ్ చైల్డ్ సేఫ్టీ లాక్, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, సైడ్ పార్కింగ్ సెన్సార్లు, హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ వంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంది.

కాగా ప్రముఖ కార్ల తయారీదారు వోల్వో తన XC40 రీఛార్జ్ అల్టిమేట్ వేరియంట్‌పై ఇలాంటి భారీ ఆఫర్‌ను ప్రకటించడం చాలా అరుదు. ఇంకా ఎంపిక చేసిన వేరియంట్లపై ఇంత భారీ తగ్గింపును మరెప్పుడూ చూడలేము. ఈ క్రమంలో మెరుగైన పనితీరుతో ఉన్న ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేయాలంటే ఇదే సరైన సమయం.

More from DriveSpark

Article Published On: Friday, March 8, 2024, 17:15 [IST]
English summary
Discounts upto rs 3 35 lakhs on volvo xc40 recharge electric suv cheaper than base variant
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+