బెంగళూరులో డ్రైవర్‌లెస్‌ కారు.. కట్‌చేస్తే ఖతర్నాక్‌ ట్విస్ట్‌

ఇటీవల బెంగళూరు నగరంలో డ్రైవర్‌లెస్‌ కారు వీడియో వైరల్ అయ్యింది. మహీంద్రా మరాజో ఎంపీవీపై "నో డ్రైవర్" అని రాసి ఉన్న పోస్టర్లతో ఆ కారు చక్కర్లు కొట్టింది. దీంతో డ్రైవర్‌ లేకుండా బెంగళూరు వీధుల్లో తిరిగిన ఆ కారు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేసింది. మహీంద్రా డ్రైవర్‌లెస్‌ కారుని ప్రయత్నిస్తుందంటూ పుకార్లు కూడా వచ్చాయి. కట్‌చేస్తే

రెండు వారాల క్రితం బెంగళూరు వీధుల్లో డ్రైవర్‌లెస్‌ టెక్నాలజీని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దానికి సంబంధించిన వీడియో పలు సోషల్‌ మీడియా వేదికల్లో కనిపించింది. ఈ ట్రయల్స్‌ చివరి దశకు చేరుకున్నాయని అందుకే రద్దీ ప్రాంతాల్లో పరిశీలిస్తున్నట్లు కొన్ని వార్తా పత్రికలు రాసుకొచ్చాయి. మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి తొలి డ్రైవర్‌లెస్‌ కారు వస్తుందని కూడా అన్నారు. ఫైనల్‌గా డ్రైవర్‌లెస్ కారుపై వివిధ రకాల ఊహాగానాలు పెరిగిపోయాయి.

Driverless-Car-Bangalore

తాజాగా విడుదలైన చిత్రాల ప్రకారం అది డ్రైవర్ లెస్ కారు కాదని తేలింది. కో ప్యాసింజర్ సీట్లో కూర్చుని ఓ వ్యక్తి కారుని నడిపినట్లు వెల్లడైంది. అచ్చం డ్రైవర్‌లెస్‌ కారులా దీనిని డెకరేట్‌ చేయడంతో నిజంగానే డ్రైవర్‌లెస్‌ కారుగా భావించారు. చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం ఇది డ్రైవర్‌ రహిత కారు అని రాసిన బోర్డు, హజార్డ్ లైట్లను ఆన్ చేసి బెంగళూరులోని రద్దీ వీధుల్లో నెమ్మదిగా కదులుతూ కనిపించింది.

తొలుత ఈ వీడియో చూసి అందరు అవాక్కయ్యారు. అయితే అసలు విషయం తెలిసి నోరెళ్లబెడుతున్నారు. మహీంద్రా మరాజో ఎంపీవీలో కూర్చున్న వ్యక్తి వాస్తవానికి 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉన్నాడు. దీంతో అతడు ప్యాసింజర్‌ సీట్‌లో కూర్చుని కారుని సులభంగా హ్యాండిల్‌ చేస్తూ రోడ్డుపై నడిపాడు. క్లచ్, బ్రేకులు మరియు యాక్సిలరేటర్‌ని కాళ్లతో నియంత్రించాడు. దీంతో దానిని అందరూ డ్రైవర్‌లెస్‌ కారుగా నమ్మేశారు.

Driverless-Car-Viral

బెంగళూరులోని జేపీ నగర్‌కి చెందిన వ్యక్తి ఫరాన్ ఈ కారుని నడిపాడు. గత కొన్నేళ్లుగా ఇతను పబ్లిక్‌ రోడ్లపై విన్యాసాలు చేస్తూ ఉన్నాడు. గత పదేళ్లుగా తనకు ఉన్న అనుభవంతో రోడ్లపై సులభంగా కారుని నడపగలడు. కేవలం కాళ్లతో బ్రేక్, యాక్సిలరేటర్, క్లచ్‌ని నియంత్రించడమే కాకుండా స్టీరింగ్ వీల్‌ని కూడా అదే పాదాలను నడిపే టాలెంట్‌ అతడికి ఉంది.

ఇక వైరల్‌ అయిన వీడియో ప్రకారం పైకప్పుపై ఎలాంటి సెన్సర్లు, రాడార్లు లేవు. దీని ప్రకారం అది డ్రైవర్‌లెస్‌ కారు కాదు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని తేలింది. రోడ్లపై ఇతర వాహనదారుల దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే ఈ స్టంట్స్‌ చేసినట్లు వెల్లడైంది. అయితే ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ముందస్తు జాగ్రత్తగా కారుని ప్రత్యేకంగా తయారు చేశాడు.

ఫరాన్ పొడవుగా ఉన్నంత మాత్రాన బాధ్యతారహిత్యంగా కారుని నడపడం నేరమని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ కారుని నడపడానికి అతనికి అనుమతి లేదు. ఇలాంటి ప్రయోగాలకు కూడా రద్దీ రోడ్లపై పర్మిషన్‌ లేదు. ఇలాంటి వాటిని ప్రోత్సాహించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నారు. వాహనంపై తనకు పూర్తి నియంత్రణ ఉందని ఫరాన్ చెబుతున్నాడు. కానీ ఇది మంచి చర్య కాదని హెచ్చరిస్తున్నారు.

డ్రైవింగ్‌లో ఎంత ప్రావీణ్యం ఉన్నాకానీ అయితే అత్యవసర పరిస్థితుల్లో హ్యాండిల్ చేయడం కష్టం. ఇది ప్రమాదానికి దారితీయవచ్చు. అంతే కాకుండా తోటి ప్రయాణికులకు సైతం ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంటుంది. గత కొన్ని రోజులుగా నగరంలోనే కారు నడుపుతున్న ఫరాన్ పబ్లిసిటీని పెంచుకుంటున్నాడు. అయితే సంబంధిత అధికారులు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ వీడియోను గమనించి డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 28, 2024, 10:21 [IST]
English summary
Driverless car spotted in bangalore is not true real story behind this viral car
Read more on: #driverless car #car #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+