పెట్రోల్‌ ‌అవసరం లేదు, మెయింటైనెన్స్‌ మాటే వద్దు.. ఎలక్ట్రిక్‌ కార్లకు కొబ్బరికాయలు కొడుతున్న జనాలు!

గత రెండేళ్లుగా దేశంలో ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. వీటి కొనుగోళ్లు పెట్రోల్‌ కార్లతో పోలిస్తే సంఖ్య తక్కువే అయినా కానీ మొత్తం అమ్మకాల పరంగా సత్తాచాటుతున్నాయి. ఈ విభాగానికి చెందిన కార్లు హెచ్చు తగ్గుల మధ్య కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్‌కి చెందిన కార్లు ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌లో ఇప్పటివరకు కింగ్‌ మేకర్‌గా ఉండగా.. తాజాగా ఎంజీ మోటార్స్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇక అక్టోబర్ 2024 లో ఓవరాల్‌ ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) వెల్లడించింది. గత నెల సేల్స్‌కి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

గత నెలలో మొత్తం 10,609 ఎలక్ట్రిక్ కార్లు సేల్ అయ్యాయి. ఇది గత సంవత్సరం అక్టోబర్‌ అమ్మకాలతో పోలిస్తే 39.12% ఎక్కువ కావడం విశేషం. 2024 సెప్టెంబర్‌లో విక్రయించిన 5,874 కార్లతో పోలిస్తే ఇది 80.61% నెలవారీ పెరుగుదలను నమోదు చేసింది. గత నెలలో టాటా మోటార్స్ 6,152 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడం ద్వారా మార్కెట్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

Tata Electric Car Sales in October 2024

గత ఏడాదితో పోలిస్తే ఇవి 9.90 శాతం పెరగడం గమనార్హం. ఇక నెలవారీ ప్రాతిపదికన 69.60 శాతం పెరుగుదలను టాటా మోటార్స్‌ సాధించింది. గత నెలలో ఎంజీ మోటార్స్‌కి చెందిన ఎలక్ట్రిక్‌ కార్లు తొలి స్థానాన్ని ఆక్రమించాయి. ఇది టాటా గిరాకీకి భారీ గండి కొట్టింది. అయితే అక్టోబర్‌లో పుంజుకుని ఏకంగా70 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.

టాటా ఎలక్ట్రిక్ లైనప్స్‌లో కర్వ్‌, టియాగో, పంచ్, నెక్సాన్, టిగోర్ వంటి మోడళ్లు ఉన్నాయి. వీటిలో టాటా కర్వ్‌ కొత్తది కాగా.. మిగతావి మార్కెట్‌లో మంచి పాపులారిటీని కలిగి ఉన్నాయి. ఇక 2,530 కార్ల అమ్మకాలతో ఎంజీ మోటార్స్ రెండో స్థానంలో ఉంది. గత ఏడాది ఇదే నెలలో కేవలం 944 కార్ల అమ్మకాలతో పోలిస్తే 168.01% వృద్ధిని సాధించింది.

MG Windsor Electric Car Sales in October 2024

గత నెలలో ఈ కంపెనీ మొత్తం 4558 ఎలక్ట్రిక్‌ కార్లను విక్రయించి టాప్‌లో నిలిచింది. ఈ నెల సేల్స్‌ భారీగా తగ్గాయి. ఎంజీ లైనప్స్‌లో కామెట్, జెడ్ ఎస్ ఈవీ ఉన్నాయి. అలాగే తాజాగా విడుదలైన విండ్సర్ ఈవీ మార్కెట్‌లో అదరొడుతోంది. ఈ కారు బ్యాటరీ రెంటల్‌ కింద కేవలం రూ.9.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. ఈ కారు విడుదలతో ఎంజీ మోటార్స్‌ అమ్మకాలు భారీగా పెరిగాయి.

మహీంద్రా ఎలక్ట్రిక్ 2024 అక్టోబర్‌లో మొత్తం 907 యూనిట్లను విక్రయించగా.. గత ఏడాది అక్టోబర్‌లో 277 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఈ కంపెనీ నుంచి ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్‌ కారు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక చైనాకు చెందిన బీవైడీ అక్టోబర్ నెలలో 363 ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ని విక్రయించి భారత మార్కెట్‌లో గ్రిప్‌ పెంచుకుంటోంది. గత ఏడాది అక్టోబర్‌లో విక్రయించిన 144 కార్లతో పోలిస్తే సేల్స్‌ పెరిగాయి.

BYD eMax Electric Car Sales in October 2024

ఫాడా వెల్లడించిన ఇతర ఎలక్ట్రిక్‌ కంపెనీల విషయానికి వస్తే సిట్రోయిన్‌ 254 కార్లు, BMW 140 కార్లు, మెర్సిడెస్ బెంజ్ 146 కార్లను విక్రయించింది. కియా ఈవీ6 ఏకైక కారు కేవలం 35 కార్లను అమ్ముడయ్యాయి. ఇక వోల్వో కేవలం 15 కార్లను మాత్రమే విక్రయించింది. ఆడి తక్కువ అమ్మకాలతో కేవలం నాలుగు కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక ఇతర బ్రాండ్లు మొత్తం 30 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాయి.

ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరగడం ఓ విధంగా మంచి పరిమాణంగా భావించవచ్చు. తయారీదారులు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం, అలాగే ఇతర లైనప్లను విస్తరించడంతో సేల్స్‌ పెరిగాయి. ప్రజల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై నమ్మకం పెరగడం కూడా ఈ సేల్స్‌ పెరగడానికి దోహదపడ్డాయి. ఎలక్ట్రిక్ వాహనాలు ఖరీదైనవి అయినప్పటికీ.. ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేయడం ప్రారంభించారు.

More from DriveSpark

Article Published On: Monday, November 11, 2024, 8:50 [IST]
English summary
Electric car sales in october 2024 company wise sold units check here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+