అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ టూవీలర్స్‌కి బ్రహ్మరథం.. రికార్డు తిరగరాసిన కొనుగోళ్లు!
దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు లేని విధంగా అక్టోబర్ 2024లో ఎలక్ట్రిక్ టూవీలర్ సేల్స్ గణనీయమైన వృద్ధిని సాధించాయి. ఇది పండుగ సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డుని నమోదు చేశాయి. మొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్ అమ్మకాల్లో ఓలా ఈవీ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అన్ని కంపెనీలు కలిపి మొత్తం 1,39,031 యూనిట్ల రిటైల్ అమ్మకాలు జరిగాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో విక్రయించిన 75,164 వాహనాలతో పోలిస్తే సేల్స్ 85% పెరిగింది.
ప్రస్తుతం దేశంలో ఓలా ఎలక్ట్రిక్ అక్టోబర్ 2024లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్‌లో విక్రయించిన 24,715 యూనిట్లతో పోలిస్తే అక్టోబర్‌లో 41,606 వాహనాలను విక్రయించింది. ఇది 68.34% వృద్ధిని నమోదు చేసింది. టీవీఎస్ మోటార్ కూడా సెప్టెంబర్‌లో 18,216 వాహనాల నుంచి అక్టోబర్‌లో 29,912 వాహనాలకు వాహనాలను పెంచుకుంది. ఇది కూడా 64.21% వృద్ధి రేటును సాధించింది.

బజాజ్ ఆటో అమ్మకాలు సెప్టెంబర్లో 19,196 వాహనాల నుంచి అక్టోబర్‌లో 28,223 వాహనాలకు పెరిగాయి. ఇది 47.03% వృద్ధిని సాధించింది. ఏథర్ ఎనర్జీ అమ్మకాలు కూడా భారీగా 24.66% పెరిగాయి. అక్టోబర్‌లో విక్రయించిన 15,991 యూనిట్లతో పోలిస్తే, సెప్టెంబర్‌లో 12,828 యూనిట్లు తక్కువగా అమ్ముడయ్యాయి. హీరో మోటోకార్ప్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్/ఆంపియర్ వరుసగా 69.20%, 41.96% వృద్ధి రేటును నమోదు చేశాయి.
అక్టోబర్‌లో వార్షిక పనితీరు అంచనా ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు అక్టోబర్ 2023 లో 23,891 వాహనాల నుంచి ఈ సంవత్సరం 41,606 వాహనాలకు పెరిగాయి. ఇది 74.15% వృద్ధిని చవిచూసింది. టీవీఎస్ మోటార్ వార్షిక అమ్మకాలు 81.21 శాతం పెరిగి 16,507 వాహనాల నుంచి 29,912 వాహనాలకు పెరిగాయి. ఇది కూడా మంచి అమ్మకాలను రాబట్టింది.

బజాజ్ ఆటో గత ఏడాది విక్రయించిన 9,070 యూనిట్లతో పోలిస్తే 211.17% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఏథర్ ఎనర్జీ అమ్మకాలు 88.48 శాతం పెరగ్గా, హీరో మోటోకార్ప్ అమ్మకాలు 277.44 శాతం పెరిగాయి. అయితే గ్రీవ్స్ ఎలక్ట్రిక్/యాంపియర్ అమ్మకాలు -16.02% క్షీణించాయి. అయినా కానీ మార్కెట్‌లో ఈ స్కూటర్లు స్థిరంగా రాణిస్తున్నాయి.
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు ఓలా ఎలక్ట్రిక్ మొత్తం 3,64,258 వాహనాలను విక్రయించగా.. గత ఏడాది ఇదే కాలంలో 2,06,833 వాహనాలను విక్రయించి 76.11% వృద్ధి రేటును నమోదు చేసింది. టీవీఎస్ మోటార్ కంపెనీ అమ్మకాలు 30.07 శాతం పెరిగి 1,75,744 యూనిట్లుగా నమోదయ్యాయి.

బజాజ్ ఆటో అమ్మకాలు ఈ ఏడాది ఇప్పటివరకు 67.26% పెరిగి దాదాపు 1.5 లక్షల (1,48,589) వాహనాలకు చేరుకున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే గత సంవత్సరం 90,000 (88,839) వాహనాలతో పోలిస్తే మంచి అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. ఏథర్ ఎనర్జీ కూడా తన అమ్మకాలను 106.28% రెట్టింపు చేసుకుంది.
మరోవైపు హీరో మోటోకార్ప్ అమ్మకాలు నాలుగు రెట్లు (443.24%) పెరిగి అసాధారణ విజయాన్ని సాధించింది. మరోవైపు గ్రీవ్స్ ఎలక్ట్రిక్/యాంపియర్ మైనస్ 51.10 శాతం క్షీణించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ భారతదేశం అంతటా వేగంగా విస్తరిస్తోంది. పండుగ సీజన్లో కస్టమర్ డిమాండ్ దేశవ్యాప్తంగా కొనుగోలుదారులలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.


Click it and Unblock the Notifications








