Honda Elevate మార్కెట్లో ఈ కారుకు క్రేజీ డిమాండ్.. స్టన్నింగ్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న హోండా కొత్త మోడల్
ఫోర్డ్ తర్వాత భారత మార్కెట్‌ను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్న మరో సంస్థగా హోండాను ప్రజలు భావించారు. 2017 తర్వాత, కొత్త కారును కూడా విడుదల చేయనందుకు కంపెనీ ప్రణాళికలు ఏమిటనే సందేహం నెలకొంది. అయితే అన్ని పుకార్లను గాలికి వదిలేస్తూ.. హోండా తన సరికొత్త మోడల్‌ను(Honda Elevate) విడుదల చేసింది.
2023 హోండాను కలిసొచ్చిన సంవత్సరం. ఎందుకంటే కంపెనీ ఎలివేట్‌ను మిడ్-సైజ్ SUV విభాగంలోకి విడుదల చేసింది. అదే సమయంలో హ్యుందాయ్ క్రెటా మరియు మారుతి గ్రాండ్ విటారా మార్కెట్‌లో దూకుడు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో హోండా.. తన సరికొత్త మోడల్ ఎలివేట్‌తో మార్కెట్‌ను కైవసం చేసుకుంటోంది. ఎలివేట్ ఇంతలా ప్రజాదరణ పొందటానికి కారణం.. చాలా కాలం తర్వాత హోండా యొక్క మొదటి SUV ఇదే.

గతంలో CR-V వంటి పెద్ద SUVలు మార్కెట్‌లోకి వచ్చినప్పుడు స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు అంతగా ప్రాచుర్యం పొందలేదు. డిమాండ్ లేకపోవడంతో, ఈ ప్రీమియం వాహనం కొంతకాలం తర్వాత భారతదేశం నుండి నిలిపివేయబడింది. ఆ తర్వాత కంపెనీ దృష్టి(Honda Cars) సిటీ, అమేజ్ వంటి సెడాన్‌లపై పడింది. ఈలోగా ఎస్‌యూవీలు మార్కెట్‌లో ట్రెండ్‌గా మారాయి.
దీంతో కొంత కాలం తర్వాత ఎస్‌యూవీలు ప్రజాదరణ పొందుతుండటంతో ఎలివేట్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. అనతి కాలంలోనే కస్టమర్ల(Honda Cars Sales)కు ఫేవరెట్ కారుగా మారింది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తి వంతమైన ఇంజిన్‌తో తక్కువ ధరలో హోండా అందుబాటులో ఉండటంతో ఎలివేట్ త్వరగా ప్రజాదరణ పొందింది. దేశీయ మార్కెట్లో హోండా ఎలివేట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.58 లక్షల నుండి రూ. 16.48 లక్షల మధ్య ఉంది.

కాగా హోండా ఎలివేట్(Honda Elevate Sales In India) SUV ఇప్పటి వరకూ దేశంలో 20,000 యూనిట్ల విక్రయ మైలురాయిని అధిగమించింది. ఎలివేట్ ఇంజిన్ 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. 119 బీహెచ్‌పీ పవర్ మరియు 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనం 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కలిగి ఉంది.
సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే.. ఎలివేట్ అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), మల్టీ-యాంగిల్ రియర్‌వ్యూ కెమెరాలు, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు మరిన్ని వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఎలివేట్ ఇప్పుడు భారతదేశంలో హోండా యొక్క SUV వ్యూహంలో కీలక భాగంగా మారింది. హోండా ఇప్పుడు కొంచెం ఆలస్యంగానైనా రాబోయే రెండేళ్లలో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉంది.

గత నెలలో దేశవ్యాప్తంగా హోండా కార్స్ 8,681 కార్లను విక్రయించగా.. గత ఏడాది జనవరి అమ్మకాలతో పోలిస్తే 10 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతుల పరంగా జపనీస్ వాహన తయారీదారులకు జనవరి 2024 ఉత్తమ నెలగా నిలిచింది. గత నెలలో ఎగుమతి చేసిన కార్ల సంఖ్య 4,531 యూనిట్లు కాగా.. ఫ్లాగ్‌షిప్ SUV ఎలివేట్ విజయం హోండా అమ్మకాల్లో పుంజుకోవడానికి ఇది ప్రధాన కారణం.

ఎలివేట్ SUV సేల్స్ చార్ట్‌లలో త్వరగా బెస్ట్ సెల్లర్‌గా మారింది. గతేడాది సెప్టెంబర్‌లో ఎలివేట్ ఎస్‌యూవీని విడుదల చేసిన తర్వాత, హోండా తన నెలవారీ అమ్మకాల్లో భారీ పెరుగుదలను చూసింది. ప్రతినెలా సగటున 4,000 యూనిట్ల కంటే ఎక్కువ విక్రయాలతో నష్టాల్లో ఉన్న మార్కెట్ నుంచి హోండా బయటపడగలిగింది.
సిటీ మరియు అమేజ్ వంటి సెడాన్‌లు మంచి పనితీరును కొనసాగిస్తున్నప్పటికీ, భారతదేశంలో హోండా రీమోడల్ ఎలివేట్ SUV విజయానికి ఆజ్యం పోస్తోంది. గత ఏడాది జనవరిలో నాలుగు మోడళ్లను విక్రయిస్తున్నప్పటికీ హోండా 7,821 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఇప్పుడు విక్రయిస్తున్న ఎలివేట్, సిటీ మరియు అమేజ్, హోండాకు 10 శాతానికి పైగా వృద్ధి రేటును సాధించాయి.

ఎలివేట్‌తో పాటు, హోండా సిటీ మరియు అమెజాన్‌ల తిరుగులేని విజయం తమ జోరును కొనసాగించడంలో కీలకపాత్ర పోషించిందని అని హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్ మరియు సేల్స్ డైరెక్టర్ యుయిచి మురచా అన్నారు. దీనితో పాటు, హోండా కార్స్ ఇండియా తన ప్యాసింజర్ వాహనాల కోసం అల్ట్రా బాడీ కోటింగ్‌ను కూడా ప్రవేశపెట్టింది.

ఈ కోటింగ్ ఎలివేట్, సిటీ మరియు అమేజ్ వంటి హోండా కార్లకు అల్ట్రా-గ్లాసీ, గ్లాస్ బేస్డ్, స్మూత్ సర్ఫేస్‌ని ఇస్తుందని మరియు కారు బాహ్య పెయింట్ యొక్క షైన్‌ను నిర్వహిస్తుందని కంపెనీ పేర్కొంది. దుమ్ము, UV కిరణాలు, యాసిడ్ వర్షం మరియు గీతలకు వ్యతిరేకంగా యాంటీ ఫౌలింగ్ ఎఫెక్ట్స్ నుంచి వాహనాన్ని రక్షిస్తుంది. సమగ్ర మూడేళ్ల వారంటీతో రూ. 28,900 నుంచి దేశంలోని అన్ని డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








