షాకింగ్ న్యూస్: భారత్‌లో పెట్రోల్, డీజిల్ కార్లు నిషేధం! - నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

ఆధునిక భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ తరుణంలో నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. 2034 నాటికి దేశంలో డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలను నిలివేసే దిశగా ఇండియన్ గవర్నమెంట్ యోచిస్తోందని అన్నారు. ఇప్పటికే పలు ప్రధాన నగరాల్లో డీజిల్ కార్ల వాడకం పూర్తిగా తగ్గిపోయింది. కొన్ని అగ్ర సంస్థలు కూడా డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేశాయి. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. డీజిల్ వాహనాల పరిస్థితే.. పెట్రోల్ కార్లకు పడుతుందని అనిపిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..

నితిన్ గడ్కరీ సంచలన ప్రకటనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వాహనాలను ఫాస్ట్‌ట్యాగ్‌ తప్పనిసరి అంటూ పేర్కొన్నారు. ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్‌ స్థానంలో శాటిలైట్ విధానం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. కాగా ఇప్పుడు డీజిల్, పెట్రోల్ వాహనాలకు మంగళం పాడనున్నట్లు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో డీజిల్, పెట్రోల్ కార్ల వినియోగం దాదాపు ఉండకపోవచ్చనే తెలుస్తోంది.

Nitin Gadkari

నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన పర్యావరణ హితంగా ఉన్నప్పటికీ.. ఆటోమొబైల్ కంపెనీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించే అవకాశం లేదనిపిస్తోంది. నిజానికి నితిన్ గడ్కరీకి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మీద ఆసక్తి ఎక్కువ. అంతే కాకుండా ఫ్యూయెల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో జరిగిన ర్యాలీలో మంత్రి మాట్లాడుతూ ప్రకటించారు.

రాబోయే పదేళ్లలో డీజిల్, పెట్రోల్ వాహనాలను పూర్తిగా నిలిపివేయాలనుకుంటున్నట్లు నితిన్ గడ్కరీ ప్రకటిస్తూ.. ఆధునిక కాలంలో బైకులు, కార్లు, బస్సులు వంటివి ఎలక్ట్రిక్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఒక ఫ్యూయెల్ వాహనానికి అయ్యే ఖర్చు రూ. 100 అయితే, ఎలక్ట్రిక్ వాహనానికి కేవలం నాలుగు రూపాయలు మాత్రమే అవుతుందని వివరించారు. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ కూడా చాలా తక్కువని స్పష్టంగా అర్థమవుతోందని చెప్పుకొచ్చారు.

Fuel Refilling

పెట్రోల్ మరియు డీజిల్ కార్లను నిషేధించడం మరియు ఎలక్ట్రిక్ వాహన వినియోగం గురించి ప్రస్తావించిన నితిన్ గడ్కరీ.. రాబోయే రోజుల్లో భారతదేశానికి దిగుమతి చేసుకునే ముడి చమురును కూడా తగ్గించాలని వివరించారు. దీంతో దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా పెరుగుతుందని అన్నారు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ కొనసాగుతోంది. కాబట్టి భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతుందని గడ్కరీ అన్నారు.

ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి, విక్రయిస్తున్నాయి. అంతే కాకుండా ఇతర దేశాల కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను భారతదేశంలో ప్రవేశపెడుతున్నాయి. మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్రం సబ్సిడీలను కూడా అందిస్తోంది. ఇవన్నీ తప్పకుండా ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచుతాయని స్పష్టంగా తెలుస్తోంది. గడ్కరీ మాటలే నిజమయితే భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ కార్లు కనుమరుగయ్యే అవకాశం ఉంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం సాధ్యమే.. కానీ ఇప్పటికి కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవు. ఈ కారణంగా ఇప్పటికీ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారు కొనే సమయంలో కొంత ఆలోచిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగాలంటే కేంద్రం మరియు వాహన తయారీ సంస్థలు విరివిగా ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, June 7, 2024, 9:00 [IST]
English summary
End of 2034 petrol and diesel cars will be eliminate in india
Read more on: #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+