భారత్‌లోకి టెస్లా ప్రత్యర్థి - విన్‌ఫాస్ట్ కొత్త కార్లు వచ్చేస్తాయ్..
భారతీయ విఫణిలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న తరుణంలో దేశీయ వాహన తయారీ దారులు మాత్రమే కాకుండా.. అన్యదేశ్య సంస్థలు కూడా ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే వియత్నాంకు చెందిన 'విన్‌ఫాస్ట్' (VinFast) అరంగేట్రం చేయనుంది.
వియత్నాం దేశానికి చెందిన ఆటోమోటివ్ కంపెనీ విన్‌ఫాస్ట్ ఆటో లిమిటెడ్ ఏకంగా 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16,600 కోట్ల కంటే ఎక్కువ) పెట్టుబడితో తమిళనాడులోని తూత్తుకుడిలో ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. దీని కోసం సంస్థ ఈ నెల 25న శంకుస్థాపన చేయడానికి సంకల్పించినట్లు సమాచారం.

3500 మందికి ఉపాధి..
విన్‌ఫాస్ట్ కంపెనీ ఏకంగా 400 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు బ్యాటరీల తయారీ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఇది మొదటి దశలో 1,50,000 ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన, ఆ తరువాత ఉత్పత్తి సామర్థ్యాన్ని సంస్థ పెంచవచ్చని తెలుస్తోంది. దీని ద్వారా సుమారు 3500 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది.
తమిళనాడులో విన్‌ఫాస్ట్ కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు.. దేశంలో డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను ప్రారంభించి క్రమంగా వాటి సంఖ్యను పెంచడానికి సంస్థ యోచిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం సహకారంతో విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం పెడుతున్న పెట్టుబడి రాష్ట్ర చరిత్రలోనే ఇదే అత్యధికం కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే విన్‌ఫాస్ట్ కార్లు త్వరలోనే భారతీయ రోడ్లమీద తిరగనున్నట్లు స్పష్టమవుతోంది.

ప్రారంభంలో VF e-34 మోడల్..
విన్‌ఫాస్ట్ సంస్థ దేశ వ్యాప్తంగా తన నెట్‌వర్క్ విస్తరించడం మాత్రమే కాకుండా టెస్లా మోడల్ కార్ల కంటే కూడా చవకైన కార్లను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే టెస్లాకు భారతీయ మార్కెట్లో గట్టి పోటీ ఇస్తుందని తెలుస్తోంది. ప్రారంభంలో కంపెనీ కాంపాక్ట్ SUV క్రాస్‌ఓవర్ VF e-34 మోడల్ తీసుకురానున్నట్లు, ఆ తరువాత VF e-36, VF6 మరియు VF7 వంటి పెద్ద మోడల్స్ తీసుకురానుంది.
విన్‌ఫాస్ట్ కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ కార్లు టెస్లా మరియు ఇతర బ్రాండ్ కార్లకంటే ఉత్తమ డిజైన్ మరియు హై ఎండ్ ఫీచర్స్ తీసుకురానున్నట్లు సమాచారం. నిజానికి 2017లో ప్రారంభమైన విన్‌ఫాస్ట్ 2021లో ఈవీ రంగంలో అడుగుపెట్టింది. ఇది చిన్న కంపెనీ అయినప్పటికీ అమెరికన్ మార్కెట్లో ఏకంగా 50 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి టెస్లాకు ప్రత్యర్థిగా నిలిచింది.

అమెరికాలో నార్త్ కరోలినాలో కూడా విన్‌ఫాస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. 2021లో ఎలక్ట్రిక్ వాహన రంగంలో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 14291 యూనిట్ల కార్లను విక్రయించి అమ్మకాల్లో మంచి రికార్డ్ కైవసం చేసుకుంది. ఇందులో కూడా ఒక్క 2023లో మాత్రమే కంపెనీ 34855 యూనిట్ల కార్లను విక్రయించినట్లు సేల్స్ డేటా ద్వారా తెలుస్తోంది.
ఇండియాకు టెస్లా..
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) గత కొంత కాలంలో భారతదేశంలో ప్రవేశించడానికి సన్నద్ధమవుతూనే ఉంది. గత ఏడాది అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీతో టెస్లా సీఈఓ 'ఎలాన్ మస్క్' (Elon Musk) చర్చలు జరిపి భారతదేశంలో తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే టెస్లా ప్లాంట్ ఏర్పాటుకు సరైన ప్రదేశాన్ని కూడా ఎంపిక చేసుకుంది.
టెస్లా కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఇప్పటికే గుజరాత్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు.. ఇందులో కూడా సనంద్, దోలేరా మరియు బెచరాజీ ప్రాంతాలను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే టెస్లా ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన పనులు ఇంకా ప్రారంభమే కాలేదు, కానీ దాని ప్రత్యర్థి కంపెనీ మాత్రం ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైపోయింది. అయితే టెస్లా ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








