వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
ప్రకృతి వైపరీత్యాల కారణంగా యూఏఈ, ఒమన్ వంటి దేశాల్లో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో దుబాయ్ దాని సమీప ప్రాంతాల్లో భారీ వరదలు ఏర్పడ్డాయి. వరదల కారణంగా ఓ వ్యక్తి తన ఖరీదైన రోల్స్ రాయిస్ కారు బానెట్ మీద కూర్చున్నాడు.
అధిక వర్షాల కారణంగా దుబాయ్ ప్రాంతంలో రోడ్లు, విమానాశ్రయాలు, నివాస పరిసరాలు అన్నీ కూడా నీటితో నిండిపోయాయి. పార్కింగ్ చేసిన కార్లు కూడా ఎక్కడికక్కడ ఉండిపోవాల్సి పరిస్థితి ఏర్పడింది. దుబాయ్ వరదల్లో తన రోల్స్ రాయిస్ కారు నీళ్లలో ఉన్న వీడియో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ కారు బానెట్ మీదనే కూర్చును అరటిపండు, రెడ్ బుల్ తాగడం కూడా ఇక్కడ గమనించవచ్చు.

ఎరుపు రంగులో ఉన్న రోల్స్ రాయిస్ కారు బానెట్ మీద ఫారెక్స్ వ్యాపారి మిస్టర్ పిప్స్ ఉండటం గమనించవచ్చు. నీళ్లలో చిక్కుకున్న కారును బయటకు తీయడానికి రికవరీ వ్యాన్ లేదా ట్రక్కు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్ అని తెలుస్తోంది. ఈ కారు బంపర్ కూడా నీటిలో ఉండటం గమనించవచ్చు.
ఖరీదైన కారు కావడంతో దాని యజమాని సున్నితంగా రికవరీ చేసుకోవడానికి వేచి చూస్తున్నారు. ఈ వీడియోలో టయోటా ల్యాండ్ క్రూయిజర్, నిస్సాన్ పెట్రోల్ వంటివి కూడా నీళ్లలో ఉండటం గమనించవచ్చు. ఇవన్నీ గమనిస్తే.. దుబాయ్ ప్రాంతంలో ఎంతటి తీవ్రమైన వర్షాలు పడ్డాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

వీడియోలో కనిపించే రోల్స్ రాయిస్ ఘోస్ట్ ప్రస్తుత తరం అని తెలుస్తోంది. ఇది అల్యూమినియం స్పేస్‌ఫ్రేమ్ పొందుతుంది. ఇది ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటిగా ఉంది. కాబట్టి మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. నిజానికి రోల్స్ రాయిస్ కార్లను కేవలం ధనవంతులు మాత్రమే కొనుగోలు చేస్తుంటారు. దీనికి కారణం అధిక ధర అని తెలుస్తోంది.
రోల్స్ రాయిస్ ఘోస్ట్ 6.75 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ12 ఇంజిన్ పొందుతుంది. ఇది 571 పీఎస్ పవర్ మరియు 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ నాలుగు చక్రాలకు శక్తిని పంపదాటనికి ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. కావున అద్భుతమైన పనితీరును అందిస్తుంది. కాబట్టి వాహన వినియోగదారులు మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.
సాధారణంగా ఆధునిక నగరాల్లో కూడా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోతే వరదలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. ఆ సమయంలో మనుషులతో పాటు వాహనాలు కూడా వరదల్లో చిక్కుకుంటాయి. వరదల్లో చిక్కుకున్న వాహనాలను బయట తీయడం మాత్రమే కాదు, వాటికి రిపేర్ చేయించుకోవడానికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బహుశా ఆ వాహనాలు అంతకు ముందు మాదిరి పనిచేయకపోవచ్చు.

వరదల్లో చిక్కుకున్న కార్లు లేదా బైకులను చెక్ చేయడానికి ముందు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు. చెక్ చేయకుండా స్టార్ట్ చేస్తే ఇంజన్‌కు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా నిపుణల వద్ద వాహనాలను చెక్ చేయించుకోవాలి. అంతకంటే ముందు కార్లను తప్పకుండా సురక్షితమైన ప్రదేశాల్లో పార్కింగ్ చేయడం మంచిది. లేకుంటే వరదల సమయంలో ఇలాంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








