దేశంలో రూ. 6 కోట్ల ఖరీదైన కారు తొలి డెలివరీ.. ఫీచర్లు, స్పోర్టీ లుక్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.!!
భారత్‌లో ఫెరారీ పురోసాంగ్యూ ఎస్‌యూవీ(Ferrari Purosangue SUV) బోణీ కొట్టింది. 2022 లో గ్లోబల్ అరంగేట్రం చేసిన ఈ ఎస్‌యూవీని తాజాగా తొలిసారిగా భారత్‌కు చెందిన ఓ కస్టమర్ కొనుగోలు చేశారు. మరి ఈ విదేశీ కారులోని స్పెషాలిటీస్ ఏంటి.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
ప్రముఖ విదేశీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ బ్రాండ్ నుంచి పురోసాంగ్యూ ఎస్‌యూవీని మొదటిసారిగా భారత్‌లోని ఓ కస్టమర్ సొంతం చేసుకున్నారు. బెంగూళూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. ఇటాలియన్ ఎక్సోటిక్ కార్‌మేకర్ యొక్క ఈ మొదటి ఎస్‌యూవీ 2022 లో గ్లోబల్ మార్కెట్లో ప్రవేశించగా.. దేశంలో మొదటిసారి బ్రెన్ గ్యారేజ్ అని పిలువబడే భూపేష్ రెడ్డి సొంతం చేసుకున్నారు.

ఈ కారు గురించి ఇంతలా మాట్లాడుకోవడానికి కారణం దీని ధర, లగ్జరీ లుక్. లగ్జరీ ferrari Purosangue Performance ధర అక్షరాల రూ. 6.5 కోట్లు. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఈ కారు డెలివరీలు ప్రపంచవ్యాప్తంగా గతేడాది ప్రారంభమయ్యాయి. కాగా భారత్‌లో ఈ ఏడాదే తొలి బోణీ కొట్టింది. ఈ కారు V12 ఇంజిన్‌తో పనిచేస్తుంది.
Purosangue ఫెరారీ యొక్క మొదటి నాలుగు-డోర్లు, నాలుగు-సీటర్ మోడల్.. ఇది నీరో డేటోనా బ్లాక్ షేడ్‌లో బ్లాక్ వీల్స్ మరియు ఇరికో ఇంటీరియర్‌తో పూర్తయి.. అద్భుతమైన స్పెక్‌లో అందుబాటులో ఉంది. ఇంటీరియర్ విషయానికొస్తే.. క్యాబిన్ రెండవ వరుసలో రెండు సీట్లతో సహా స్పోర్ట్స్ సీట్లతో పాటు అల్కాంటారా లెదర్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంకా వెనుక సీట్లను రియర్-హింగ్డ్ డోర్స్ ద్వారా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ ఫెరారీ స్పోర్ట్స్‌కార్ లో-స్లంగ్ రూఫ్‌తో పాటు పొడవాటి బోనెట్, కూపే రూఫ్‌లైన్, షార్ట్ ఓవర్‌హాంగ్‌లు వంటి కీలకమైన డిజైన్ అంశాలతో ఆకర్షణీయంగా ఉంది. అధిక 180 mm గ్రౌండ్ క్లియరెన్సను కలిగి ఉంటుంది. అయితే ఇది సాంప్రదాయ రెండు-డోర్ల ఫెరారీకి భిన్నంగా ఉండటం విశేషం.
పూర్తి లగ్జరీ సౌకర్యాలతో దీనిని సంస్థ రూపొందించింది. ఇంజిన్ విషయానికొస్తే.. పురోసాంగ్యూ 715 bhp పవర్ మరియు 716 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6.5-లీటర్ V12 ఇంజిన్ సహాయంతో పనిచేస్తుంది. ఈ మోటారు 2-స్పీడ్ పవర్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది 8-స్పీడ్ DCT రియర్-సెట్ డ్యూయల్-క్లచ్ యూనిట్ ద్వారా నాలుగు చక్రాలకు శక్తి సరఫరా అవుతుంది.

ఈ సూపర్ కారు కేవలం 3.3 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. కాగా కేవలం 10.6 సెకన్లలో 0 నుంచి 200 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. పురోసాంగ్యూ గరిష్ఠంగా గంటకు గంటకు 310 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. పనితీరు పరంగా ఇందులో యాక్టివ్ సస్పెన్షన్, సిరామిక్ బ్రేక్‌లు, ముందు చక్రాల వద్ద టార్క్ వెక్టరింగ్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ ఫోర్-వీల్ స్టీరింగ్‌ను అందించింది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఫెరారీ పురోసాంగ్యూ పర్ఫామెన్స్‌కు చాలా డిమాండ్ ఉంది. ఈ ఎస్‌యూవీకి వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగానే ఉంది. అత్యంత ఆచరణాత్మకంగా ఇటాలియన్ సంస్థ దీనిని రూపొందించింది. ఇందులోని ఫీచర్లు, అధిక పనితీరు గల ఇంజిన్ ఆధారంగా ఈ కారు ధర రూ. కోట్లలో ఉండటానికి కారణం.


Click it and Unblock the Notifications








