Flopped Cars భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయిన కార్లు ఇవే..
భారత మార్కెట్లో నిత్యం కొత్త మోడళ్లలో కార్లు విడుదలవుతూనే ఉన్నాయి. లేదా ప్రస్తుతం ఉన్న కార్లకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లు లాంచ్ అవుతుంటాయి. అయితే కొన్ని కార్లు అత్యంత ప్రజాదరణ పొందినా.. మరికొన్ని కార్లు మాత్రం మార్కెట్లో పోటీ తట్టుకోలోక లాంచ్ అయిన కొన్ని రోజులకే కనుమరుగై(Flopped Cars) పోతుంటాయి. ఆ కార్లేంటో ఈ కథనంలో చూద్దాం..
Maruti Kizashi: 2011లో దేశంలో మారుతి నుంచి కిజాషి విడుదలైంది. ఈ కారును సంస్థ సమర్థవంతంగా లాంచ్ చేసినప్పటికీ.. వివిధ కారణాల వల్ల విఫలమైంది. ఈ కారు ఫెయిల్ అవడానికి ప్రధాన కారణంగా CBU గా భారత్‌కు రావడం. భారీ పన్నుల కారణంగా ఈ కారు ధర దాదాపు రూ. 16 లక్షలుగా ఉంది.

ఆ సమయంలో మారుతి కిజాషి కారు ధర రూ. 16 లక్షలు అంటే చాలా ఎక్కువగా ఉండటంతో ప్రజలు దీనిపై ఆసక్తి కనబరచలేదు. అంతే కాకుండా మారుతి ఆ సమయంలో దీనిని ప్రీమియం బ్రాండ్‌గా చూడకపోవడంతో.. ప్రజలు అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి కొనుగోలు చేయలేకపోయారు. వీటితో పాటు కిజాషిలో డీజిల్ ఇంజిన్ లేకపోవడం మరో పెద్ద మైనస్..

Toyota Yaris: మారుతి సుజకి, హ్యుందాయ్ వెర్నా కార్లకు పోటీగా టయోటా Yaris విడుదలైంది. అయినా ఈ కారు సేల్స్ చార్ట్‌లో ఎప్పుడూ స్థానం దక్కించుకోకపోవడం గమనార్హం. మంచి డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లు, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో సమర్థవంతంగా ఈ కారును లాంచ్ చేసినప్పటికీ.. ధర ప్రభావం, డీజిల్ ఇంజిన్ లేకపోవడంతో ఇది విఫలమైంది. కాగా గ్లోబల్ మార్కెట్లో ఈ కారు విక్రయానికి అందుబాటులో ఉంది.
Skoda Octavia Combi: భారత మార్కెట్లో ఫ్లాప్ అయిన మరో కారు స్కోడా ఆక్టావియా కాంబి. భారీ అంచనాలతో 2002లో ఆక్టావియా కాంబిని స్కోడా విడుదల చేసింది. అయితే సేల్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మార్కెట్లో దీనిని నిలిపేసింది. యూరోపియన్ డిజైన్, సూపర్ ప్రాక్టికాలిటీ, గొప్ప పనితీరుతో లాంచ్ అయినప్పటికీ.. విజయవంతం కాలేదు. కాగా భారత మార్కెట్లో మంచి బూట్ స్పేస్‌తో ఉన్న ఇలాంటి స్పోర్ట్స్ కార్ల అవసరం ఉంది.

Skoda Yeti: స్కోడా Yeti లాంచ్ సమయంలో ఏ ఇతర ఎస్‌యూవీ లేని విధంగా.. దాని యూరోపియన్ డిజైన్ మరియు జర్మన్ నాణ్యతతో భారీ అంచనాలతో విడుదలైంది. ఇది 4×2 మరియు 4×4 సామర్థ్యాలతో 2.0-లీటర్ ఇంజిన్‌తో లాంచ్ అయింది. అయితే ఈ ఎస్‌యూవీ ధర కూడా టయోటా ఫార్చ్యూనర్‌కు దగ్గరగా ఉండటంతో.. కస్టమర్లు ఎక్కువగా ఫార్చ్యూనర్‌పైనే మొగ్గు చూపారు. దీంతో ఈ కారు ఉత్పత్తిని సంస్థ నిలిపేసింది.
Tata Hexa: మార్కెట్లో భారీ అంచనాలతో విడుదలైన టాటా హెక్సా.. లాంచ్ అయిన కొద్ది రోజులకే ఘోరంగా ఫ్లాప్ అయింది. డిజైన్ నుంచి, ఇంటీరియర్ క్యాబిన్ ఫీచర్ల వరకు అధునాతనంగా టాటా మోటార్స్ రూపొందించింది. హెక్సా డ్రైవింగ్, పనితీరుపై కస్టమర్ల నుంచి మంచి ఆదరణ కూడా పొందింది. అయితే మహీంద్రా XUV500, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి గట్టి పోటీదారుల కారణంగా హెక్సా అమ్మకాలు తగ్గిపోయాయి. పోటీ తట్టుకోలేక ఉత్పత్తి ఆగిపోయింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








