కారు కొనాలని చూస్తున్నారా.. తక్కువ ధరలో ది బెస్ట్‌ పెట్రోల్‌ ఆటోమేటిక్ కాంపాక్ట్‌ ఎస్‌యూవీలు ఇవే.!

భారత మార్కెట్లో గత కొంతకాలంగా కాంపాక్ట్ SUV సెగ్మెంట్ కొత్త అప్‌డేట్‌లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్స్‌లో హ్యుందాయ్ క్రెటా మరియు హోండా ఎలివేట్ ఇంకా అనేక కొత్త మోడల్‌లు సెగ్మెంట్‌లో ఆధిపత్యం చెలాయిస్తాయి. ఈ క్రమంలో సరసమైన ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్‌ 5 పెట్రోల్‌ ఆటోమేటిక్ కాంపాక్ట్(Affordable Automatic Petrol Compact SUVs) SUVల గురించి ఈ కథనంలో..

సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్: సిట్రోయెన్ ఇటీవలే సెగ్మెంట్‌లోని కొత్త మోడల్‌లలో ఒకటైన C3(Citroen C3 Aircross) ఎయిర్‌క్రాస్‌తో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది ఈ సెగ్మెంట్‌లో అత్యంత సరసమైన ఆటోమేటిక్ ఆఫర్‌. ధర రూ. 12.85 లక్షల నుంచి రూ. 13.85 లక్షల(ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది.

Citroen-C3-Aircross

ఈ మోడల్‌ను ప్రారంభంలో సిట్రోయెన్ 2023లో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో ప్రవేశపెట్టగా.. ఇటీవల, సిట్రోయెన్ SUV ఆరు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఎంపికను కూడా అందిస్తోంది. సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 110 PS శక్తిని మరియు 205 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఐదు మరియు ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌ను అందించే విభాగంలో ఇది ఏకైక మోడల్‌గా ఉంది.

Honda-Elevate

హోండా ఎలివేట్: పెట్రోల్ ఆటోమేటిక్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ జాబితాలో రెండవ అత్యంత సరసమైన మోడల్‌ 2023 హోండా ఎలివేట్‌(Honda Elevate). ఇది 1.5 లీటర్ నేచురల్లీ అస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 121 PS గరిష్ట శక్తిని మరియు 145 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్‌తో అందుబాటులో ఉండగా.. రూ. 13.41 లక్షలు-16.20 లక్షల మధ్య కొనుగోలు చేయవచ్చు.

మారుతి గ్రాండ్ విటారా: మారుతి గ్రాండ్ విటారా(Maruti Grand Vitara) జాబితాలో మూడవ అత్యంత సరసమైన ఆటోమేటిక్ కాంపాక్ట్ SUV మోడల్. పెట్రోల్ వేరియంట్‌లు 1.5-లీటర్ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. 103 PS పవర్‌తో పాటు 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ధర రూ. 13.60 లక్షల నుండి రూ. 16.91 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉన్నాయి.

Maruti-Grand-Vitara

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్: టయోటా హైరైడర్(Toyota Urban Cruiser Hyryder)ను మారుతి గ్రాండ్ విటారా రీబ్యాడ్జ్ వెర్షన్‌గా ప్రవేశపెట్టారు. దీని ధర మారుతి మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. గ్రాండ్ విటారా మాదిరిగానే అదే 1.5-లీటర్ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

Toyota-Urban-Cruiser-Hyryder

టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ హైరైడర్‌ 103 PS వద్ద 137 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే ట్రాన్స్‌మిషన్ మరియు డ్రైవ్‌ట్రెయిన్ కాంబినేషన్‌లను కలిగి ఉంది. హైబ్రిడ్ మినహాయించి దీని ధర రూ. 14.01 లక్షల నుండి 17.24 లక్షల(ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది.

వోక్స్‌వ్యాగన్ టైగూన్: చివరగా, వోక్స్‌వ్యాగన్ టైగూన్(Volkswagen Tiguan) సెగ్మెంట్‌లోని అత్యంత సరసమైన పెట్రోల్ ఆటోమేటిక్ కాంపాక్ట్ SUVలలో ఐదవ స్థానంలో ఉండగా.. 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్‌తో జతచేయబడి ఉంటుంది. 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 115 PS పవర్‌తో 178 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ధర రూ. 15.43 లక్షల నుంతి 18.08 లక్షల మధ్య అందుబాటులో ఉంది.

Volkswagen-Taigun

కాగా టైగూన్ మరింత శక్తివంతమైన 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో కూడా పనిచేస్తుంది. ఇది 150 PS వద్ద 250 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT)తో జత చేయబడి ఉంటుంది. టైగూన్‌ DCT మోడల్ ధర రూ. 17.36 లక్షల నుండి రూ. 20 లక్షల ధరలో కొనుగోలు చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, February 5, 2024, 12:46 [IST]
English summary
Five most affordable petrol compact suvs citroen c3 aircross to volkswagen taigun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+