కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్‌లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
ఫోర్డ్ కారు ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ కంపెనీ ఇండియాలో సరికొత్త ఎస్‌యూవీని అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి తాజాగా ఆ సంస్థ కొత్త SUVని భారత్‌లో ట్రేడ్‌మార్క్ చేసింది. కంపెనీ నుంచి అందిన నివేదికల ప్రకారం ఫోర్డ్ ఇండియా భారతదేశంలో 'టెరిటరీ' పేరును ట్రేడ్‌మార్క్ చేసింది.
ఈ కొత్త ఫోర్డ్ SUV వచ్చే సంవత్సరం 2025 నాటికి దేశంలో సేల్స్ ఆరంభం అయ్యే అవకాశం ఉంది. ఈ కారు ఇప్పటికే పలు దేశాల్లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఫోర్డ్ ప్రస్తుతం ఈ SUVని చైనా, మెక్సికో, దక్షిణాఫ్రికా మరియు వియత్నాం వంటి ఇతర దేశాలలో విక్రయిస్తోంది. చైనాలోనూ ఇది 'టెరిటరీ' బ్రాండ్ పేరుతో విక్రయించబడుతోంది.

ఇక ఈ కారు డిజైన్ గురించి మాట్లాడితే.. టెరిటరీ క్లాసీగా కనిపించే SUVగా ఉండనుంది. ఇది సి-షేప్ ఆకారంలోని గ్రిల్‌ని కలిగి ఉంటుంది. దీని చుట్టూ LED DRLలను గమనించవచ్చు. ఈ SUVలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీని ప్రధాన LED హెడ్‌లైట్ సెటప్ బంపర్‌పై వచ్చేలా డిజైన్ చేశారు. ఇక సైడ్ ప్రొఫైల్‌లో, వీల్ ఆర్చ్‌లు అల్లాయ్ వీల్స్‌ని గమనిచంచవచ్చు.
ఇది పొడవు సుమారు 4600 మిమీ ఉంటుంది. దాదాపు 2700mm వీల్ బేస్ కలిగి ఉంటుంది. చుట్టూ పక్కల C-ఆకారపు LED టైల్‌లైట్ల సెట్, వెనుక స్పాయిలర్ మరియు షార్ప్ లైట్‌ని కలిగి ఉంటుంది. మొత్తానకి ఈ కారు Safari మరియు XUV700 మాదిరి డిజైన్‌లో ఉంటుంది.

2025 ఫోర్డ్ టెరిటరీ ఇంటీరియర్: ఫోర్డ్ టెరిటరీలోని ఇంటీరియర్‌లో క్లీన్ మరియు అధునాతన లేఅవుట్‌ను గమనించవచ్చు. ఈ ఎస్‌యూవీ మధ్యలో కనెక్ట్ చేయబడిన స్క్రీన్‌లు ఉన్నాయి. ఇది ఇన్స్ట్రుమెంట్ గేజ్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం రెండు 12.3-అంగుళాల LCDలను కలిగి ఉంది. ఇవి కాకుండా, ఈ SUV ఇతర అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.
దీనిలోని సీట్లు మరియు స్టీరింగ్ వీల్ కోసం పూర్తి లెదర్ ట్రిమ్ ఉండనుంది. 10-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు 4-వే అడ్జస్టబుల్ ఫ్రంట్ ప్యాసింజర్ సీటుతో వస్తుంది. ఇది ట్విన్-ప్యానెల్ పనోరమిక్ మూన్‌రూఫ్, మల్టీ-కలర్ LED యాంబియంట్ లైటింగ్ మరియు 8-స్పీకర్ ఆడియో సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ADAS టెక్నాలజీని టెరిటరీలో అందిస్తుంది.

బ్లైండ్ స్పాట్ (BLIS), బ్యాక్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, ఫార్వర్డ్ కొలిజన్ అలర్ట్ మరియు లేన్ కీప్ అసిస్ట్‌తో పాటు అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇక దీని ఇంజిన్ విషయానికి వస్తే 1.8-లీటర్ 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ మోటార్ సుమారు 185 bhp వద్ద 318 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఉత్పత్తి చేయబడిన శక్తి మొత్తం ముందు చక్రాలకు పంపబడుతుంది.
ఇక ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడుతుంది. అంతర్జాతీయ మోడల్ నాలుగు డ్రైవింగ్ మోడ్‌లతో వస్తుంది. అవి సాధారణ, ఎకో, స్పోర్ట్, మౌంటైన్ మోడ్‌లుగా ఉన్నాయి. భారతదేశంలోని మహీంద్రా XUV700 మరియు టాటా సఫారీలతో పోటీపడే అవకాశం ఉంది.
ఫోర్డ్ ఇండియా పునరాగమనం: ఫోర్డ్ కార్స్‌కి భారత్‌లో క్రేజ్ ఎక్కువగానే ఉంది. తాజాగా ఫోర్డ్ ఇండియా భారతదేశానికి పునరాగమనం కోసం ప్లాన్ వార్తతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. దేశంలో అన్ని సర్వీసింగ్ సెంటర్లతో పాటు షోరూంలను సంస్థ పూర్తిగా నిలిపివేసింది. ఫోర్డ్ ఎండీవర్‌కి భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. ఫోర్డ్ కార్లు మార్కెట్‌లోకి వస్తే భారీ డిమాండ్ పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








