చిన్న ఫ్యామిలీకి అద్బుతమైన మోడల్.. ఇండియాలోకి ఫ్రెంచ్ ఎలక్ట్రిక్ కారు.. కామెట్‌కు గట్టి పోటీ తప్పదు!

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయి. మార్కెట్లో విడుదల అవుతున్న కార్లలో ఎక్కువగా ఈవీలే ఉంటున్నాయి. సాంప్రదాయ ఇంధన వాహనాలతో పోలిస్తే వీటికి డిమాండ్ గత ఏడాది కంటే ఈ సారి బాగా పుంజుకుంది. దీంతో ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీలు ఉన్నటువంటి టాటా మోటార్స్, మహీంద్రా, హ్యూందాయ్ వంటి మొదలగునవి కొత్త కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నాయి. ఇండియాలో ఈవీ మార్కెట్ ప్రపంచ దేశాలతో పోలిస్తే మెరుగ్గా ఉంది. దేశీయ వాహన మార్కెట్లో లాభాలను సాధించడానికి మంచి అవకాశాలు ఉండటంతో అంతర్జాతీయంగా పేరున్న కార్ల తయారీ కంపెనీలు ఇండియాలో ఈవీ వాటాను దక్కించుకోడానికి పోటా పోటీగా ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఈవీలో పోటీ తీవ్రం కావడంతో బ్యాటరీ, ఫీచర్లు, పెర్ఫామెన్స్‌తో ప్రజలను ఆకట్టుకుని ఎక్కువ మంది కస్టమర్లకు చేరడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భారత్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌‌లో తన హవాను చూపించడానికి ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ లిజియర్ (ligier) తన ఎలక్ట్రిక్ కారును ఇక్కడ లాంచ్ చేయబోతుంది. రాబోయే కోత్త మోడల్ పేరు 'లిజియర్ మైలీ (ligier myli)'. ఈ కారును తాజాగా భారత రోడ్లపై టెస్టింగ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. అయితే ఈ కారును టెస్టింగ్ చేయడం ఇదే మొదటిసారి కాదు.

Ligier Myli Electric Car

గతంలో కూడా మైలీ ఎలక్ట్రిక్ కారును పరీక్షించారు. ఈ మోడల్ భారత్‌లో ముఖ్యంగా ఎంజీ మోటార్స్ (MG Motors)కు చెందిన కామెట్ (Comet) ఎలక్ట్రిక్ కారుకు ప్రధాన పోటీ ఇవ్వనుంది. భారత్‌లో కామెట్ ఈవీ మంచి డిమాండ్ ఉన్న మోడల్. ఇది చిన్నగా ఉన్నప్పటికీ కూడా పెర్ఫామెన్స్ విషయంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ధర కూడా అందరు కొనగలిగే అందుబాటులోనే ఉంటుంది. చిన్న కుటుంబానికి ఈ కారు బాగా సరిపోతుంది.

రోజువారీ అవసరాల కోసం దగ్గరి ప్రాంతాలకు వెళ్లడానికి కామెట్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి ప్రత్యర్థిగా లిజియర్ మైలీ నిలుస్తుంది. ఈ కారు కూడా చూడటానికి చిన్నగా ఉంటుంది. చిన్న కుటుంబానికి సరిపోతుంది. ఇది 2 డోర్ ఆప్షన్‌లో రాబోతుంది. లిజియర్ కంపెనీ మైక్రో కార్ల తయారీలో మంచి మార్కెట్ కలిగి ఉంది. ఈ కంపెనీని మాజీ రేసింగ్ డ్రైవర్, రగ్బీ ప్లేయర్ గై లిగియర్ స్థాపించారు.

Ligier Myli Electric Car Tested

ఈ 2-డోర్ ఎలక్ట్రిక్ కారు పూణేలో తాజాగా కనిపించింది. ARAI ద్వారా దీని ఫోటోలను క్లిక్ చేశారు. మైలీ కారు G.OOD, I.DEAL, E.PIC, R.EBEL అనే నాలుగు వేరియంట్‌లలో రాబోతుంది. ఇది దాదాపు ఎనిమిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని టాప్ వేరియంట్ R.EBEL మాత్రం డ్యూయల్-టోన్ బాడీ క్లాడింగ్‌‌తో ఆకర్షణీయమైన కలర్‌ను కలిగి ఉంటుంది. ఈ మోడల్ ఫ్రంట్ గ్రిల్‌ కూడా ప్రత్యేక డిజైన్‌ను సంతరించుకుంది.

G.OOD, I.DEAL వేరియంట్లు ఒక్క ఛార్జ్‌తో 63 కిమీల వరకు ప్రయాణిస్తుంది. అదే E.PIC,R.EBEL వేరియంట్లు సింగిల్ ఛార్జ్‌తో 123 కిమీల వరకు రేంజ్ అందిస్తాయి. మైలీ హై పెర్ఫార్మెన్స్ రేంజ్ అనే ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ మోడ్‌‌లో రెండు టాప్ వేరియంట్లు ఒకే ఛార్జ్‌పై 192 కిమీ పరిధి వరకు ప్రయాణం చేస్తాయి.

Ligier Myli Electric Car In India

E.PIC, R.EBEL వేరియంట్లు 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్‌, రివర్స్ కెమెరా వంటి వాటిని కలిగి ఉంటాయి. అదే I.DEAL వేరియంట్ 14-అంగుళాల అల్లాయ్ వీల్స్‌‌తో వస్తుంది. దీనిలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సింగిల్-డిన్ ఆడియో సిస్టమ్‌ను అందించారు.

More from DriveSpark

Article Published On: Tuesday, December 31, 2024, 10:30 [IST]
English summary
French company ligier myli electric car tested in india
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+