మారుతి ఫ్రాంక్స్ కొత్త ఎడిషన్ గురించి తెలుసా!.. ఇది చూడండి
భారతీయ విఫణిలో అత్యధిక ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) మొదటిసారి 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించింది. ఆ తరువాత దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తూ అత్యత్తమ అమ్మకాలను పొందగలిగింది. ఈ తరుణంలో కంపెనీ 'ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్' పేరుతో ఓ సరికొత్త మోడల్ లాంచ్ చేసింది. మారుతి సుజుకి లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ ఎంతోమంది వాహన ప్రేమికులను మొదటి చూపులోనే ఆకర్శించింది. ఈ కారు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..
మారుతి సుజుకి లాంచ్ చేసిన కొత్త ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్.. మూడు ఇంజిన్ ఎంపికలతో 14 వేరియంట్లలో లభిస్తుంది. ఈ కొత్త కారు దాని మునుపటి మోడల్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది. కాబ్బటి ఇందులో అనేక కాస్మెటిక్ ట్వీక్స్ మరియు స్టాండర్డ్ యాక్సెసరీస్ పొందుతుంది. దీంతో ఈ కారు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే ఇందులో ఎటువంటి మెకానికల్ మార్పులు లేదు.

కొత్త మారుతి ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్.. 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. 1.2 లీటర్ యూనిట్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది 88 Bhp పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
ఇక 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది 99 Bhp పవర్ మరియు 148 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ స్పెషల్ ఎడిషన్ మంచి పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్ యొక్క సిగ్మా వేరియంట్ బ్లాక్ అండ్ రెడ్ ఫ్రంట్ బంపర్ గార్నిష్, హెడ్‌ల్యాంప్, వీల్ ఆర్చ్ గార్నిష్‌లు మరియు ఫ్రంట్ గ్రిల్ గార్నిష్‌లతో వస్తుంది. డెల్టా ట్రిమ్‌లు (డెల్టా, డెల్టా ప్లస్ మరియు డెల్టా ప్లస్ (ఓ)) బాడీ సైడ్ మౌల్డింగ్‌లో అదనపు రెడ్ కలర్ ఇన్సర్ట్‌లు, బ్లాక్ అండ్ ఎరుపు పెయింట్ రియర్ బంపర్ గార్నిష్ వంటివి పొందుతాయి.
వీటితో పాటు ఈ వేరియంట్స్ ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ గార్డ్, రెడ్ డాష్ డిజైనర్ మ్యాట్, నలుపు అండ్ రెడ్ స్పాయిలర్ ఎక్స్‌టెండర్, డోర్ వైజర్‌లు, ఓఆర్వీఎం రెడ్ డాష్ ఫినిషింగ్ మరియు బ్యాక్ డోర్ గార్నిష్‌ల వంటివి పొందుతాయి. ఇవన్నీ వాహన వినియోగదారులను ఆకర్శించడమే కాకుండా మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించడంలో కూడా చాలా సహాయపడతాయి.
మారుతి సుజుకి యొక్క ఫ్రాంక్స్ కారు.. భారతదేశంలో ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందింది. కంపెనీ ఈ కారును మార్కెట్లో లాంచ్ చేసినప్పటి నుంచి ఏకంగా 1.5 లక్షల యూనిట్లను విక్రయించినట్లు సమాచారం. కాగా కంపెనీ ఇప్పుడు స్పెషల్ ఎడిషన్ రూపంలో మార్కెట్లో మరో కారును లాంచ్ చేసింది. ఇది కూడా తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








