రూ. 2 లక్షలకే ఎలక్ట్రిక్ ఆటో విడుదల.. 95 కి.మీ రేంజ్‌, ఇంట్లోనే ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు, ఇంకా మరెన్నో ఫీచర్లు

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది. అందులో భాగంగా కొత్త కొత్త ఎలక్ట్రిక్‌ కంపెనీలు ఈ మార్కెట్‌లోకి ప్రవేశించి సక్సెస్‌ సాధించాయి. వీటికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పలు రకాల సబ్సిడీల ద్వారా ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలకు పెంచేందుకు ప్రోత్సాహకాలను అందించాయి. దీంతో ఈ రంగం అతి తక్కువ కాలంలోనే మంచి మార్కెట్‌ని సాధించింది. ఎలక్ట్రిక్ విభాగంలో ఎక్కువగా టూవీలర్స్‌, కార్లు, ఇతర కమర్షియల్‌ వెహికిల్స్‌ అమ్ముడవుతున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో రాణిస్తున్న గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ తన కొత్త ఇబ్లూ సెటీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను (Eblu Cety Electric Auto) అమ్మకానికి విడుదల చేసింది.

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంటంతో అన్ని ఎలక్ట్రిక్‌ తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు కూడా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగా గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ కూడా త్రీ వీలర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను విడుదల చేసింది. ఇబ్లూ సెటీ ప్రపంచ ఈవీ దినోత్సవం (World EV Day) సందర్భంగా ఈ ఆటోను లాంచ్ చేసింది.

Eblu Cety Auto Rikshaw Launches

అయితే కొత్తగా ఆ కంపెనీ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ ఈ-రిక్షా చూడటానికి ఇతర ఆటో రిక్షాల కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆటో వెడల్పు తగ్గించి.. పొడవు భారీగా పెంచి సరికొత్త డిజైన్‌లో ప్రవేశ పెట్టారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా 2795 మిమీ పొడవు, 993 మిమీ వెడల్పు, 1782 మిమీ ఎత్తుని కలిగి ఉంటుంది.

ఈ కొత్త గోదావరి ఇబ్లూ ఎలక్ట్రిక్ ఆటోను ఎక్కువ సీటింగ్ కెపాసిటీతో రూపొందించారు. ఇందులో సాధారణం కంటే ఎక్కువ మంది ప్రయాణించవచ్చు. డ్రైవర్ వెనుక, ప్రయాణీకులు అపోజిట్‌ పొజిషన్‌లలో కూర్చోవచ్చు. డ్రైవర్ సీటు కూడా చాలా వెడల్పుగా ఉంటుంది. ఇంత సౌలభ్యం ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను కేవలం రూ. 1,99,999 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Eblu Cety Auto Rikshaw

ఈ ఆటో ముందు మరియు వెనుక చక్రాల మధ్య 2170 మిమీ దూరం ఉంది. అంతే కాకుండా ఈ ఆటో 240 మిమీ గ్రౌండ్‌ క్లియరెన్స్‌ని కలిగి ఉండేలా మంచి ఎత్తులో ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ఆటోను ఏ కఠినమైన రోడ్లలోనూ తీసుకెళ్లవచ్చు. కొత్త ఆటో రిక్షా ఆటోమేటిక్ వైపర్లతో వస్తుంది.

అయితే ఫర్ఫామెన్స్‌ పరంగా కొంచెం ఇది నెమ్మదిగా ప్రయాణిస్తుంది. దీని ఆటో గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమేనని గోదావరి ప్రకటించింది. 51.2 వోల్ట్స్‌, 100 యాంపియర్ లిథియం అయాన్‌ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 95 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది 1.6kWh పవర్‌, 20 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

Eblu Cety Electric Auto

దీనిని 48 వోల్ట్, 20-యాంపియర్ ఛార్జర్‌ ద్వారా ఛార్జ్ చేయవచ్చు.. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు పడుతుంది. సస్పెన్షన్‌లో విషయంలో ముందు భాగంలో టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్, కాయిల్ స్ప్రింగ్స్‌తో కూడిన డ్యూయల్ ఫోర్క్స్‌ వెనుక భాగంలో లీఫ్ కాయిల్స్‌ ఉంటాయి. ఈ ఆటోలో ప్రయాణీకులకు ఎక్కువ లెగ్ రూమ్‌ స్పేస్‌ ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటి చిన్న డిజైన్‌ ఎలక్ట్రిక్ ఆటోలు సులభంగా ప్రయాణిస్తాయి. ఇవి ట్రాఫిక్ జామ్‌లలోనూ డ్రైవ్‌ చేయడానికి సింపుల్‌గా ఉంటుంది. ఈ ఆటోపై 1 సంవత్సరం లేదా 20,000 కిలోమీటర్ల వారంటీని.. బ్యాటరీ మరియు ఛార్జర్‌పై 3 సంవత్సరాల లేదా 80,000 కిలోమీటర్ల వారంటీని కూడా అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 10, 2024, 13:27 [IST]
English summary
Godawari electric motors launches new eblu cety auto at rs 199999
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+