హోండా కార్లపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్.. ఏకంగా రూ.1.20 లక్షలు!
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ 'హోండా' (Honda) ఈ నెలలో ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. ఇంతకీ కంపెనీ ఏ మోడల్స్ మీద డిస్కౌంట్స్ అందిస్తోందనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
హోండా ఎలివేట్ (Honda Elevate)
దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆకర్షణీయమైన అమ్మకాలు పొందుతున్న 'ఎలివేట్' SUV మీద కంపెనీ ఇప్పుడు రూ. 50000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎలివేట్ కొనుగోలు మీద ఎక్స్చేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి ఆఫర్స్ అందుబాటులో లేదు. కొనుగోలుదారు తప్పకుండా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న హోండా ఎలివేట్ ధర రూ. 11.58 లక్షల నుంచి రూ. 16.20 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు మంచి డిజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఈ SUV అమ్మకాలు నెలకు సగటున 4000 యూనిట్లగా నమోదవుతున్నాయి.
హోండా అమేజ్ (Honda Amaze)
హోండా కంపెనీ యొక్క అమేజ్ కొనుగోలు మీద ఇప్పుడు కస్టమర్ ఏకంగా రూ. 90000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ. 35000 వరకు క్యాష్ డిస్కౌంట్ లేదా రూ. 41653 విలువైన ఫ్రీ యాక్ససరీస్ వంటి బెనిఫిట్స్ మాత్రమే కాకుండా రూ. 20000 వరకు కార్పొరేట్ బోనస్, రూ. 10000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ. 40000 వరకు లాయల్టీ బోనస్ లభిస్తుంది.

హోండా ఇప్పుడు అమేజ్ యొక్క ఎలైట్ ట్రిమ్ కొనుగోలు మీద రూ. 30000 వరకు స్పెషల్ ఎడిషన్ బెనిఫిట్స్ అందిస్తుంది. హోండా అమేజ్ 1.2 లీటర్ ఫోర్ సిలినాద్ర పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందించే ఈ సెడాన్ ధర రూ. 7.16 లక్షల నుంచి రూ. 9.92 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది.
హోండా సిటీ (Honda City)
నిజానికి హోండా కంపెనీ పేరు వినగానే 'సిటీ' కారు గుర్తొస్తుంది. కంపెనీ ఇప్పుడు ఈ కారు కొనుగోలు మీద రూ. 1.20 లక్షల ప్రయోజనాలను అందిస్తుంది.ఇందులో రూ. 30000 వరకు క్యాష్ డిస్కౌంట్ లేదా రూ. 32196 వరకు ఫ్రీ యాక్ససరీస్ లభిస్తాయి. వీటితో పాటు రూ. 15000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ. 20000 వరకు కార్పొరేట్ బోనస్, రూ. 4000 లాయల్టీ బోనస్ పొందవచ్చు.

హోండా సిటీ ఎలిగెంట్ ట్రిమ్ కొనుగోలుపైన రూ. 36500 వరకు స్పెషల్ ఎడిషన్ బెనిఫిట్స్ మరియు వీఎస్ మరియు జెడ్ఎక్స్ ట్రిమ్స్ మీద రూ. 13651 విలువైన ఎక్స్‌టెండేడ్ వారంటీ లభిస్తాయి. ఈ నెలలో సిటీ హైబ్రిడ్ వేరియంట్ల కొనుగోలు మీద ఆఫర్స్ అందుబాటులో లేదు. హోండా సిటీ ధర రూ. 11.71 లక్షల నుంచి రూ. 16.19 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంది.
Note: హోండా కంపెనీ ఇప్పుడు అందిస్తున్న ఈ ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ డిస్కౌంట్ స్టాక్ మరియు లభ్యత వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని అందించే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో హోండా సిటీ, అమేజ్, ఎలివేట్ వంటి వాటిని కొనాలనుకునే వారు సమీపంలో ఉన్న డీలర్షిప్ వద్ద డిస్కౌంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోగలరు.


Click it and Unblock the Notifications








