ఆ కారుపై రూ. 1.12 లక్షల వరకు డిస్కౌంట్.. మళ్లీ ఈ కారు ధర తగ్గకపోవచ్చు!
జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా తన కంపెనీలోని లైనప్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఆ కంపెనీ అందించే ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, లాయల్టీ, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ కంపెనీలోని ఫేమస్ కారు హోండా అమేజ్ దాదాపు రూ.1.12 లక్షల వరకు డిస్కౌంట్‌ని ప్రకటించింది. ప్రముఖ హోండా అమేజ్ సెడాన్ టాప్ స్పెక్ VX మరియు ఎలైట్ వేరియంట్లపై రూ .1.12 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. సెడాన్ మిడ్ స్పెక్ వేరియంట్ S, బేస్ వేరియంట్ E లపై వరుసగా రూ.92,000, రూ.82,000 డిస్కౌంట్‌ని అందిస్తుంది.
హోండా అమేజ్ భారత మార్కెట్‌లో మారుతి డిజైర్(Dzire), హ్యుందాయ్ ఆరా (Hyundai Aura) వంటి వాటికి గట్టి పోటీని ఇస్తుంది. హోండా అమేజ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజిన్ 89bhp పవర్, 110nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా కాంపాక్ట్ సెడాన్ పాత మోడల్ కంటే అమేజ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసింది.

హోండా అమేజ్ ఫ్రంట్ బంపర్, కొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సీ-ఆకారంలో LED టెయిల్‌ల్యాంప్స్, LED DRLs, ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. హోండా కాంపాక్ట్ సెడాన్ పాత మోడల్ కంటే అమేజ్ ఫేస్ లిఫ్ట్ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసింది. కారు ముందు భాగంలో కొత్త ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఇతర మార్పులు చేసింది.
ఇక ఇంటీరియర్‌లో స్వచ్ఛమైన గాలి కోసం అప్‌గ్రేడ్ చేసిన క్యాబిన్ ఫిల్టర్‌ని జోడించింది. ఈ డ్యాష్ బోర్డులో శాటిన్ సిల్వర్ యాక్సెంట్, క్లైమేట్ కంట్రోల్, హోండా స్మార్ట్ కీ, పుష్ బటన్ స్టార్ట్ ఉన్నాయి. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కమాండ్స్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

హోండా అమేజ్ అనేక సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. EBD, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లతో కూడిన డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్, ఎబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, సీట్ బెల్ట్ రిమైండర్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కాబట్టి ఇందులో సేఫ్టీ ఎక్కువే అని చెప్పాలి.
హోండా అమేజ్ మెటియోరాయిడ్ గ్రే, ప్లాటినం పెరల్ వైట్, లూనార్ సిల్వర్, గోల్డెన్ బ్రౌన్ మరియు రేడియంట్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుత హోండా అమేజ్ ఫేస్ లిఫ్ట్ మునుపటి మోడల్‌తో పోలిస్తే కారు పరిమాణంలో ఎటువంటి మార్పులు లేవు. ఇది 3,995 మిమీ పొడవు, 1,695 మిమీ వెడల్పు, 1,498 మిమీ ఎత్తుని కలిగి ఉంది. ఈ కారు వీల్ బేస్ పొడవు 2,470 మిమీ లుగా ఉంది.
హోండా అమేజ్ ఎక్స్‌టీరియర్ మెరిసే క్రోమ్ హైలైట్స్‌తో వస్తుంది. ఓఆర్వీఎంలు, టెయిల్ ల్యాంప్స్, ట్రంక్, డోర్ వైజర్, విండో లైన్, డోర్స్ కింది భాగంలో అమర్చుకోవచ్చు. షార్ప్ ట్రంక్ స్పాయిలర్, బాడీ సైడ్ మోల్డింగ్, డోర్ హ్యాండిల్ ప్రొటెక్టర్, మడ్ ఫ్లాప్స్, బంపర్ ప్రొటెక్టర్లను ఎంచుకోవచ్చు. అయితే మేము పైన తెలిపిన డిస్కౌంట్స్ సిటీని బట్టి మారుతాయి. కావున మరింత సమాచారం కోసం మీ దగ్గర్లోని డీలర్‌ని సంప్రదించండి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








