క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
తాజాగా ప్రముఖ ఆటో మొబైల్ బ్రాండ్లకు సంబంధించి కార్ల క్రాష్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో పలు కార్లు సాధించిన స్టార్ రేటింగ్‌లను వెల్లడించాయి. ఈ క్రమంలో హోండా కార్స్ ఇండియాకు చెందిన ప్రముఖ సెడాన్ అమేజ్‌కు కూడా క్రాష్ టెస్ట్ నిర్వహించారు. మరి Honda Amaze ఎలాంటి ఫలితాలు సాధించింది. ఈ కథనంలో చూద్దాం.
గత కొన్నేళ్లుగా భారతీయ కార్ల మార్కెట్లో స్థిరమైన స్థానాన్ని సాధించేందుకు హోండా కార్స్ కృషి చేస్తోంది. టూ వీలర్ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతున్న హోండా.. కార్ల సేల్స్‌లో మాత్రం పోటీని తట్టుకోలేకపోతుందనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం హోండా నుంచి అమ్మకాల్లో దూసుకుపోతున్న SUVలు ఏవీ లేకపోవడమే.

కాగా ప్రస్తుతం భారతదేశంలో హోండా(Honda Cars India) నుంచి అమ్మకానికి అందుబాటులో ఉన్న కార్లు హోండా సిటీ మరియు హోండా అమేజ్ మాత్రమే. త్వరలో హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల కానుంది. కాగా తాజా గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్ కేవలం 2 స్టార్ రేటింగ్‌ను సాధించింది. అమేజ్ కార్ల యజమానులను మరియు కొత్తగా అమేజ్ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గట్టి షాక్ అని చెప్పవచ్చు.
ఈ క్రమంలో గ్లోబల్ NCAP ఇటీవల తన క్రాష్ టెస్ట్ నిబంధనలను అప్‌డేట్ చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలకు లోబడి హోండా అమేజ్ పరీక్షించబడింది. ఈ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు 5 కి గాను 2 స్టార్ రేటింగ్‌ను గ్లోబల్ ఎన్‌క్యాప్ అందించింది. ఇక అడల్ట్ సేఫ్టీ విభాగంలోనే ఈ 2 స్టార్ రేటింగ్ కాగా.. ఛైల్డ్ సేఫ్టీ విభాగంలో మాత్రం సున్నా రేటింగ్‌ను పొందడం ఆశ్చర్యకరం.

అయితే 2019లో జరిగిన గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్ పెద్దల భద్రత విభాగంలో 4 స్టార్ మరియు పిల్లల భద్రత విభాగంలో 1 స్టార్ రేటింగ్‌ను పొందింది. కానీ అప్పుడు గ్లోబల్ NCAP పాత నిబంధనల మేరకు క్రాష్ టెస్ట్ నిర్వహించేది. అంతే కాకుండా 2019 లో సౌత్ ఆఫ్రికా మేడ్ హోండా అమేజ్ కారుకు 2019లో క్రాష్ టెస్ట్ నిర్వహించారు.
కాగా ఇప్పుడు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక.. 2024 గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో మేడ్ ఇన్ ఇండియా అమేజ్ కారు క్రాష్ టెస్ట్‌కు గురైంది. ప్రస్తుతం నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో, అమేజ్ కారులో ఉన్న చైల్డ్ డమ్మీల తల ముందుభాగం ఢీకొనడంతో తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా నివేదిక వెల్లడించింది. తాకిడి సమయంలో 3 ఏళ్ల డమ్మీ ఛైల్డ్ ఛాతీ మరియు మెడ ప్రాంతం అధిక ఒత్తిడిని ఎదుర్కొంది.

ఇంకా ఏడాదిన్నర డమ్మీ పాప ముందు భాగంలో ఢీకొన్న ప్రమాదంలో కారు నుంచి బయటకు వచ్చేంత వరకు దెబ్బతిన్నట్లుగా రిపోర్ట్ చెబుతుంది. 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు లేకపోవడం మరియు ఎయిర్‌బ్యాగ్ డిస్‌కనెక్ట్ స్విచ్ లేకపోవడం వల్ల పిల్లల భద్రత విభాగంలో అమేజ్ కారు '0' స్టార్ రేటింగ్‌తో ఉంది.
అదేవిధంగా, ఫ్రంట్-సీట్ ప్రయాణీకుల తల నియంత్రణలకు ఆప్షనల్ సైడ్ ప్రొటెక్షన్ లేకపోవడం, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ నియంత్రణ(ESC) లేకపోవడం నెగిటివ్ పాయింట్లు. ఇంకా డ్రైవర్‌కు మాత్రమే సీట్ బెల్ట్ రిమైండర్ వంటి అంశాలు అమేజ్‌కి పెద్దల భద్రతలో 2 స్టార్ రేటింగ్ పొందేలా చేశాయి.
ఈ క్రమంలో గ్లోబల్ ఎన్‌సీఏపీ రేటింగ్‌లపై హోండా కార్స్ ఇండియా స్పందించింది. అమేజ్ కొత్త నిబంధనల ప్రకారం 5-స్టార్ రేటింగ్ ఉన్న కారు అని, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు లేకపోవడం వల్ల కారు మార్కులను తగ్గించవచ్చని హోండా పేర్కొంది. మేడ్-ఇన్-ఇండియా అమేజ్ ఈ క్రాష్ టెస్ట్‌కు గురైనప్పటికీ, ఇది అప్‌డేటెడ్ వెర్షన్ కారు కాదని గమనించాలి.


Click it and Unblock the Notifications








