హోండా కార్లపై కొనసాగుతున్న డిస్కౌంట్ల జాతర.. 3 ఏళ్ల మెయింటైనెన్స్‌ ప్యాకేజీ పూర్తిగా ఉచితం

దేశంలో కార్ల వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. భారత్‌లో కార్ల ధరలు కొద్దిగా ఎక్కువే అని చెప్పాలి. ఈ మధ్య కంపెనీలు కూడా కార్ల ధరలు పెంచేస్తున్నాయి. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలు సొంత కారు కల కలగానే మిగిలిపోతుంది. ధరలు ఎక్కువగా ఉండటంతో వారు కాస్త వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి వారి కోసం ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హోండా' భారీ ఆఫర్‌లను ప్రకటించింది. ఇప్పటి వరకు లేని విధంగా కంపెనీ లైనప్‌లోని ఎలివేట్, అమేజ్, సిటీ, సిటీ eHEV కార్లపై ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు కొనుగోలుదారులకు కాస్త ఊరటే అని చెప్పాలి.

ఆగస్టు 15న ఇండిపెండెన్స్‌ డేని పురస్కరించుకని ఫ్రీడమ్‌ ఆఫర్లను (Honda Freedom Offers) అందిస్తున్నట్లు హోండా కార్ ఇండియా తన 'ఎక్స్' (గతంలో ట్విట్టర్‌)లో పోస్ట్ చేసింది. ఫ్రీడమ్ ఫెస్ట్ క్యాంపెయిన్ కింద భారీ డిస్కౌంట్‌లతో పాటు, కారు కొనుగోలుపై 3 సంవత్సరాల ఉచిత మెయింటెనెన్స్ ప్యాకేజీని కూడా ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్లు తక్షణమే అమల్లోకి తీసుకువచ్చినట్లు హోండా వెల్లడించింది.

Honda-Freedom-Offers

కంపెనీ ప్రకటించిన ఆఫర్ల ప్రకారం అమేజ్‌పై రూ .96,000 సిటీ eHEVపై రూ .88,000, సిటీపై రూ .90,000, ఎలివేటర్ కార్లపై రూ .65,000 నుంచి బెనిఫిట్స్‌ని అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్‌ ఎప్పటి వరకు కొనసాగుతుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. అయితే ఆగస్టు 15 వరకు ఈ ఆఫర్‌ని అందించే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.

కొత్త హోండా అమేజ్ సెడాన్ ధర రూ .7.20 లక్షల నుంచి0 రూ .9.96 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంది. ఇది E, S & VX అనే వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 5 మంది సులభంగా ప్రయాణించవచ్చు. ఇది 1.2 4 సిలింటర్‌ NA పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది లీటరుకు 18.3 నుంచి 18.6 కి.మీ మైలేజీ ఇస్తుంది.

Honda-Amaze-Freedom-Offers

కొత్త అమేజ్ సెడాన్‌లో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఆటో ఎల్ ఇడి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, క్రూయిజ్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), రియర్ వ్యూ కెమెరా ప్రయాణికులకు మంచి సేఫ్టీని అందిస్తాయి.

ఇక హోండా నుంచి అందుబాటులో ఉన్న పాపులర్ ఎస్‌యూవీగా ఎలివేట్‌ అవతరించింది.]దీని ధర రూ .11.91 లక్షల నుంచి రూ .16.51 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ ఎస్‌యూవీ SV, V, VX, ZX అనే వేరియంట్లలో లభిస్తుంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది లీటరుకు 15.31 నుంచి 16.92 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

Honda-Elevate-Freedom-Offers

హోండా ఎలివేట్ ఎస్‌యూవీలో 10.25 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగులు, ఏడీఏఎస్ (అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.

హోండా సిటీ సెడాన్ విషయానికి వస్తే, దీని ధర రూ .12.08 లక్షల నుంచి రూ .16.35 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది లీటరుకు 18.4 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇందులో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయి.

ఈ హోండా ఫ్రీడమ్ ఫెస్ట్‌లో భాగంగా 3 సంవత్సరాల ఉచిత మెయింటెనెన్స్ ప్యాకేజీని అందిస్తుంది. అయితే ఈ ఆఫర్లు ఎన్ని రోజులు అందుబాటులో ఉంటాయనే దానిపై ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు. ఆసక్తి గల కస్టమర్లు, మరింత సమాచారం కోసం సమీప షోరూమ్‌ని సందర్శించడం ద్వారా పూర్తి వివరాలను అడిగి తెలుసుకోవచ్చు. ఈ ఆఫర్లతో సేల్స్‌ పెరుగుతాయని హోండా భావిస్తోంది. డిమాండ్‌ని బట్టి ఆఫర్లపై నిర్ణయం తీసుకోనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 6, 2024, 16:46 [IST]
English summary
Honda car india announced freedom offers huge discounts and 3 years maintenance package free
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+