27 కి.మీ మైలేజీ ఇచ్చే మంచి 5 సీటర్ కారుని రూ. 90000 తక్కువ ధరతో కొనుగోలు చేయండి!
దసరా, దీపావళికి భారీ మొత్తంలో కార్ల తయారీ కంపెనీలు డిస్కౌంట్లు, ఆఫర్లను కంపెనీలు అందించాయి. ఈ ఆఫర్ల ప్రకటనతో భారీ మొత్తంలో అమ్మకాలు ఊపందుకున్నాయి. అక్టోబర్ 2024 చాలా వరకు ఆటోమోటివ్ బ్రాండ్లు మంచి సేల్స్‌ని సాధించాయి. పండుగ సీజన్ తర్వాత కూడా కంపెనీల వద్ద భారీ మొత్తంలో స్టాక్స్ ఉన్నాయి. దీంతో కొన్ని కంపెనీలు ఆఫర్లను ఇంకా కొనసాగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా ఇప్పుడు తన కంపెనీ లైనప్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ ఫెస్టివల్ సీజన్‌లో కారు కొనలేకపోయిన వారు ఆఫర్లలో ఆ కంపెనీ కార్లను కొనుగోలు చేయవచ్చు.
హోండా సిటీ: ఈ పాపులర్ మిడ్ సైజ్ సెడాన్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీనిని రూ .1.07 లక్షల వరకు తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. వేరియంట్లను బట్టి ఈ ఆఫర్ మారుతూ ఉంటుంది. 3 పాయింట్స్ సీట్ బెల్ట్స్ లేని సిటీ మోడళ్లపై గత నెలలో భారీ డిస్కౌంట్లకు కంపెనీ అందించింది. ఇప్పుడు ZX వేరియంట్స్‌పై బెనిఫిట్స్ పొందవచ్చు.

ఇతర వేరియంట్లపై రూ.92,300 వరకు ఆఫర్‌ని కంపెనీ అందిస్తోంది. మీరు ఒకవేళ సిటీ హైబ్రిడ్ కారును ఇదే నెలలో కొనుగోలు చేస్తే రూ.90,000 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ హైబ్రిడ్ కారు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 121 bhp పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిటీ 5th జనరేషన్ సెడాన్ ధర రూ .11.82 లక్షల నుంచి రూ .16.35 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంది. అలాగే సిటీ హైబ్రిడ్ ధరలు రూ.19 లక్షల నుంచి రూ.20.55 లక్షల మధ్య ఉన్నాయి. ఈ కార్లు మార్కెట్‌లో నేరుగా హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లేవియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి సెడాన్‌లకు గట్టి పోటీని ఇస్తుంది.

ఇక హోండా సిటీ కొత్త వెర్షన్ అమ్మకాలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త మోడల్ ఇప్పుడు బ్రెజిల్ మార్కెట్‌లో అమ్మకానికి ఉంది. హోండా నుంచి అందుబాటులో ఉన్న మరో కారు అమేజ్. ఈ కాంపాక్ట్ సెడాన్‌కి కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. గత ఆరు సంవత్సరాలుగా అమేజ్ కొత్త వెర్షన్ భారీ అప్‌గ్రేడ్స్‌తో రానుంది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి రానుంది.
అమేజ్‌కి అతిపెద్ద ప్రత్యర్థి అయినా మారుతి సుజుకి డిజైర్ కొత్త తరం మోడల్ ఈ నెలలో మార్కెట్‌లోకి రానుండటంతో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. గత నెలలో హోండా అమేజ్‌పై మొత్తం రూ .1.12 లక్షల బెనిఫిట్స్ అందించింది. అయితే 2024 డిజైర్ లాంచ్ అవుతుండటంతో నవంబర్‌లో డిస్కౌంట్లను రూ.1.26 లక్షలకు పెంచారు. ఇది మరింత మంది కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంటుంది.

మార్కెట్‌లో హోండా అమేజ్ ధర రూ .7.20 లక్షల నుంచి రూ .9.96 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంటుంది. ఇక హోండా ఎలివేట్‌పై రూ.75,000 నుంచి రూ.86,100ల వరకు డిస్కౌంట్‌ని పొందవచ్చు. ZX వేరియంట్‌పై రూ.86,100 వరకు, ఇతర వేరియంట్లపై రూ.76,100 వరకు బెనిఫిట్స్ పొందొచ్చు.
అంతే కాకుండా స్పెషల్ ఎక్స్‌టీరియర్ కిట్‌తో వచ్చే ఎలివేట్ ఎస్‌యూవీ అపెక్స్ ఎడిషన్ ధర కూడా తగ్గింది. ఎలివేట్ అపెక్స్ ఎడిషన్‌ని ఎంచుకునే వారు రూ.56,100 వరకు ఆదా చేసుకోవచ్చు. సిటీ సెడాన్ మాదిరిగానే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఎలివేటర్ ధర రూ.11.69 లక్షల నుంచి రూ.16.71 లక్షల మధ్యలో ఉంది.


Click it and Unblock the Notifications








