జపాన్‌ చేరుతున్న హోండా కారు ఇదే!.. మేడ్-ఇన్ ఇండియా అంటే అట్లుంటది

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ బ్రాండ్ 'ఎలివేట్'.. 2023 సెప్టెంబర్ నెలలో దేశీయ విఫణిలో లాంచ్ అయింది. ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలు పొందుతున్న ఈ SUV ఎగుమతుల్లో కూడా తన హవా కొనసాగిస్తోంది.

సెప్టెంబర్ 2023లో లాంచ్ అయినప్పటి నుంచి హోండా ఎలివేట్ సుమారు 30365 యూనిట్లను డీలర్‌లకు పంపింది. ఈ SUV సేల్స్ ప్రారంభమైనప్పటి నుంచి 2024 ఫిబ్రవరి చివర వరకు మిడ్‌సైజ్ వాహన విభాగంలో రెండవ అత్యధిక అమ్మకాలు పొందిన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. హోండా కంపెనీ మొత్తం 79513 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించి అమ్మకాల్లో 38 శాతం వాటాను కలిగి ఉంది.

Honda Elevate

కంపెనీ మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో అమేజ్ సేల్స్ 33339 యూనిట్లు కాగా.. సిటీ సేల్స్ 15809 యూనిట్లుగా నమోదైంది. హోండా ఎలివేట్ కూడా అమ్మకాల్లో 1.32 శాతం వాటాను కలిగి ఉంది. ఈ కారు మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, కియా సెల్టోస్ మరియు ఎంజీ ఆస్టర్ వంటి వాటికి అమ్మకాల్లో గట్టి పోటీ ఇస్తోంది.

హోండా కంపెనీ భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా జపాన్ దేశంలో కూడా మంచి అమ్మకాలను నమోదు చేయడానికి ఎగుమతి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. మేడ్ ఇన్ ఇండియా కారును కంపెనీ రాజస్థాన్ టపుకరా ప్లాంట్ నుంచి ఎగుమతి చేస్తోంది. అయితే కంపెనీ ఈ కారును జపాన్ మార్కెట్లో డబ్ల్యుఆర్-వీ (WR-V) లేదా విన్సమ్ రన్‌అబౌట్ వెహికల్ అనే బ్యాడ్జ్‌తో విక్రయిస్తోంది.

Honda Elevate Interior

అదే 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన జపాన్ మోడల్ కూడా ఇండియా మోడల్‌తో సమానంగా ఉంటుంది. అయితే ఇది బ్లాక్ అండ్ బేజ్ అనే డ్యూయెల్ టోన్ కలర్ పొందుతుంది. ఇండియా మోడల్ లేత గోధుమరంగు క్యాబిన్ కలిగి ఉంటుంది. జపాన్ మోడల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ పొందుతుంది. మొత్తానికి ఇండియా మోడల్ మాదిరిగానే జపాన్ మోడల్ కూడా వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని సమాచారం.

ఎస్ఐఏఎమ్ నివేదికల ప్రకారం (SIAM)..

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) డేటా ప్రకారం 2024 ఫిబ్రవరి చివరి నాటికి హోండా కార్స్ ఇండియా జపాన్‌కు ఎగుమతి చేసిన ఎలివేట్స్ సంఖ్య రూ. 6809 యూనిట్లు. గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎగుమతుల వేగం పెరిగింది. గత జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే కంపెనీ 6472 యూనిట్లను ఎగుమతి చేసినట్లు సమాచారం.

Honda Elevate Running Shot

జపాన్‌లో హోండా మోటార్ కో 2024 మార్చి 22 నుంచి డబ్ల్యు-వీ అమ్మకాలను ప్రారంభించడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ నెలకు 3000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే సంవత్సరానికి కంపెనీ 36000 యూనిట్లను విక్రయించడానికి ప్లాన్ వేస్తోంది. అనుకున్న విధంగా అన్నీ జరిగితే ఎగుమతుల్లో హోండా కార్స్ ఇండియా ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందని తెలుస్తోంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, March 14, 2024, 12:00 [IST]
English summary
Honda cars india exported 6809 units of elevates to japan
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+