ఈ హోండా కార్లపై బంపర్‌ ఆఫర్‌.. రూ. లక్ష వరకు తగ్గింపులు, ఈ నెలాఖరు వరకే.!!

కొత్త సంవత్సరం సందర్భంగా కస్టమర్లకు హోండా కంపెనీ(Honda Cars India) అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. హోండాకు చెందిన సిటీ, అమేజ్‌ 2023, 2024 మోడల్స్‌పై జనవరిలో రూ. లక్ష వరకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఇక హోండాకు చెందిన ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ కారు సిటీ e:HEV 2023 మోడల్‌పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి.

జపాన్ ఆటో మేకర్‌ హోండా కార్స్ ఇండియా.. కొత్త సంవత్సరంలో కస్టమర్లకు గణనీయమైన తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తోంది. కొత్తగా కారు కొనాలనుకునేవారు హోండా కార్‌ ఇండియా డీలర్‌షిప్‌ల ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 2024 జనవరి నెలలో హోండా అందిస్తున్న డిస్కౌంట్లలో నగదు ప్రయోజనాలు, కార్పొరేట్‌ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్‌, లాయల్టీ బోనస్‌ ఉన్నాయి.

Honda-City-e-HEV

ఈ జనవరిలో 2024 సిటీ e:HEV మోడల్‌పై ఎలాంటి ఆఫర్లను ప్రకటించనప్పటికీ.. 2023 మోడల్‌పై రూ. లక్ష వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇది మొత్తంగా క్యాష్ డిస్కౌంట్ మాత్రమే. దీంట్లో అదనపు ప్రయోజనాలు లేవు. Honda City e:HEV అనేది ఐదవ-తరం సిటీ మోడల్‌కు స్ట్రాంగ్‌-హైబ్రిడ్ వెర్షన్‌గా ఉంటుంది.

ఇందులో అదే 1,498cc, నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. e-CVT గేర్‌బాక్స్‌తో రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో వస్తుంది. ఒక ఎలక్ట్రిక్ మోటార్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. దీని ద్వారా వెనుక బ్యాటరీ ప్యాక్‌ ఛార్జ్ అవుతుంది. రెండవ మోటార్ - ట్రాక్షన్ మోటార్.. ఇది బ్యాటరీ నుంచి శక్తిని తీసుకుంటుంది. సిటీ e.HEV ధర రూ. 18.89-20.39 లక్షల మధ్య ఉంది.

Honda-City

కొత్త సంవత్సరం జనవరిలో హోండా సిటీపై.. హోండా డీలర్లు పెద్ద మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తున్నారు. హోండా సిటీపై రూ. 88,600 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ. 40,000 వరకు నగదు తగ్గింపు, రూ. 4,000 వరకు లాయల్టీ బోనస్, రూ. 6,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 25,000 వరకు ప్రత్యేక కార్పొరేట్ ప్రయోజనాలను పొందవచ్చు.

అదనంగా హోండా సిటీ VX మరియు ZX ట్రిమ్‌లపై రూ. 13,600 ధరతో పొడిగించిన వారంటీ (నాల్గవ మరియు ఐదవ సంవత్సరాలు)ని అందిస్తోంది. కాగా ఈ పొడిగించిన వారంటీ 2023 మరియు 2024 మోడల్‌లకు అందుబాటులో ఉందని గమనించాలి. ఈ కారు ధర రూ. 11.63 లక్షల నుంచి రూ. 16.11 లక్షల మధ్య ఉంది.

హోండా సిటీ భారత మార్కెట్లో హ్యుందాయ్‌ వెర్నా, వోక్స్‌ వ్యాగన్‌ వర్టస్‌, స్కోడా స్లావియా, మారుతి సియాజ్‌లకు గట్టి పోటీనిస్తోంది. హోండా సిటీ 1.5-లీటర్, నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 121hp పవర్‌ మరియు 145 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది.

Honda-Amaze

హోండాకు చెందిన మరో మోడల్‌ హోండా అమేజ్ 2023 మరియు 2024 వెర్షన్‌లోని పలు వేరియంట్లపై జనవరిలో రూ. 72,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. హోండా అమేజ్‌ S ట్రిమ్‌పై రూ. 45,000 వరకు నగదు తగ్గింపు, రూ. 4,000 వరకు లాయల్టీ రివార్డ్‌, రూ. 23,000 వరకు కార్పొరేట్ తగ్గింపులను పొందవచ్చు.

హోండా అమేజ్‌ E మరియు VX ట్రిమ్‌లపై, వరుసగా రూ. 52,000, రూ. 62,000 వరకు తగ్గింపులు ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ కారు ధర రూ. 7.10 లక్షల నుంచి రూ. 9.86 లక్షల మధ్య ఉంది. ఇంజిన్‌ విషయానికొస్తే 1.2-లీటర్, నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

Honda-City-Amaze

హోండా అమేజ్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ 90hp మరియు 110Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. విశాలమైన క్యాబిన్‌ ఫీచర్లతో గొప్ప రైడ్ అనుభూతిని పొందవచ్చు. అమేజ్ హ్యుందాయ్ ఆరా మరియు మారుతి సుజుకి డిజైర్‌లకు గట్టి పోటీగా ఉంది. స్టాక్‌ లభ్యత, ప్రాంతం ఆధారంగా ఆఫర్లలో మార్పు ఉంటుందని గమనించాలి.

More from DriveSpark

Article Published On: Thursday, January 4, 2024, 18:10 [IST]
English summary
Honda cars india offers up to rs one lakh on city amaze and city e hev
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+